ఇంటికో మొక్కను నాటుకోవాలి హరితహారంలో భాగస్వాములు కావాలి
కలెక్టర్
యాదాద్రి,జూలై20: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని కలెక్టర్ అనితారాంచంద్రన్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములై విస్తృతంగా మొక్కలు నాటి హరిత జిల్లాగా తీర్చిదిద్దాలని కోరారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటివద్ద కనీసం ఒక్కో మొక్క నాటుకోవాలని సుచించారు. గతంలో ఉన్న అడవులు కనిపించడం పోతున్నాయని, అడవులు అంతరించి పోకుండ రక్షించుకోవడం బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పథకాన్ని అమలు చేసి అడవులతోపాటు గ్రామాల్లో, వ్యవసాయ భూముల్లో, చెరువుల కట్టలపై అనేక రకాల మొక్కలు నాటుతుందన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమతమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలన్నారు. వ్యవసాయ రైతులు భూముల గట్లపై పండ్ల మొక్కలు నాటుకుంటే భావితరలకు ఎంతోగాను ఉపయోగ పడుతాయన్నారు.