పాలనకూడా చేతకాని.. కేసీఆర్‌ చేతుల్లో పెడతారా?

  •  ఇలాంటి అసమర్థులు ఒక్క ఛాన్స్‌ ఎందుకోసం అడిగారు? 
  • – విూ స్నేహాలకు, సొంత లాలూచీలకు.. 
  • – రాష్ట్ర ఆస్తులను ధారాదత్తం చేస్తామంటే సహించేది లేదు 
  • – జగన్‌పై ట్విట్టర్‌లో చంద్రబాబు, లోకేష్‌ ధ్వజం 

అమరావతి, జులై29 : తెలుగు రాష్ట్రాల్లో బందరు పోర్ట్‌ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. బందరు పోర్ట్‌ను తెలంగాణకు అప్పగిస్తారంటూ మళ్లీ ప్రచారం మొదలయ్యింది. తెర వెనుక పోర్ట్‌ను తెలంగాణకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ప్రభుత్వాన్ని టా/-గ్గం/ట్‌ చేస్తూ ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు.. మాజీ మంత్రి లోకేష్‌లు ట్వీట్లు చేయడం మళ్లీ ఆసక్తిగా మారింది. లోకేష్‌ తన ట్వీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు చేతకాక బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్నారు. రేపు పాలన కూడా చేతకావట్లేదని రాష్ట్రాన్ని కేసీఆర్‌ చేతుల్లో పెడతారా? ఇలాంటి అసమర్థులు ఒక్క ఛాన్స్‌ ఎందుకోసం అడిగారు? దోచుకోడానికా? ప్రజల భవిష్యత్తును పక్క రాష్ట్రాలకు తాకట్టుపెట్టడానికా?’అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ నిలదీశారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం బందరు పోర్టును తెలంగాణకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్విట్టర్‌ వేదికగా ధ్వజమెత్తారు. జూన్‌ 28న ఆర్టీ-62 నంబర్‌తో రహస్య జీవోగా జారీ చేసి.. రెండు రోజుల్లో ‘జారీ చేయబడలేదు’ అని మార్చారని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణకు బందరు పోర్టు ఇస్తున్నారా అని అసెంబ్లీలో ప్రశ్నిస్తే.. అలాంటిదేవిూ లేదని బుకాయించారని చంద్రబాబు పేర్కొన్నారు. కానీ పోర్టును తెలంగాణకు అప్పగించేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సీమాంధ్రకు పోర్టులు ప్రకృతి ఇచ్చిన వరమని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇలాంటి పోర్టులపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదన్నారు. విూ స్నేహాలకు, సొంత లాలూచీలకు.. రాష్ట్ర ఆస్తులను ధారాదత్తం చేస్తామంటే సహించేది లేదని ట్విట్టర్‌లో చంద్రబాబు పేర్కొన్నారు.