టార్గెట్.. హైదరాబాద్!
కశ్మీర్ అంశం తర్వాత కేంద్రం తదుపరి లక్ష్యం..
దేశ రెండో రాజధానిగా భాగ్యనగరం
”దేశ రాజధాని ఢిల్లీతో సమానంగా దక్షిణ భారత దేశంలో రెండో రాజధాని అభివద్ధి చెందితే మంచిదే! కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అఖండ భారతావని విస్తరించి ఉన్న దష్ట్యా కేవలం ఒక ప్రాంతాభివద్ధి మాత్రమే కాకుండా మిగిలిన ప్రాంతాల అభివద్ధికి మార్గం సుగమం అవుతుంది. అత్యంత కీలకమైన ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి! అందరి అభిప్రాయాలను తీసుకున్న పక్షంలో ఏ విధమైన అభిప్రాయ బేధాలకు తావుండదు”
-రాజకీయ సామాజిక విశ్లేషకులు
- -దశాబ్దాలుగా వివాదాస్పద అంశాలపై దృష్టిపెట్టిన కేంద్రం
- -దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ చేయాలనే యోచన
-అవసరమైతే కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటన - -దక్షిణాదిలో బీజేపీ బలోపేతానికి దారి
- -ఒకేసారి అటు టీఆర్‌ఎస్, ఇటు వైసీపీకి చెక్
- -దక్షిణాది ప్రాంతీయ పార్టీలకు భారీ షాక్ ఇవ్వనున్న కేంద్రం
- -దక్షిణ భారతదేశానికి గేట్‌వేగా ఉన్న హైదరాబాద్
- -ఉత్తర, దక్షిణ తారతమ్యాలు సరిచేసేందుకు యత్నం
- – దేశభద్రత, పౌర రక్షణ రీత్యా రెండో రాజధాని ఆవశ్యకత
- -ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న అంశం మళ్లీ తెరపైకి..
(నండూరి రవిశంకర్, జ్యోతి న్యూస్)
తెలంగాణాలో కాస్తోకూస్తో పార్టీ బలంగా ఉన్నది. ఇటీవలే తెలంగాణాలో 4 సీట్లు గెలుచుకుంది బీజేపీ. ఇదిలా ఉంటే, దేశంలో రెండో రాజధానిగా హైదరాబాద్‌ను ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు గతంలో ఈ డిమాండ్ చేశారు కూడా. హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేస్తే.. సౌత్ కూడా అభివద్ధి చెందుతుందని గతంలో కొంతమంది నేతలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణా విడిపోయాక.. తెలంగాణా రాజధానికి హైదరాబాద్ ఉన్నది. ఒకవేళ కేంద్రం మదిలో రెండో ఆలోచన ఉంటే.. అది హైదరాబాద్ అయితే.. హైదరాబాద్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది.
ఢిల్లీ లాగా హైదరాబాద్‌ను కూడా ఒక రాష్ట్రంగా మార్చి దానికి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి .. రెండో రాజధానిని ఏర్పాటు చెయ్యొచ్చు. ఇలా చేస్తే తెలంగాణా భారీగా నష్టపోవాల్సి వస్తుంది. తెలంగాణకు ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుంది. ఒకవేళ కేంద్రం మదిలో ఇలాంటి ఆలోచన ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది.. పార్టీలు కేంద్రాన్ని ఎలా ఎదుర్కొంటాయి.. ? ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుంది..? అసలు కేంద్రం అలాంటి ఆలోచనలు చేస్తుందా..? ఏమో చెప్పలేం. దేశంలో ఎక్కడ ఏ చిన్న ఉగ్ర అలజడి జరిగినా దాని మూలాలు హైద్రాబాద్లోని ఉంటున్నాయని గతంలో కొందరు బహిరంగంగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.
రాష్ట్ర విభజన తరువాత కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ప్రపంచ ప్రసిద్ధిచెందిన నగరాల్లో ఒకటిగా నిలిచింది. దేశంలో ఏ నగరంలో జరగని అభివద్ధి హైదరాబాద్‌లో జరుగుతున్నది. తెలంగాణ కొత్తరాష్ట్రం అయినప్పటికీ అభివద్ధిలో ముందంజలో ఉంది. హైదరాబాద్‌లో ఇప్పుడు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్ ఉండటంవల్ల దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు వీలుగా ఉంటుంది. పలు దేశాలకు రెండు రాజధానులు ఉన్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత దేశ రాజధాని ఉత్తర భారతదేశంలో ఉన్నందున దక్షిణ భారతదేశంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాలు, జాతులు ప్రశాంతంగా నివసించే హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా చేస్తే బాగుంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ప్రశాంతంగా ఇక్కడే జీవిస్తున్నారు.
కాబట్టి అన్ని అర్హతలు ఉన్న హైదరాబాద్‌ను భారతదేశ రెండవ రాజధానిగా చేయడం అవసరం. భాషే ప్రధాన సమస్య పరిపాలనా సౌలభ్యం దష్ట్యా దేశానికి రెండో రాజధాని అవసరం లేదు కానీ భాష దష్ట్యా రెండో రాజధాని అవసరం ఉంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న పార్లమెంటులో హిందీ భాషను అధికంగా ఉపయోగిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది హిందీ మాట్లాడేవారే.
దీనితో దక్షిణాది నుండి వెళ్లే యువ ఎంపీలు భాషా సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుండి వెళ్లే వారికి హిందీ భాషపై పట్టు ఉండదు. పార్లమెంటులో కానీ, ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ అవసరమైన సమాచారం తీసుకోవడం, సమస్యలను అధికారులకు, నేతలకు వివరించడం చేయలేక పోతున్నారు. మన కష్టసుఖాలు చెప్పుకోవాలంటే హిందీ రాకపోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనికితోడు దక్షిణాది వారిపట్ల చూపుతున్న నిర్లక్ష్యం కూడా ఇబ్బందిగానే ఉంది. పార్లమెంటులో సమస్యలు ప్రస్తావించేటప్పుడు సభ్యులు ఆ సమస్యలను వింటే వింటారు లేదంటే లేదు. రెండో రాజధాని ఏర్పాటు ఖర్చుతో కూడుకున్నదే అయినప్పటికీ భాషా పరంగా చూస్తే అవసరమే. ఆయా రాష్ట్రాల స్థానిక భాషలలో మాట్లాడేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించినప్పటికీ దక్షిణాది ఎంపీలు తమ దష్టికి తీసుకెళ్లే అంశాలను స్పష్టంగా వివరించలేక పోతున్నారు. మాతభాషలో చెప్పినప్పటికీ మిగతా సభ్యులకు అంటే హిందీ మాట్లాడేవారికి అర్థమయ్యే పరిస్థితి కూడా లేదు. హిందీపై పట్టు రావాలంటే చాలాకాలం పడుతోంది. ఇక దక్షిణాదిలో ఎక్కడ రాజధాని ఏర్పాటు చేస్తామన్న విషయంపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందా అన్నది తేలాల్సి ఉంది.
రెండో రాజధానితో ప్రయోజనమే సువిశాల భారతదేశం విభిన్న ప్రాంతాలు, జాతులు, సంస్క తులతో కూడి ఉంది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకయైన భారతదేశం సమగ్రాభివ ద్ధికి, ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య అభివ ద్ధిలో అసమానతల నివారణకు, దేశ సమగ్రతను మరింత పటిష్టం చేసేందుకు దక్షిణ భారతదేశంలో రెండో రాజధాని ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. రాజ్యంగ నిర్మాత డాక్టర్ బిఆర్. అంబేద్కర్ కూడా రాజ్యంగ రచన సందర్భంగా దేశానికి రెండో రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు.
ఉత్తర, దక్షిణ భారతదేశానికి గేట్‌వేగా ఉన్న హైదరాబాద్ ఇందుకు అనువైనదని అంబ్కేదర్ సైతం చెప్పారు. దేశ రాజధానిలో పెరిగిపోతున్న కాలుష్యం, జనాభా సమస్యలను అధిగమించేందుకు, పరిపాలన మరింత వికేంద్రీకరించేందుకు రెండో రాజధాని ఏర్పాటు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివద్ధి చెందిన నేటి రోజుల్లో పనులన్నీ ఆన్‌లైన్‌లో సాగుతున్నందున పరిపాలన కోణంలో సైతం రెండో రాజధాని ఉపయుక్తం. పెను విపత్తులు, యుద్ధాలు సంభవించినప్పుడు దక్షిణాదిన రాజధాని ఉంటే దేశ పరిపాలన చేసేవారికి ప్రయోజనకరంగా ఉంటుందనేది విశ్లేషకుల భావన.
అలాగే దేశ రాజధానికి చుట్టుపక్కల ఏర్పాటు చేసే వౌలిక వసతుల ప్రాజెక్టులు రెండో రాజధానితో దక్షిణాదికి కూడా దక్కడం ద్వారా అభివద్ధిలో సమతుల్యత సిద్ధిస్తుంది. ఉత్తరాదితో పోల్చితే, జనాభా వారిగా పరిశీలిస్తే దక్షిణాది రాష్ట్రాల వారికి కేంద్ర ఉద్యోగాల్లో, నిధుల కేటాయింపుల్లోగాని, వౌలిక వసతుల ప్రాజెక్టుల విషయంలో సరైన ప్రాతినిధ్యం అందడం లేదు. ఇప్పటికే రైల్వేలో, కేంద్ర బలగాల్లో, ఇతర కేంద్ర ఉద్యోగాల్లో దక్షిణాది వారికి తక్కువ ప్రాధాన్యత దక్కుతుంది. ఇప్పటికే లోక్‌సభలో తాను రెండు పర్యాయాలు రెండో రాజధాని ఏర్పాటును ప్రస్తావించానని అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైతే దీనిపై ఆలోచన లేదని చెప్పింది. నిజానికి కేంద్ర ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పరిపాలన చేసేందుకు, దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య అభివద్ధిలో అసమానతలను నివారణకు, ప్రజల మధ్య మరింత ఐక్యతను పెంచేందుకు దక్షిణాదిలో దేశ రెండో రాజధాని ఏర్పాటు చేయాలని గట్టిగా కోరుతున్నారు సామాజిక విశ్లేషకులు.
పాలనా సౌలభ్యానికి తప్పదు పాలనా సౌలభ్యంతోపాటు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు రెండవ రాజధాని తప్పనిసరి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లు ఢిల్లీలో చిన్నచూపునకు గురవుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలదే పైచేయిగా మారుతోందని మరికొందరి వాదన. దశాబ్దాల కాలంగా వివక్షత కొనసాగుతోంది. అదేమని ప్రశ్నించే సాహసం ఎవరూ చేయడం లేదు. దక్షిణాది రాష్ట్రాల అవసరాలు తీరడం లేదు. ఢిల్లీ కర్రపెత్తనంతో శాసిస్తోంది.
ఈ పరిస్థితుల్లో దక్షిణాదిన ఢిల్లీతోపాటు సమానంగా అభివద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో రెండవ రాజధాని ఏర్పాటు చేస్తే మంచిది. రాజధాని ఏర్పాటైనా అంతిమంగా ఢిల్లీదే పెత్తనం. ఇందుకు ఉత్తరాది హవాయే కారణం. తెలుగు రాష్ట్రాలను విడదీయడం వెనుక ఉత్తరాది ప్రయోజనాలు కూడా ఉండొచ్చంటున్నారు మరికొందరు సామాజిక కార్యకర్తలు.
ఢిల్లీలో దక్షిణాదితోపాటు పశ్చిమ రాష్ట్రాలు కూడా వివక్షతను ఎదుర్కొంటున్నాయి. బ్యూరోక్రాట్లు అనేకమంది దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా కొద్దిమంది ఉత్తరాది అధికారులే శాసిస్తున్నారు. దీంతో రెండవ రాజధాని అవసరం తెరమీదకు వస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన వాటాలు, ఆర్థిక సాయం, జాతీయ సంస్థలు తదితర అంశాల్లోనే తరచూ ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు ఢిల్లీ చుట్టూ తిరగడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రాల అవసరాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి చేరవేసేందుకు రెండవ రాజధాని ఆవశ్యకత ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏకపక్షంగా విధాన నిర్ణయాలు తీసుకునే ముందు రాష్ట్రాలతో చర్చించేందుకు వీలుగా ఉంటుంది. యుపి, బీహార్, ఎంపీ, రాజస్థాన్ ప్రాంతాలకు చెందినవారే ఢిల్లీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. దక్షిణాదిన రాష్ట్రాలను విడగొట్టి సీట్ల సంఖ్య తక్కువ చేయడం కూడా పెత్తనం కొనసాగించేందుకు ప్రధానంగా యుపీఏ ప్రభుత్వం ఆజ్యం పోసింది. అది వారి మెడకే ఉచ్చులా బిగుసుకుంది. రెండవ రాజధాని ఆవశ్యకతను సమయం వచ్చినప్పుడు పార్లమెంటులో ప్రస్థావించవలసిన అవసరం ఎంతైనా ఉంది.