బాబోయ్‌..దుబాయ్‌

గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయులు లక్షా 40 వేల మంది

  • తప్పించుకొని తిరిగి ఇండియా వచ్చేద్దామన్నా కుదరదు
  • వీసా, పాస్‌ పోర్ట్‌ యజమాని వద్దే
  • ఫ్లైట్‌ టిక్కెట్‌ కొనేందుకూ డబ్బు ఉండదు
  • ఇండియన్‌ ఎంబసీని ఎలా సంప్రదించాలో తెలియదు
  • పోలీసులకు చిక్కితే అరెస్ట్‌ చేసి జైల్లో పడేస్తారు
  • యేటా గల్ఫ్‌ బాట పడుతున్న లక్షలాది మంది
  • ఇప్పటికీ తగ్గని గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వారి సంఖ్య
  • హైదరాబాద్‌కు చెందిన వారే నాలుగు లక్షల మంది
  • ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో నాలుగు లక్షల మంది

హైదరాబాద్‌:
మగవాళ్లు బయటపనులు చేస్తే… మహిళలు ఇంటి పనులు చెయ్యాలి..కుటుంబ సభ్యుల్ని బట్టీ, పనిని బట్టీ జీతం, వసతి..ఇంటిపని అర్థం మార్చేస్తున్న గల్ఫ్‌ సేట్లు యజమాని కుటుంబం మంచిదైతే పర్లేదు..చాలా మందికి యజమాని ఇల్లే చెరశాల..
ఇంటిపని పేరుతో ఒంటిపనికి వేధింపులు..సెక్స్‌ అవసరాలకు బానిసల్లా వాడుకుం టున్నారు. పేరుకే ఇంటి పని… ఒక్కసారి ఇంట్లోకి అడుగు పెడితే అన్ని పనులూ చెయ్యాల్సిందే. కాదూ.. కూడదని మొండికి వేస్తే.. తిరిగి ఇంటి ముఖం చూడలేరు. ఇదీ.. గల్ఫ్‌ దేశాల్లో భారతీయ మహిళల కన్నీటి కథ. సొంత దేశంలో బతుకు లేక గల్ఫ్‌ వెళ్తే.. అక్కడ బతకనిచ్చే పరిస్థితుల్లేవ్‌. ఫలితంగా గల్ఫ్‌ వెళ్లే లక్షలాది మంది మహిళల్లో ఎంతో మంది సెక్స్‌ బానిసలవుతున్నారు.


అక్కడ ఆకాశాన్నంటే భవనాలుంటాయ్‌.. అన్నీ కొనగలిగే సంపద ఉంటుంది. ఆ చమురు వాసన.. ఇక్కడి మనుషుల్ని ఆకర్షిస్తుంది. అక్కడ పోగయ్యే సంపద.. మన దేశంలోని నిరుపేదల్ని పరుగుపెట్టేలా చేస్తోంది. ఆ దేశం వెళ్తే ఇక్కడ తమ వాళ్లు బతికిపోతారన్న భరోసా.. తాము అక్కడ జీవిచ్ఛవాళ్లా అయినా బతికుంటే చాలు.. ఇక్కడ తమను నమ్ముకున్న వారి బతుకులు నిలబడిపోతాయన్న నమ్మకం. ఆ నమ్మకంతోనే యేటా లక్షలాది మంది భారతీయులు గల్ఫ్‌ బాట పడుతున్నారు. ముఖ్యంగా కరువు తాండవించే ప్రాంతాల నుంచి మగవారితో పాటు.. మహిళలూ పెద్ద సంఖ్యలో సౌదీ అరేబియా, దుబాయ్‌, కువైట్‌, ఖతర్‌, బెహరైన్‌, అబూదాబీ వంటి దేశాలకు వెళ్తుంటారు. హైదరాబాద్‌ పాత బస్తీ.. కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన వారు.. నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా గల్ఫ్‌ వెళ్తున్నారు. వెళ్లే వారిలో మగవాళ్లు బయటపనులు చేస్తే… మహిళలు ఇంటి పనులు చెయ్యాలి. ఇంట్లోని కుటుంబ సభ్యుల్ని బట్టీ.. చేసే పనిని బట్టీ వీరికి జీతం, వసతి ఉంటుంది. కానీ.. అంటే మహిళలతో ఇంటి పని మాత్రమే చేయించుకోవాలి. కానీ ఇంటిపనికి గల్ఫ్‌ సేట్లు.. అర్థాన్ని మార్చేశారు. అన్నీ కలిసొచ్చి సదరు మహిళ పని చేసే యజమాని కుటుంబం మంచిదైతే పర్లేదు.. కానీ అది లాటరీ వేసి ఫలితం కోసం ఎదురు చూడటమే. చాలా మంది మహిళలకు యజమానుల ఇల్లే చరసాలగా మారుతోంది. సదరు యజమాని ఇంటి పని పేరుతో ఒంటిపని చేయించుకునేందుకు పనికి వెళ్లే మహిళల్ని వేధిస్తున్నారు. సెక్స్‌ అవసరాలకు బానిసల్లా వాడుకుంటున్నారు. ఎదురు తిరిగితే.. వీసా లాక్కొని దిక్కులేని వారిని చేసే ప్రధాన అస్త్రం యజమానికి ఉంటుంది. దీంతో.. ఏమీ చెయ్యలేక మహిళలు చిత్రహింసలు అనుభవిస్తున్నారు.
భార్య ఇంట్లో ఉన్నా.. పని కోసం వచ్చిన మహిళలపై భర్త ఆగడాలు కొనసాగుతాయని బాధిత మహిళలు చెప్తున్నారు. భర్తను ప్రశ్నించి మనుగడ సాగించలేని భార్యలు కూడా అంతా చూసి మౌనంగా ఉండిపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలో సెక్స్‌ బానిసలుగా మగ్గిపోతున్న మహిళలు తప్పించుకొని తిరిగి ఇండియా వచ్చేద్దామన్నా కుదరదు. వీసా, పాస్‌ పోర్ట్‌ యజమాని వద్దే ఉండిపోవడం.. టిక్కెట్‌ కొనేందుకూ డబ్బు లేకపోవడం.. ఇండియన్‌ ఎంబసీని సంప్రదించి తమ సమస్యల్ని చెప్పుకునే స్థితిలో కూడా బాధితులు లేకపోవడంతో ఎక్కడి వాళ్లు అక్కడే కష్టాలు పడుతుంటారు. బయటికి వెళ్లేందుకు వచ్చిన వారిని అరెస్ట్‌ చేసి జైల్లో పడేసిన సందర్భాలూ ఎన్నో ఉన్నాయి. ఇక జైలుకు వెళ్తే.. వారి గురించి ఎప్పటికీ బంధువులకు తెలిసే అవకాశం ఉండదు. తోటి వారు ఇలాంటి కష్టాలను పడటం చూసి, విని చాలా మంది తిరుగబడటాన్ని ఆపేస్తారు. చివరికి జీతం ఇవ్వకపోయినా.. ఏళ్లకు ఏళ్లు పని చేస్తూ.. గల్ఫ్‌ గోడల మధ్య బానిసల్లా బతుకుతున్నారు..
ఇలాంటి అనుభవాలు ఎన్ని చూస్తున్నా.. ఇప్పటికీ గల్ఫ్‌ వెళ్లే వారి సంఖ్య తగ్గడం లేదు. ఒక్క హైదరాబాద్‌కు చెందిన వారే సుమారు నాలుగు లక్షల మంది సౌదీలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో నాలుగు లక్షల మంది ఉన్నారు. 2014లో రకరకాల మార్గాల్లో మోసపోయి.. సరైన గుర్తింపు లేకుండా గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయులు లక్షా 40 వేల మంది. వీరిలో వేలాది మంది మహిళలు కూడా ఉన్నారు. వీళ్లంతా మన దేశంలో సరైన ఉపాధి లేక పొరుగు దేశం వెళ్లిన వారే. ఎప్పటికప్పుడు గల్ఫ్‌ కష్టాలు చర్చకు వస్తున్నా.. ఆ దేశంలో వీరి కష్టాలు తీర్చే స్థాయిలో మన ప్రభుత్వాల చర్యలు ఉండటం లేదు. అందుకే.. గల్ఫ్‌ గాయం మానే రోజు వస్తుందా.. ? అని ఎదురు చూస్తున్నారు అక్కడున్న మన వాళ్లు.
ముందు మనం గల్ఫ్‌ లో ప్రభుత్వ విధానాలు ఏమిటి అన్న విషయం తెలుసుకోవాలి.
ఇక్కడ దేశం లోకి ప్రవేశించడానికి స్థూలంగా మూడు మార్గాలు ఉన్నాయి. విజిట్‌ వీసా పేరుకు తగ్గట్టే ఇది ఊరికే అలా వెళ్లి రావడానికి మాత్రమే, ఇది సాధారణం గా మనకి తెలిసిన వారు – అంటే చుట్టాలు, స్నేహితులు స్పాన్సర్‌ చేసి అక్కడికి పిలిపించుకునేది. దీని కాల పరిమితి సాధారణంగా 10 రోజుల నించి మూడు నెలల దాకా ఉండచ్చు, కాల పరిమితిని బట్టి వీసా రుసుము ఉంటుంది. రెండవది టూరిస్ట్‌ వీసా…దీనిగురించి పెద్ద వివరాలు అక్కర్లేదు. ఇంకా మూడోది మన ప్రస్తుత విషయానికి సంబంధించినది… ఎంప్లాయిమెంట్‌ వీసా.
ఎంప్లాయిమెంట్‌ వీసాకి సంబంధించి కొన్ని రూల్సు ఉన్నాయి ఇక్కడ. మనకి ఇక్కడ ఏదైనా కంపెనీలో ఉద్యోగం దొరికితేనే ఆ కంపెని వాళ్ళు మనకి ఎంప్లాయిమెంట్‌ వీసా ఇస్తారు. వాళ్ళు మనకి స్పాన్సర్‌ అన్నమాట. ఊరికే ఇక్కడికి ఎదో వీసాలో వచ్చేసి ఉద్యోగం వెతుక్కుంటాం అంటే కుదరదు అన్నమాట. (అంటే వెతుక్కోవచ్చు, దొరికింది అనుకున్నాక, మళ్ళి మనం వెనక్కి వెళ్లి వాళ్ళ కొత్త వీసా మీద ఇక్కడకి రావాలి ఒక రకంగా) ఒక కంపెనీ వీసాలో ఉద్యోగంలో చేరాకా, మళ్ళి అక్కడా ఇక్కడా తీరిక సమయాల్లో వేరే పని చేసుకుందాం ఎదో రకంగా కష్టపడి అంటే ఇక్కడి రూల్సు ఒప్పుకోవు. అది చట్ట విరుద్దం పట్టుకుంటే భారి జరిమానా, ఒక్కోసారి జైలు కూడా. అలాగే ఒకసారి ఉద్యోగం లో చేరాకా ఇక్కడి స్పాన్సర్‌ అది. ఒక కంపెనీ అయినా సరే మన పాస్‌పోర్ట్‌ వాాళ్ళ దగ్గిర పెట్టేసుకుంటారు. (మనం పారిపోకుండా అన్నమాట), దీనికి ఒక కారణం ఏమిటి అంటే, కంపెనీ వీసా కింద ఉన్న ఉద్యోగి అక్కడే దేశంలో వేరే చోటకి పారిపొయినా, కనబడకుండా పోయినా అది స్పాన్సర్‌ నెత్తి మీదకి వస్తుంది. ఒక్కోసారి అలాంటి సందర్భం ఎదురైతే స్పాన్సర్‌ తన కింద ఉన్న ఉద్యోగి కనబడడం లేదు అని పొలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చి చేతులు దులిపేసుకుంటారు. ఇంక ఆ క్షణం నించి ఆ ఉద్యోగి ఒక అక్రమ వలస దారుడిగా పరిగణించబడతారు. ఎవరి నైనా ఉద్యోగం లోంచి తీసేస్తే ఆ ఉద్యోగికి టిక్కెట్టు కొని ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కించి వారి వీసా పేపర్ల మీద ఎగ్జిట్‌ స్టాంప్‌ కొట్టించుకునే దాకా ఆ కంపెనీకి ఇమ్మిగ్రేషన్‌ డిపార్టుమెంటులో క్లియరెన్స్‌ దొరకదు. వాళ్ళు తన కంపెనీని కూడా సరిగ్గా నడుపుకోలేరు. భారీ జరిమానాలు ఉంటాయి.
కొన్నికొన్ని సందర్భాల్లో కంపెనీయే అన్యాయంగా ఉద్యోగం తీసేసి, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వక ఆ ఉద్యోగి పారిపోయాడు అని కేసులు పెడుతుంది, అలాంటప్పుడు లేబర్‌ కోర్టుకి సదరు ఉద్యోగి వెళ్ళవచ్చు, సాధారణం గా 90% కేసుల్లో న్యాయం జరుగుతుంది అక్కడ.
మనం ఇప్పుడు పేపర్స్‌లో చూసే గల్ఫ్‌ భారతీయుల కధలు ఏమిటి అంటే, ఇక్కడికి వాళ్ళు తెలియక టూరిస్ట్‌ వీసా మీద వచ్చేసి ఉంటారు, ఉద్యోగం దొరికి ఉండదు, ఇంకా ఇక్కడే ఎదో ఆ పని ఈ పని చేస్కుని అక్కడా ఇక్కడా దొంగతనం గా ఉంటూ ఉండి ఉంటారు. ఇంకొన్ని ఎక్కువ కేసుల్లో ఇక్కడి లోకల్‌ కంపెనీలు కొన్ని, కొందరు వ్యక్తులు వీసాలు అమ్ముకుంటారు, అంటే మా కంపెనీలో లేదా మా ఇంట్లో పనిచేస్తున్నాడు అని వీసా ఇచ్చి వాడి దగ్గిర నించి డబ్బు తీసుకుంటారు. ఇలాంటి వాళ్ళు సాధారణంగా వంటవాళ్ళుగా, డ్రైవర్‌లుగా, హౌస్‌ మెయిడ్స్‌గా, క్లీనర్లుగా, వడ్రంగి, తాపీ మేస్త్రి, ఎలక్ట్రీషియన్‌, చాకలి పని…….ఇలా వస్తుంటారు. వచ్చి ఇక్కడ వల్ల ఇంట్లో వీళ్ళ ఇంట్లో అలా చాలా ఇళ్ళల్లో/ ఆఫీస్‌లలో డబ్బులు బాగానే సంపాదిస్తారు కొన్నేళ్ళు (ఎవరైనా పట్టుబడితే, పని చేసిన వాడికి, చేయించుకున్న వాడికి జరిమానా చాలా లక్షల రూపాయల్లో ఉంటుంది, ఒక్కోసారి జైలు కూడా ఉండచ్చు) . ఇలా జరిగినంత కాలం బాగానే నడుస్తుంది, ఎప్పుడో ఒకసారి వీడికి వాడికి ఏవో లెక్కల్లో తేడా వచ్చి, మై ఎంప్లాయీ మిస్సింగ్‌ అని కేసు పెడతాడు. అప్పటి నించి మన వాళ్ళ కష్టాలు మొదలవుతాయి. ఒక సారి వీసా గడువు పూర్తయ్యాక, అతను వెనక్కి వెళ్ళాలంటే ఎయిర్‌పోర్టులో అధికారులు పట్టుకుంటారు, అందుకని ఆ భయం తో ఇక్కడే ఉండిపోతారు బిక్కు బిక్కుమంటూ. పరిస్థితుల ప్రభావం వల్ల, చిల్లర దొంగతనాలు, దెబ్బలాటలు, హత్యలు, ఉరిశిక్షలు ఇలా…ఊబిలోకి కూరుకు పోతారు. మనవాళ్ళ పరిస్థితికి ఇక్కడి ప్రభుత్వాల్ని నిందించి ప్రయోజనం లేదు, ఉన్నతలో ఇక్కడి ప్రభుత్వాలు పాపం బాగానే చూస్తున్నాయని చెప్పాలి. తప్పులో సింహభాగం మన ప్రభుత్వాలది, మన అమాయక జనాలది. ఇక్కడ గల్ఫ్‌ లో ముఖ్యంగా ఖర్చుల గురించి చెప్పుకోవాలి… పేరుకి పన్ను లేదు అన్న మాట అంతే. అన్ని ఖర్చులు గూబ గుయ్యి మనిపించేలా ఉంటాయి. పైన చెప్పిన చిన్న చిన్న ఉద్యోగాలకి ఇచ్చే జీతం నెలకి 800 – 1200 దీనార్లు. దీనికి మనవాళ్ళు మన రూపాయల్లో చూసుకుని…….”మా వాడు అక్కడ నెలకి పదిహేను వేలు సంపాదిస్తున్నాడు అని చెప్పేసుకుంటారు. పాపం ఒక చిన్న పని వాడికి, వినడానికి అది ఒక పెద్ద మొత్తమే కావచ్చు, కానీ నిజంగా చూస్తే ఇక్కడ అది ఎందుకు సరిపోదు. ఒక రూములో 4 గురు (కాస్త మంచి ఉద్యోగం అయితే) లేదా 6 గురు, 8 మంది (మరీ చిన్న ఉద్యోగం అయితే) కలిసి ఉండాలి. దీన్నే ఇక్కడి వాడుక భాషలో బెడ్‌ స్పేస్‌ అంటారు. ఒక బెడ్‌ స్పేస్‌ ఖరీదు కనీసం 500 దీనార్లు. (మన భాషలో రూ.7500). ఇప్పుడు చెప్పండి మనకి వచ్చే 1200 లలో బెడ్‌ స్పేస్‌కి అది పోగా ఇంకా మిగిలేది ఎంత? తిండి, బట్టలు, తిరుగుడు, మందులు, రోగాలు మిగతావి?? ”మా వాడు దుబాయ్‌ లో ఉద్యోగం……….లక్షల్లో సంపాదించేస్తునాడు ” అనుకునే వాళ్లకి నెల నేలా ఎంతో కొంత పంపాలి కదా మరి? అదెలా? ఏడాదికో, రెండేళ్ళకో ఇంటికి వెళ్ళాలి అంటే ఫ్లయిట్‌ ఖర్చులకింద కొన్ని కంపెనీలు టిక్కెట్టు ఇస్తాయి కొన్ని ఇవ్వవు, ఉద్యోగ షరతుల బట్టి.

బ్రాండ్‌ అంబాసిడర్లపై కేసులు
సెలబ్రిటీలు ఎండార్స్‌ చేసే యాడ్స్‌ను చూసి చాలా మంది కస్టమర్లు ఆయా వస్తువుల కొనుగోలు చేయడంతో పాటు సర్వీసులను ఎంచుకుంటారు. అయితే ఆయా సంస్థలు యాడ్స్‌లో చెప్పినట్లుగా కాకుండా ఇష్టానుసారం సేవలు అందించడంపై కస్టమర్లలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌తో జనాలకు కుచ్చుటోపీ పెట్టిన క్యూనెట్‌ వ్యవహారమే ఇందుకు తాజా ఉదహరణ. బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారూఖ్‌ ఖాన్‌, పూజా హెగ్డే, బొమన్‌ ఇరానీతో పాటు టాలీవుడ్‌ హీరో అల్లు శిరీష్‌, క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ క్యూనెట్‌కు బ్రాండ్‌ ప్రమోట్‌ చేశారు. కంపెనీపై చీటింగ్‌ కేసు బుక్‌ కావడంతో సైబరాబాద్‌ పోలీసులు ఈ సెలబ్రిటీలందరికీ నోటీసులు పంపారు. వారం రోజుల్లో విచారణకు రావాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు.
కంపెనీల బుట్టలో యాక్టర్లు, క్రికెటర్లు
ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన ఫిట్‌నెస్‌ సెంటర్‌ కల్ట్‌ ఫిట్‌ కథే ఇలాంటిదే బాలీవుడ్‌ హీరో హ తిక్‌ రోషన్‌ అంబాసిడర్‌గా ఉన్న కల్ట్‌ ఫిట్‌ సేవల అందించడంలో విఫలమైంది. పలుమార్లు ఈ విషయాన్ని యాజమాన్యం దష్టికి తీసుకువచ్చినా స్పందించకపోవడంతో విసిగిపోయిన ఓ కస్టమర్‌ పోలీసులకు కంప్లైంట్‌ చేశాడు. బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించిన హతిక్‌ రోషన్‌తో పాటు కల్ట్‌ ఫిట్‌ యాజమాన్యంపై కేసు బుక్‌ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు విచారణలో ఉంది. ఇక ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ ఆమ్రపాలి గ్రూప్‌ ఫ్లాట్ల పేరుతో జనాన్ని చేసిన మోసం అంతా ఇంతా కాదు. ఈ కంపెనీకి 2009 నుంచి 2015 వరకు క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించారు. అయితే ఫ్లాట్‌ కొనుగోలుదారులు సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేయడంతో 2016లో ఆయన ఒప్పందం నుంచి తప్పుకున్నారు. గతంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టే ప్రయత్నం చేసిన మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ స్కాం కేసులో కీలక సూత్రధారి సాయికుమార్‌ చేపట్టిన వన్‌ నేషన్‌ వన్‌ కార్డు స్కీంకు క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించారు. స్కాం బయటపడటంతో ప్రమోషన్‌ నుంచి తప్పుకున్నారు.
తప్పుడు ప్రకటనలపై గూగుల్‌ కొరడా
ఆన్లైన్‌ యూజర్లకు హానిచేస్తున్న తప్పుడు వ్యాపార ప్రకటనలపై గూగుల్‌ కొరడా ఝళిపిస్తూ వస్తోంది. ఈక్రమంలో గూగుల్‌ 2018 లో 2.3 బిలియన్ల (230 కోట్ల) ప్రకటనలను నిషేధించినట్టు ఇంటర్నెట్‌ దిగ్గజం గూగుల్‌ తాజాగా వెల్లడించింది. వినియోగదారులను మిస్‌ లీడ్‌ చేస్తున్న బ్యాడ్‌ యాడల్‌లను రోజుకు 6లక్షలకు పైగా బ్యాన్‌ చేసినట్టు తెలిపింది.
2018 బ్యాడ్‌యాడ్‌ రిపోర్టులో గూగుల్‌ ఈ వివరాలు అందించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలనుంచి వినియోగదారులను కాపాడి, మెరుగైన సేవలను అందించే లక్ష్యంగా కొత్త విధానాలను తీసుకొచ్చినట్టు తెలిపింది. ప్రధానంగా 31కొత్త విధానాలను ప్రవేశపెట్టామని గూగుల్‌ వెల్లడించింది. తమ సంస్థ ద్వారా ప్రతీ యూజర్‌కు ఆరోగ్యకరమైన స్థిరమైన ప్రకటనల ఎకోసిస్టంను అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని సస్టైనబుల్‌ యాడ్స్‌ డైరెక్టర్‌ స్కాట్‌ స్పెన్సర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఎప్పటికపుడు తన పాలసీని అప్‌డేట్‌ చేస్తూ వస్తున్న గూగుల్‌ వినియోగదారుల భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న సుమారు 1.5 మిలియన్ల యాప్‌లను ఇప్పటికే తొలగించింది. అలాగే దాదాపు 734,000 మంది ప్రచురణకర్తలు, యాడ్‌ డెవలర్స్‌ను తన ప్రకటన నెట్వర్క్‌ నుండి రద్దు చేసింది. క్రిప్టోకరెన్సీలను ప్రమోట్‌ చేసే ఆన్‌లైన్‌ ప్రకటనలు, సంబంధిత కంటెంట్ను కూడా నిషేధించింది. 2017లో కూడా వ్యాపార ప్రకటన పాలసీ నిబంధనలు ఉల్లంఘించిన 3.2 బిలియన్ల ప్రకటనలను తొలగించిన సంగతి తెలిసిందే.
తప్పుదోవ పట్టించేలా ఉంటే సంబంధిత ప్రకటనకర్తలపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ తెలిపారు. అయితే ఆ యాడ్‌లను ప్రసారం చేసిన మీడియాపై చర్యలు ఉండబోవని స్పష్టం చేశారు. వినియోగదారుల హక్కులను బలోపేతం చేసేందుకు, త్వరితగతిన వివాదాల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన వినియోగదారుల పరిరక్షణ బిల్లు-2018కు మంగళవారం లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. వినియోగదారుల సమస్యల పరిష్కార ప్రక్రియను సరళతరం చేసే ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి పాశ్వాన్‌ తెలిపారు. వినియోగదారుల పరిరక్షణ చట్టం-1986 స్థానంలో ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. విపక్షాలు సూచించిన పలు సవరణలు వీగిపోయాయి. లోక్‌సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ బిల్లు తదుపరి రాజ్యసభకు చేరనుంది.
గతేడాది డిసెంబర్‌లో పెద్దల సభ ఈ బిల్లును ఆమోదించకపోవడంతో ఇది మురిగిపోయింది. దీంతో కేంద్రం మళ్లీ బిల్లును తీసుకొచ్చింది. దీని ప్రకారం వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌, ఫోరమ్‌లను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయనున్నారు. అలాగే వినియోగదారుల హక్కుల పరిరక్షణ, ప్రోత్సాహం, అమలు కోసం సెంట్రల్‌ కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీని (సీసీపీఏని) ఏర్పాటుచేస్తారు. అక్రమ వాణిజ్య పద్ధతుల కారణంగా వినియోగదారులకు హాని జరుగకుండా సీసీపీఏ చర్యలు తీసుకుంటుంది. పాడైన ఉత్పత్తుల వల్ల, సేవా లోపం కారణంగా వినియోగదారులకు నష్టం/హాని వాటిల్లితే బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయని పాశ్వాన్‌ వివరించారు. బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ మాట్లాడుతూ.. కరెంట్‌ కోతలు, కాల్‌ డ్రాప్స్‌ను కూడా బిల్లు పరిధిలోకి తేవాలని సూచించారు.