చంద్రయాన్-2.. రెండో పక్రియ విజయవంతం

అమరావతి, జులై26 :

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌ – 2లో రెండో పక్రియ విజయవంతమైంది. జులై 22వ తేదీ మధ్యాహ్నం 2గంటల 43 నిమిషాలకు నింగిలోకి నిప్పులు చిమ్ముతూ చంద్రయాన్‌ -2 దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. అనుకున్న సమయం ప్రకారమే మధ్యాహ్నం 2 గంటల 52 నిమిషాలకు పూర్తి చేశారు. జులై 24వ తేదీ బుధవారం మొదటి భూ కక్ష్యను పెంచగా.. శుక్రవారం కక్ష్యను పెంచారు. ప్రస్తుతం చంద్రయాన్‌ -2 వాహన నౌక 251లీ56829 కిలో విూటర్ల ఎత్తున భూ కక్ష్యలోకి చేరింది. 883 సెకన్ల పాటు ఇంధానాన్ని మండించడం ద్వారా విజయవంతమైందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. జులై 29వ తేదీన మూడోసారి కక్ష్యను పెంచుతామని.. ఆగస్టు 14వరకు ఇలా కక్ష్యలు పెంచే పనులు ఉంటాయని ఇస్రో వెల్లడించింది. జులై 15న చేపట్టాల్సిన ఈ మిషన్‌ టెక్నికల్‌ ప్రాబ్లమ్స్‌ కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం జులై 22వ తేదీన సక్సెస్‌ ఫుల్‌గా ప్రయోగం చేపట్టింది ఇస్రో. అన్నీ అనుకున్నట్లే జరిగితే.. ఈ ఏడాది సెప్టెంబర్‌ 7వ తేదీన జాబిలిపై విక్రమ్‌ ల్యాండర్‌ దిగుతుంది. ఇస్రో…చంద్రయాన్‌-2 ద్వారా ఆర్బిటర్‌, లాండర్‌(విక్రమ్‌), రోవర్‌(ప్రగ్యాన్‌) ను పంపింది. చంద్రయాన్‌-2 ఉపగ్రహంలో 3850 కిలోగ్రాముల 13 పే లోడ్‌లు (ఆర్బిటర్‌లో 8, ల్యాండర్‌లో 3, రోవర్‌లో 2 పేలోడ్లు) ఉంటాయి. సెప్టెంబర్‌ నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర రోవర్‌ ల్యాండ్‌ అవుతుంది. చంద్రుని క్షక్ష్యలోకి చేరిన తర్వాత చంద్రయాన్‌ విక్రమ్‌ ని రంగంలోకి దింపుతుంది. ఇది సేఫ్‌ గా సెప్టెంబర్‌-2019 నాటికి చంద్రునిపై ల్యాండ్‌ అవుతుంది. విక్రమ్‌ ల్యాండ్‌ అయ్యాక రోవర్‌-ప్రగ్యాన్‌ ముందుకు కొనసాగుతుంది. పేలోడ్‌ జెట్‌.. విక్రమ్‌.. ప్రగ్యాన్‌ చంద్రునిపై సమాచారాన్ని సేకరించడం ప్రారంభిస్తాయి. హైడ్రాక్సిల్‌, వాటర్‌ ఐస్‌ కు సంబంధించి మూలాలను ఫొటో తీస్తాయి. మిషన్‌ జీవితకాలం
ఒక ఏడాది ఉంటుంది. అంటే… విక్రమ్‌, ప్రగ్యాన్‌ చంద్రుని ఉపరితలంపై ఒక లూనర్‌ డే ఉంటాయి. ఎర్త్‌ డేతో పోలిస్తే 14 ఎర్త్‌ డేలతో సమానం. అప్పటినుంచి చంద్రునిపై దాగిన రహస్యాలపై ప్రశ్నలకు సమాధానాలుగా ఒక్కొక్కటిగా ప్రపంచానికి తెలియజేయనున్నాయి