నేడు ఉజ్జయినీ మహంకాళి బోనాలు
- -ఏర్పాట్లు చేసిన ఆలయ సిబ్బంది
- బోనాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ -జ్యోతి న్యూస్
హైదరాబాద్‌లో లష్కర్ బోనాల సందడి మొదలైంది. ఆషాడ మాసంలో జరిగే బోనాలతో పోలిస్తే లష్కర్ బోనాలకున్న క్రేజ్ వేరు. సికింద్రాబాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి బోనాలు ఆదివారం జరుగనున్నాయి. ఇందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బోనాల సందర్భంగా ట్రాఫిక్ అధికారులు ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు 21వ తేదీ ఆదివారం తెల్లవారుజాము 4 గంటల నుంచి పూజలు పూర్తయ్యే వరకు మరుసటి రోజు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. ఇదిలా ఉంటే బోనాలను విజయవంతం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో అన్నపూర్ణ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తామంటున్నారు. బోనాలు ఎదుర్కొలు 7వ తేదీతో జాతర ప్రారంభమైందన్నారు. ప్రతి రోజు ఇక్కడకు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారని.. మినీ జాతరకు 5లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసినట్లు చెప్పారు. అన్ని శాఖల సహకారంతో బోనాలను కన్నులపండుగగా నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. గతంలో భక్తులు సమర్పించిన కానుకలతో బంగారు బోనం సమర్పించేవారమని, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం నిధులు ఇస్తోందని అన్నారు. ఈ బోనాలకు రూ. 12లక్షల చెక్కు ఇచ్చారన్నారు. అమ్మవారి కుంకుమ నుదుట ధరిస్తే నిండు సౌభాగ్యం కలుగుతుందని ఓ నమ్మకం ఉందని, ఆషాడ మాసంలో అమ్మవారిని దర్శించుకోవాలన్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
– మహంకాళి ఆలయం, టోబకో బజార్, జనరల్ బజార్‌లలో రోడ్లను మూసివేస్తారు. వాహనాలను అనుమతించరు.
– జనరల్ బజార్ నుంచి ఆలయ మార్గం, ఆడవయ్య చౌరస్తా నుంచి మహంకాళి ఆలయ మార్గం, సుభాష్ రోడ్డు, బాటా, రాంగోపాల్ పేట మార్గాలను మూసివేస్తారు.
– సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి హకీంపేట, బోయిన్ పల్లి, బాలానగర్, అవిూర్ పేట వెళ్లే ట్రాఫిక్‌ను క్లాక్ టవర్ నుంచి వయా ప్యాట్నీ, సాఎస్‌బిహెచ్ వైపు నుంచి వెళ్లాలి.
– క్లాక్ టవర్ నుంచి ఆర్పీ రోడ్డు వైపు వెళ్లే వాహనాలు ప్యాట్నీ చౌరస్తా నుంచి ఎస్‌బీహెచ్ క్రాస్ రోడ్డు, ప్యారడైజ్ వైపు మళ్లిస్తారు.
– సీటీవో జంక్షన్ నుంచి ఎంజీ రోడ్డు వెళ్లే వాహనాలను ప్యారడైజ్ క్రాస్ రోడ్డు వద్ద హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వైపు మళ్లిస్తారు.
– ఆర్టీసీ బస్సులు రైల్వే స్టేషన్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లేవి అల్ఫా ¬టల్, గాంధీ ఎక్స్ రోడ్, ఓల్డ్ మహంకాళీ ట్రాఫిక్, బైబుల్ హౌస్ కర్బాల మైదాన్ రూట్‌లో వెళ్లాల్సి ఉంటుంది.
– తాడ్ బన్ వైపు వెళ్లే వాహనాలు క్లాక్ టవర్, ప్యాట్నీ, వైఎంసీఏ, ఎస్‌బీ హెచ్ ఎక్స్ రోడ్డు విూదుగా వెళ్లాలి.
-హ బైబిల్ హౌస్ నుంచి వచ్చే వాహనాలు ఝాన్సీమండి ఎక్స్ రోడ్డు నుంచి సజ్జనాల్ స్టీట్ర్, హిల్స్ స్ట్రీట్ వైపు మళ్లిస్తారు.
– ఎస్‌బిహెచ్ చౌరస్తా నుంచి ఆర్పీ రోడ్డు వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తాలో దారి మళ్లిస్తారు.