కళ్యాణలక్ష్మికి కష్టాలు

నెలల తరబడి కదలని దరఖాస్తులు 
సిద్దిపేట,జూలై19:- పేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందని భావించిన కల్యాణలక్ష్మి ఏడాదిగా నిలిచిపోవడం పలు కుటుంబాల్లో సమస్యగా మారింది. వరుసగా ఎన్నికల కోడ్‌ అమలులోఉండటం వల్ల కల్యాణలక్ష్మి ్గ/ళ్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇపుడు ఎన్నికల కోడ్‌ ముగిసినా దరఖాస్తుల పరిష్కారంలో వేగం పుంజుకోవడం లేదు. మునిసిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకాకముందే సహాయం అందించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. జిల్లాలో ఏడాది నుంచి పేదింటి ఆడబిడ్డలను కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కరుణించడం లేదు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకుఅండగా నిలుస్తుందని ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టింది. కానీ ఆచరణలో మాత్రం విఫలమవుతున్నది. పెళ్లికాగానే దరఖాస్తు చేసుకుని అనేక మంది మంజూరుకోసం ఎదురుచూస్తున్నారు. ఏడాది దాటినా కల్యాణలక్ష్మి చెక్కులు అందకపోవడంతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కిందపట్టణ ప్రాంతాలలో వార్షికాదాయం రూ.2లక్షలలోపు, గ్రావిూణ ప్రాంతాలలో వార్షికాదాయం రూ.లక్ష లోపు ఉన్న అల్పాదాయ వర్గాల కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.1,00, 116లుఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. కొన్ని కుటుంబాలు ఈ డబ్బు వస్తుందన్న ధీమాతో అప్పోసప్పో చేసి పెళ్లిళ్లు చేశాయి. ఏడాది కాలంగా ఈ పథకం కింద ఆర్థిక సహాయంఅందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పెండింగ్‌లో ఉన్న వాటిలో ఎస్సీ డెవలప్‌మెంట్‌ పరిధిలో 473 దరఖాస్తులు, ఎస్టీ వెల్ఫేర్‌ కింద 118, బీసీ వెల్‌ఫేర్‌ కింద 2,670, ఈబీసీలు 393 మంది, మైనార్టీలకు చెందిన 174 దరఖాస్తులున్నట్లు అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయి. నెలల తరబడి దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. నిబంధనల ప్రకారం సాధారణంగాఅర్హులైన వారు తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే వారు తనిఖీ చేసి అర్హులను గుర్తించిన తర్వాత శాసనసభ్యుల కార్యాల యాలకు పంపిస్తారు. వారి ఆమోదం తర్వాత ఆర్డీవోలకు పంపిస్తే వారిసిఫారసు మేరకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదలవుతాయి. ఒక్కొక్క దశలో 20 రోజుల నుంచి నెల రోజులకు పైగా వేచి చూడాల్సి వస్తుండటంతో 45 రోజుల్లో పరిష్కరించాల్సిన దరఖాస్తులకునెలల తరబడి మోక్షం లబించడం లేదు. గత 
సంవత్సరం అక్టోబరు నుంచి వరుసగా ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. మధ్యలో కొద్ది రోజుల విరామం దొరికినా పనులు కాలేదు. ఎన్నికల కోడ్‌ ముగిసి నెలలు గడుస్తున్నాఇపుడు అదే పరిస్థితి కొనసాగుతున్నది.