కశ్మీర్‌ టూ కన్యాకుమారి పంద్రాగష్టు వేడుక..

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా మోదీ నేతృత్వంలో 
జమ్మూలో జాతీయజెండా సంబురాలకు ఏర్పాటు సన్నాహాలు 
  • జమ్ముకశ్మీర్‌లో వాడవాడలా జెండా పండుగ సన్నాహాలు 
  • స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి కశ్మీర్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ
  • చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోనున్న మోదీ పేరు 
  • అందుకోసమేనా హడావిడి ‘రద్దు’ నిర్ణయం 
  • రెండు కేంద్ర పాలిత రాష్ట్రాలు కేంద్రం ఆధీనంలోకి.. 
  • ఇక పాక్‌ సరిహద్దు రేఖ, చైనా సరిహద్దు రేఖలపై దృష్టి 
  • కలవరపడుతున్న పాకిస్తాన్‌, చైనాలు 
  • భారత జాతీయతా భావాన్ని కాశ్మీర్‌ లోయలో ప్రతిధ్వనింపజేయడానికి 
  • ఈసారి కశ్మీర్‌ టూ కన్యాకుమారి దాకా జెండా పండుగ వేడుకలు

”కాశ్మీర్‌ ఇన్ని రోజులు మన దేశంలో ఉంటూ, మన దేశ సేవలు పొందుతూ .. భారత దేశ జెండాన్ని అవమానించేవారు. కానీ వారు మన దేశ జెండాను అవమానిస్తుంటే ఏమి చేయలేని నిస్సహాయత. మన కళ్ళు ముందు దేశ జెండాను తగుల బెడుతుంటే ఇన్నాళ్లు చేతులు కట్టుకుని కూర్చున్నాము. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మోడీ ప్రభుత్వం కాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను, ప్రత్యేక అధికారాలను పార్లమెంట్‌లో రద్ధు చేయడంతో ఇప్పుడు కాశ్మీర్‌ భారత్‌లో సంపూర్ణంగా విలీనం అయిపొయింది. అయితే ఎట్టకేలకు బీజేపీ కాశ్మీర్‌ను భారత్‌లో సంపూర్ణంగా విలీనం చేసి కాశ్మీర్‌ గడ్డ మీద భారతదేశ జెండాను ఎగరవేయబోతున్నారు. ఏ పీఎం తీసుకోలేని నిర్ణయం మోదీ తీసుకున్నారు కాబట్టి, మోదీ చరిత్రలో నిలిచి పోవటం ఖాయం. అయితే ఈ ఆగష్టు 15 మోదీ .. కాశ్మీర్‌లో జెండా ఎగరేస్తాడని సమాచారం..” 

హైదరాబాద్‌:  -ఇప్పుడు కాశ్మీర్‌ అన్ని కేంద్ర ప్రాంతాల మాదిరి అది కూడా ఒకటి. భారత దేశంలో అమలయ్యే అన్ని చట్టాలు అక్కడ అమలవుతాయి. ఇన్నీ రోజులు మన కళ్లెదుటే భారత్‌ జెండాను తగలబెట్టి, పాకిస్థాన్‌ జెండాను ఎగురవేశారు. కానీ వారి మీద చట్ట పరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి. నిజానికి కాశ్మీర్‌ కు అటువంటి అధికారాలను కట్ట బెట్టింది. ఆనాటి మన ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రు. అప్పుడే అటువంటి చట్టాలు కాశ్మీర్‌ కు ఇవ్వకుండా ఉంటే, కాశ్మీర్‌ ఇప్పటికి యుద్ధ భూమిగా మారేది కాదు. హైదరాబాద్‌ స్టేట్‌ ను అయితే ఎలా డీల్‌ చేయొచ్చో కాశ్మీర్‌ ను కూడా అలానే డీల్‌ చేసే అవకాశం అప్పుడు కూడా ఉన్నది. 
కానీ నెహ్రూ అనాలోచిత నిర్ణయం వల్ల కాశ్మీర్‌ ఇప్పుడు ఇలా తయారైంది. అయితే ఎట్టకేలకు బీజేపీ కాశ్మీర్‌ ను భారత్‌లో సంపూర్ణంగా విలీనం చేసి కాశ్మీర్‌ గడ్డ మీద భారతదేశ జెండాను ఎగరవేయబోతున్నారు. ఏ పీఎం తీసుకోలేని నిర్ణయం మోడీ తీసుకున్నారు కాబట్టి, మోడీ చరిత్రలో నిలిచి పోవటం ఖాయం. అయితే ఈ ఆగష్టు 15 మోడీ .. కాశ్మీర్‌ లో జెండా ఎగరేస్తాడని సమాచారం వస్తుంది. అందుకే మోడీ ఇంత వేగంగా కాశ్మీర్‌ మీద నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏ రద్దు చేశాక కాశ్మీర్‌కు మన రాజ్యాంగంలో స్వయంప్రతిపత్తిని కలిగిస్తున్న నిబంధనలు ఇవి. 370 ప్రకారం పార్లమెంట్‌లో చేసే చట్టలేవీ కాశ్మీర్‌లో అమలు చేసే అవకాశం ఉండదు. ఇక 35ఏ.. ఇది కశ్మీరీల శాశ్వత హక్కుల నిబంధన. ఇప్పుడు ఇవి రద్దు చేశాక దేశంలోని మిగతా రాష్ట్రాల్లో లానే అక్కడ ఇతర రాష్ట్రాల వారు ఆస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం దొరుకుతుంది. అలాగే పార్లమెంట్‌ చేసే చట్టాలన్నీ ఇక్కడ అమలు చేసే అవకాశం ఉంటుంది. 
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం 
మరోకోణంలో చూస్తే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం కూడా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ రాష్ట్రపతి పాలన ఉంది. ఎలాగైనా ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం బీజేపీ లక్ష్యంగా భావిస్తున్నారు. కానీ, ఎన్నికల కోసం ఇంత హడావుడి చేసే అవసరం లేదు. పైగా మాజీ ముఖ్యమంత్రుల్ని గహ నిర్బంధమూ చేయక్కర్లేదు. పంద్రాగస్టు పండగ చేయాలని భావిస్తున్నారన్నదీ ఒక వాదన. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కాశ్మీర్‌ లో ప్రతి పల్లెలోనూ జాతీయ జెండా ఎగిరేలా చేయాలనీ, దాని ద్వారా భారత జాతీయతా భావాన్ని కాశ్మీర్‌ లోయలో పెరిగేలా చేయాలనీ కేంద్రం భావిస్తున్నట్టు చెబుతున్నారు. కానీ, ఇంత సైన్యాన్ని మొహరించి మరీ జాతీయతా భావాన్ని పెంపొందించాల్సిన పరిస్థితి ఇప్పటికిప్పుడైతే లేదు. భారత్‌ జెండాలు ఎగుర వేయడానికి కొన్ని పల్లెల్లో అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దాని కోసం ప్రపంచం దష్టి మొత్తం మన దేశంపై పడేలా చేసి.. కాశ్మీర్‌లో భారత వ్యతిరేకత ఉందనిపించేలా చేసే అవకాశం కనిపించడం లేదు. జమ్మూ, కాశ్మీర్‌ను రెండు భాగాలుగా విభజన చేసింది కేంద్రం. దీనివలన ఒకే దెబ్బకు మూడు ప్రయోజనాలు కలుగుతాయని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది. ఎందుకంటే.. తీవ్రవాదం.. పాకిస్తాన్‌ అనుకూలంగా ఉండే ప్రాంతాలు కాశ్మీర్‌ లోనే ఎక్కువగా ఉన్నాయి. ఇటు జమ్మూ, అటు లడఖ్‌ ప్రాంతాల్లో భారత భావజాలానికే మద్దతు. తీవ్రవాద కదలికలకూ అవకాశాలు తక్కువ. అందువల్ల ఈ రెండు ప్రాంతాల్లో ఎన్నికలు జరిపి అధికారం సాధించవచ్చు. ఇక కాశ్మీర్‌లో తీవ్రవాదాన్ని అక్కడికే కట్టడి చేయొచ్చు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే దీనికే ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. అందుకే అత్యధికంగా సైనికుల్ని మోహరించారని అనుకోవచ్చు. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. 
పీవోకే పై దాడి. దీని ద్వారా పాక్‌ అధీనంలోని మనం ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలనే వ్యూహం కూడా ఉందనేది ఒక అంచనా. కానీ, ఒకవేళ అదే జరిగితే పాకిస్తాన్‌, ఇండియా ల మధ్య అది యుద్దానికి దారితీస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కావాలని భారత్‌ కయ్యానికి కాలు దువ్వుతుందా అనేది ప్రశ్న. ఇన్ని అంచనాలు.. ఇంకెన్నో విశ్లేషణలు కాశ్మీర్‌ చుట్టూ తిరుగుతున్నాయి. 
రాచపుండు సమస్య 
జమ్మూ కాశ్మీర్‌ రాచపుండులా డెబ్బై ఏళ్ల నుంచి దేశాన్ని పట్టి పీడిస్తోంది. నిజానికి కాశ్మీర్‌ విలీనం కధ వింటే భారత్‌ ఎందుకు అంత సొమ్ము ఖర్చు చేయాలి అని సగటు పౌరుడు నిలదీసి ప్రశ్నిస్తాడు. కాశ్మీర్‌ ఓ సంస్థానం. స్వాతంత్రం వచ్చిన తరువాత సొంతంగానే ఉండాలనుకుంది. అప్పటి హిందూ రాజు మహారాజా హరి సింగ్‌ అటు పాకిస్తాన్‌కి ఇటు ఇండియాకు కూడా సమదూరంగా ఉంటూ సొంత రాజ్యంగా కాశ్మీర్‌ని పాలిద్దామనుకున్నాడు. అయితే ఆయన్ని పాకిస్తాన్‌ ఇబ్బందులకు గురి చేసింది. కాశ్మీర్‌ ని తమలో కలుపుకోవాలని ఎత్తులు వేసి అజాద్‌ కాశ్మీర్‌ దాకా తీసుకెళ్ళిపోయింది. దాంతో ఆయన భారత్‌ లో తమ విలీనాన్ని కోరుకున్నారు. ఆ తరువాత భారత సైన్యం వెళ్లి పాక్‌ పీచమణచి మిగిలిన భూబాగమంతా జమ్మూ కాశ్మీర్‌గా చేసింది. అయితే షేక్‌ అబ్దుల్లా ప్రధానమంత్రిగా తరువాత కాలంలో వచ్చారు. ఆయన కశ్మీరీలకు కొన్ని ప్రత్యేక అధికారలను కోరడం, దానికి అప్పటి భారత దేశ ప్రధాని నెహ్రూ అంగీకరించి ఒప్పందం చేసుకోవడం జరిగింది. అదే ప్రత్యెక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణం. 
దీని వల్ల కాశ్మీర్‌ నుంచి ఒక్క పైసా భారత ఖజానాకు చేరదు. అదే సమయంలో కాశ్మీర్‌కి భారత ఏటా లక్ష కోట్లు ఖర్చు చేస్తోందంటే ఆశ్చర్యం కలుగక మానదు. అక్కడ ప్రతి పౌరుడికి కేంద్రం 27 వేల రూపాయల వంతును ఖర్చు చేస్తోంది. దేశమంతా పన్నులు కడుతూంటే వారికి కేంద్రం తలసరి గా ఇచ్చే ఆదాయం కేవలం ఎనిమిది వేలు మాత్రమే. అదే కాశ్మీర్‌ లో తలా ఒకరికి 27 వేలు ఇస్తోంది. అయితే ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నా కూడా అక్కడ పేదలకు ఏమీ అందడం లేదు. 
ఆ నిధులను హాయిగా అక్కడ పాలకులు వేరేగా ఖర్చు చేస్తున్నారు. భారత దేశం పేదరికంలో ఉండి కూడా కాశ్మీర్‌ కోసం ఇంతలా వెచ్చించడం భావ్యమా. మరో వైపు విలీనం అవుతామని తమకు తాముగా వచ్చి రక్షణ కోరిన హరి సింగ్‌ కధ ఏంటి, మనం కాశ్మీర్‌ కోసం ఇంతలా ఖర్చు చేయడమేంటి. మరో వైపు సైనికుల ప్రాణాలు లక్షల్లో పోతున్నాయి. విదేశాల్లో భారత్‌ పరువు పోతోంది. కాశ్మీర్‌ ని అడ్డం పెట్టుకుని దేశమో ఉగ్ర భూతానికి పాక్‌ ఆజ్యం పోస్తోంది. మొత్తం ఈ రోగానికి మోడీ మందు వేశారు. 
కశ్మీర్‌ అంశంలో భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల పాకిస్తాన్‌ రగిలిపోతోంది. భారత్‌ వ్యూహానికి ఎలాంటి ప్రతివ్యూహంతో ముందుకు వెళ్లాలో పాకిస్తాన్‌కు అర్థం కాని అయోమయ పరిస్ధితులు నెలకొన్నాయి. కాని జరితున్న పరిణామాలపై మాత్రం పాక్‌ రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడంపై పాకిస్థాన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జమ్ముకశ్మీర్‌ విషయంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అనైతికం, చట్ట వ్యతిరేకమని పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ ఓ ప్రకటన ద్వారా విమర్శించింది. భారత్‌ నిర్ణయంపై కౌంటర్‌కు సాధ్యాసాధ్యాలన్నీ పరిశీలిస్తామని తెలిపింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వివాదాస్పద ప్రదేశం కశ్మీర్‌ అని… ఈ విషయంపై ఐక్యరాజ్యసమితి కలగజేసుకోవాలని కోరింది. మరోవైపు, పాకిస్థాన్‌ లోని భారత రాయబారి అజయ్‌ బిసారియాలకు ఆ దేశ విదేశాంగ శాఖ సమన్లు జరీ చేస్తూ, నిరసన వ్యక్తం చేసింది. ఆర్టికల్‌ 370 రద్దు పట్ల పాక్‌ మండిపాటు..! 
కశ్మీరీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా భారత్‌ వ్యవహరిస్తోందని మండిపడింది. ఈ నేపథ్యంలో, ఈ రోజు మధ్యాహ్నం 11 గంటలకు పాకిస్థాన్‌ పార్లమెంటు ఉభయసభలు అత్యవసరంగా సమావేశం కాబోతున్నాయి. జమ్ముకశ్మీర్‌, నియంత్రణ రేఖ వద్ద నెలకొన్న ఉద్రిక్తతలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు, భారత్‌ నిర్ణయాలపై మలేసియా, టర్కీ దేశాల ప్రధానులతో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఫోన్‌ లో మాట్లాడారు. భారత్‌ తీసుకుంటున్న నిర్ణయాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించే అవకాశం ఉందని ఈ సందర్భంగా వారికి ఇమ్రాన్‌ తెలిపారు. ద్వైపాక్షిక చర్చలకు అవకాశం లేకుండా పోయే పరిస్థితి ఉందని అన్నారు. అయితే, కశ్మీరీల కోసం విలువలతో కూడిన రాజకీయాలను కొనసాగిస్తామని, దౌత్యపరంగా పోరాడుతామని స్పష్టం చేసారు. 
ఆ..ముగ్గురు 
కశ్మీర్‌ విభజనలో ఎంఎస్డీదే కీలక పాత్ర..! క్రియాశీల పాత్ర పోషించిన మోదీ త్రయం..!! ఎంఎస్డీ అంటే టక్కున గుర్తు వచ్చేది భారత మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ..భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా, ఆపై కీపర్‌గా, బెస్ట్‌ మ్యాచ్‌ ఫినిషర్‌ గా ధోనీకి ఉన్న పేరు, గుర్తింపు, అభిమాన గణం గురించి అందరికీ తెలిసిందే. కానీ, ఇప్పుడు కశ్మీర్‌ విభజనలో ఎంఎస్డీదే కీలక పాత్ర అని ఎంఎస్డీ పేరిట ఓ ప్రత్యేక హ్యాష్‌ ట్యాగ్‌ తెగ వైరల్‌ అవుతోంది. అది ధోనీకి సంబంధించినది మాత్రం కాదు. ఇక్కడ ‘ఎంఎస్డీలో’ ఎం అంటే ‘మోదీ, ఎస్‌ అంటే షా, డీ అంటే అజిత్‌ ధోవల్‌’… వీరి ముగ్గురి పేరిట నెటిజన్లు ఓ హ్యాష్‌ ట్యాగ్‌ ను వైరల్‌ చేస్తున్నారు. దశాబ్దాల నుంచి అమలులో ఉన్న ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రతి ఒక్కరూ మోదీ సర్కారును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అసాధ్యమనుకున్న దాన్ని వీరు ముగ్గురూ కలిసి సుసాధ్యం చేశారని, ఇక జమ్మూ కశ్మీర్‌ లో శాంతిని నెలకొల్పి, పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుపై ద ష్టిని సారించాలని సలహా ఇస్తున్నారు. 40 ఏళ్ల క్రితం ఉన్న అందాల కశ్మీరం మరోసారి రావాలని కోరుకుంటున్నారు.