తెలంగాణకు సముద్ర ‘భాగ్యం’

బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తూ జీఓ అంటూ వార్త హల్‌చల్‌

  • గత నెలలోనే కీలక ఒప్పందం జరిగిందంటూ ప్రచారం
  • వార్తలపై స్పందించని ఇరు రాష్ట్రాల సీఎంలు
  • బందరు పోర్టు నిర్మాణానికి భారీ స్థాయిలో వ్యయం
  • తెలంగాణ సాయం కోరిన జగన్‌
  • అందుకు ప్రతిగా తెలంగాణకు పోర్టు సౌకర్యం
  • హైదరాబాద్‌ నుంచి బందరుకు ప్రత్యక్ష రోడ్డు
  • మండిపడుతున్న ఏపీ ప్రతిపక్షాలు
  • సాయం కోరడంలో తప్పేమీలేదంటున్న విశ్లేషకులు
  • ఇరు రాష్ట్రాలు కలిసి కేంద్రంపై ఒత్తిడి

హైదరాబాద్‌:

ఏపీలోని బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తూ ఏపీ సీఎం జగన్‌ జీవో జారీ చేశారా? వాస్తవాల సంగతి ఏమో కానీ ఈ మేరకు సామాజిక మాధ్యమంలో మాత్రం విస్తతంగా ప్రచారమౌతున్నది. బందర్‌ పోర్టును తెలంగాణకు అప్పగిస్తూ ఈ నెల 28న జగన్‌ జీవో విడుదల చేసిందనీ, ఈ జీవో కాన్ఫిడెన్షియల్‌గా ఉంచిందని సామాజిక మాధ్యమంలో ప్రచారం అవుతున్నది. తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ అయిన తరువాత 12 గంటల వ్యవధిలోనే ఆ జీవో జారీ అయ్యిందంటున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య సత్సంబంధాల విషయంలో రాజకీయ పార్టీలు తలోవిధంగా వ్యాఖ్యానాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మచిలీపట్నం పోర్టును తెలంగాణాకు అప్పగించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. విపక్షాలిప్పటికే దీనిపై ప్రభుత్వాన్ని పలుమార్లు నిలదీశాయి. చివరికి అలాంటి ఆలోచనలేం లేవంటూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో స్పష్టం చేసింది. అయితే బందరు పోర్టును తెలంగాణాకు అప్పగించడం వల్ల ప్రయోజనాలే తప్ప నష్టాల్లేవంటూ వివిధ సామాజిక సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం ఈ రేవు నిర్మాణం ముందుకు సాగడం లేదు. మరోవైపు తెలంగాణాకు రేవు ఆవశ్యకత చాలా ఉంది. ఇప్పటికిప్పుడు పెట్టుబడులు పెట్టగలిగే ఆర్థిక సామర్థ్యం కూడా ఆ రాష్ట్రానికి ఉంది. బందరు రేవు నిర్మాణాన్ని తెలంగాణాకు అప్పగిస్తే ఆంధ్రా తీరంలో మరో పెద్దరేవు అందుబాటులోకొస్తుంది. దీన్ని తెలంగాణ తన అవసరాల కోసం వినియోగించుకున్నప్పటికీ ఉపాధి అవకాశాలు స్థానికులకే లభిస్తాయి. రేవు ఆధారంగా పరిసరాల్లో పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ చోటు చేసుకుంటుంది.

బ్రిటీష్‌ హయాంలో బందర్‌ రేవుకు గొప్ప చరిత్ర ఉండేది. బ్రిటీష్‌ పాలన ప్రారంభమైన తొలిరోజుల్లో తూర్పు తీరంలో ఇదే పెద్ద రేవుగా ఉండేది. ఇక్కడి నుంచే ఎగుమతులు, దిగుమతులకు బ్రిటీషీయులు ప్రాధాన్యతనిచ్చేవారు. అంచలంచెలుగా రేవు ఆధా రంగా బందరు పట్టణం కూడా విస్తరించింది. 1850నాటికి మద్రాస్‌ రేవు పెద్దదైంది. మరోవైపు కాకినాడ యాంకరేజ్‌ పోర్టు కూడా అందుబాటులో కొచ్చింది. బందరు కంటే మద్రాస్‌, కాకినాడ రేవుల నుంచి రవాణా సులభతరంగా మారింది. దీంతో బ్రిటీషీయులు బందరురేవుకు ప్రాధాన్యత తగ్గించారు. పైగా బందరు రేవు నిర్వహణ వ్యయభరితంగా ఉండేది. ఇక్కడి తీరానికి తరచూ ఇసుక పెద్ద ఎత్తున కొట్టుకొచ్చేది. దీంతో కనీసం ఆరు మాసాలకోసారి డ్రెడ్జింగ్‌ చేయాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులు కాకినాడ, చెన్నై పోర్టుల్లో లేవు. ఇది కూడా బందరు పోర్టు ప్రాధాన్యత కోల్పోవడానికి ఓ కారణణమైంది. స్వతంత్య్రా నంతరం బందరు పోర్టు పునరుద్దరణకు పలు ప్రయత్నాలు జరిగాయి. వైఎస్‌ ముఖ్యమంత్రయ్యాక దీనిపై దష్టిపెట్టారు. తొలి ఐదేళ్ళలో ఈ పోర్టు నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. రెండోసారి ముఖ్యమంత్రయ్యాక బీవోటీ పద్దతిలో నిర్మాణానికి నవయుగ సంస్థకు బాధ్యతలప్పగించారు. అయితే శంకుస్థాపనలు తప్ప ఇంతవరకు ఈ పోర్టు నిర్మాణం ముందుకు సాగలేదు. ఆ తర్వాతొచ్చిన ప్రభుత్వాలు దీనిపై ద ష్టి పెట్టలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఇందుకోసం ఓ అథారిటీని ఏర్పాటు చేసింది. పోర్టు పరిసరాల్లో లక్ష ఎకరాల్ని సమీకరించాలని ప్రతిపాదించింది. ఇది వివాదాస్పదం కావడంతో పోర్టుకు అనుబంధ పరిశ్రమలకు అవసరమైన భూముల వాస్తవ పరిమాణాన్ని అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధ్యయనాలు, నివేదికలు తప్ప పోర్టు నిర్మాణంలో ఒక్కడుగు ముందుకు పడలేదు. నిర్మా ణం కోసం తీసుకొచ్చిన భారీ యంత్ర సామ గ్రిని కూడా ఇటీవల వెనక్కి పంపేశారు. దీంతో అతికీలకమైన బందరు పోర్టు నిర్మాణం వాయిదా పడినట్లే. తెలంగాణ ఆవిర్భావానంతరం ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌ ఆ రాష్ట్రానికంటూ ఒక పోర్టు ఉండాలని ప్రతిపాదించారు. తీరంలేని ప్రాంతా ల్లో డ్రై పోర్టు లు ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం నిర్ణీత స్థలాన్ని కేటా యిస్తారు. అక్కడే కస్టమ్స్‌, ఎక్సైజ్‌ కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. పూర్తిస్థాయిలో రవాణా సదుపా యాలు కల్పిస్తారు. ఎగుమతులు, దిగుమతులకు అవసరమైన అనుమతులిచ్చే విభాగాలన్నీ నెలకొల్పుతారు. విదేశీ ఎగుమతులకు అక్కడే సరుకు సిద్ధం చేస్తారు. నేరుగా పోర్టుకు పంపించి నౌకల్లోకి ఎక్కిస్తారు. దిగుమతుల సమయంలో కూడా ఇదే విధా నాన్ని పాటిస్తారు. దీంతో రేవుల్లో సమయం ఆదా అవుతుం ది. కస్టమ్స్‌, ఎక్సైజ్‌ అనుమతులు, తనిఖీల కోసం ఎక్కువసే

పు వేచి చూడాల్సిన అవసరముండదు. ఈ విధానంలో ఇప్పటికే దేశంలో పలుచోట్ల పోర్టులున్నాయి. పాట్నా, నయా రాయపూర్‌, హజీరా, పైకి, వీరంగామ్‌, రాజ్‌కోట్‌, అటివ్ల్నట, మిహాన్‌, జార్ష్‌గూడ, హిందౌన్‌, తదితర ప్రాంతాల్లో డ్రైపో ర్టులు ఏర్పాటయ్యాయి. అక్కడే అనుమతులు పూర్తి చేసుకుని నేరుగా రేవులకు సరుకును చేరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఓపోర్టు ఉండాలన్న ప్రతిపాదన ఇప్పటిదికాదు. ఆ రాష్ట్రం నిజాం నవాబుల ఏలు బడిలో ఉన్నప్పుడే ఇలాంటి ప్రతిపాదనలొచ్చాయి. అప్పుడే బందరుపోర్టును తమకు అద్దెకివ్వాలంటూ బ్రిటీషీయులను నిజాం నవాబు కోరారు. ఈ ప్రతి పాదనలు ఓ కొలిక్కిరాకముందే పోర్చుగీస్‌ ప్రభు త్వం తమ అధీనంలో ఉన్న గోవా పోర్టును లీజుకు తీసు కోవాల్సిందిగా ప్రతిపాదన తెచ్చింది. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న గదగ్‌ వరకు అప్పటి నిజాం సామ్రాజ్యం విస్తరించి ఉండేది. గదగ్‌ నుంచి గోవా కేవలం వంద మైళ్ళ దూరమే. దీంతో నిజాం నవాబు గోవా వైపు మొగ్గు చూపారు. కానీ ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకముందే దేశానికి స్వాతం త్య్రం రావడం, ఆ తర్వాత నైజాం ప్రభుత్వంపై సైనిక చర్య చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు పోర్టుల్ని ప్రైవేటు నిర్మాణం, నిర్వహణకు అప్పగిస్తున్నారు. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడానికి వ్యత్యాసం లేదు. పాకిస్తాన్‌లో పలు పోర్టుల్ని చైనా నిర్మిస్తోంది. అలాగే శ్రీలంకలోనూ కొన్ని పోర్టుల్ని చైనా నిర్మాణం, నిర్వహణా బాధ్యతల్ని చేపట్టింది. భారత్‌కు చెందిన ప్రైవేటు సం స్థలు అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాల్ని నిర్మించి నిర్వహిస్తున్నాయి. అం తమాత్రాన వాటిపై పూర్తి హక్కు భుక్తాలు భారత్‌కు చెందవు. డ్రైపోర్టుల నుంచి నేరు గా సరకు తర లించేందుకు మాత్రమే తెలంగాణ బందరు పోర్టు నిర్మాణంపై ఆసక్తి చూపుతోంది. ఈ పోర్టు నిర్మాణాన్ని తెలంగాణ పూర్తిచేసిప్పటికీ ఇక్కడ ఉపాధి అవకాశాలు స్థానికులకే లభిస్తాయి. పోర్టు ఆధారంగా పలు పరిశ్రమలు విస్తరిస్తాయి. తెలంగాణ సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన వెంటనే డ్రైపోర్టు నిర్మాణంపై కేసీఆర్‌ దష్టిపెట్టారు. ఇందుకోసం కరీంనగర్‌ జిల్లా సుల్తానాబాద్‌, రంగారెడ్డి జిల్లా లోని నాగులాపల్లిలో గతంలోనే సేకరించిన భూముల్లో పోర్టు నిర్మాణానికి ప్రతి పాదనలు సిద్ధం చేశారు. కంటైనర్‌ కార్పొ రేషన్‌ ఆఫ్‌ ఇండియా, తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థలు సంయుక్తంగా ఈ పోర్టు నిర్మాణానికి ముందు కొచ్చాయి. వీటికి అగ్రికల్చర్‌ అండ్‌ ప్రొసెస్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కూడా సహకరిస్తోంది. డ్రైపోర్టు నిర్మాణం పూర్తయితే రైతుల వ్యవసాయోత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లోకెళ్ళేందుకు అవకాశముంటుం ది. వాటిని నిల్వచేసేందుకు తగిన్ని గోదాములు, కోల్డ్‌ స్టోరేజ్‌ లు అందుబాటులోకొస్తాయి. డ్రైపోర్టు నిర్మా ణానికి అన్ని అవకాశాలున్నప్పటికీ అనుబంధంగా సీపోర్ట్‌ నిర్మాణానికి తగిన అవకాశం లేకపోవడంతో ఇప్పుడు తెలంగాణ ప్రత్యా మ్నాయాన్ని వెదుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్ర ప్రదేశ్‌కు బందరుతో పాటే మరో పోర్టు కూడా నిర్మాణం కావాల్సి ఉంది. రామాయపట్నం లేదా దుగరాజపట్నం లలో పోర్టు నిర్మాణానికి యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదిం చింది. తగిన స్థలాన్ని చూపడంలో గత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఈ ప్రతిపాదన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో బందరు పోర్టు నిర్మాణాన్ని తెలంగాణకు అప్పగిస్తే కేంద్రం ముందుకు రాకుండా నిర్వీర్యం చేస్తున్న మరో మేజర్‌ పోర్టు నిర్మాణంపై ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం దష్టిపెట్టి సొంతంగా నిర్మించే అవకాశాలు ఏర్పడతాయని నిపుణులు సూచిస్తున్నారు. బందరు పోర్టు నిర్మాణాన్ని బేషరతుగా కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకుంటే అది ఆంధ్రప్రదేశ్‌కు అదష్టంగానే భావించాలి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రగతికి, పారిశ్రామికాభివ ద్ధికి సహకరిస్తుందని సూచిస్తున్నారు.