బుట్టలకొద్దీ అందం
బుట్ట బొమ్మలకు బుట్టలకొద్ది అందాన్ని జత చేయడానికే అన్నట్టు ఇప్పుడు మెడ వంపుల్లోనూ బుట్టలు చేరాయి. హదయానికి అలంకారంగా అమరాయి. చెవులకు ఎన్ని రకాల హ్యాంగింగ్స్ ఉన్న బుట్టలదే ఇప్పటికీ అగ్రస్థానం. అందుకే బుట్టలు బంగారంతోనే కాదు ఫ్యాషన్ జువెల్రీలోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాయి. హారాలుగా అందాన్ని పెంచాయి.
-ఒక బుట్టతో హారాలు వచ్చాయి. అవి బంగారంలోనూ, ఇమిటేషన్ జువెల్రీలోనూ రూపుకట్టాయి.
– ఇప్పుడు సిల్వర్, థ్రెడ్.. ఫ్యాషన్ జువెల్రీలోనూ బుట్టల హంగులు కొత్తగా చేరాయి.
– చిన్న చిన్న పూసలు అవి ఎరుపు, పసుపు, పచ్చ రంగుల్లోవి ఎంచుకొని హారంగా గుచ్చాలి. వాటికి బ్రాస్, సిల్వర్ బుట్టలను మధ్య మధ్యలో జత చేయాలి.
– పూసలు, కుందన్స్‌తో హారాలు చేయించుకుంటే వాటి రంగుతో పోలి ఉండే బుట్టల లాకెట్‌ను జత చేస్తే చాలు. హారానికి ఫలితంగా ధరించినవారి అందం రెట్టింపు అవుతుంది.

బంగారమంటే ఎవరికిష్టముండదు చెప్పండి.. ముఖ్యంగా ఆడవారికైతే బంగారమంటే మహామోజు. చెవి కమ్మలు మొదలు హారాలు, వడ్డాణాలు అబ్బో ఒకటేమిటి నఖశిఖ పర్యంతం బంగారం దిగేసుకోవటమంటే మహా సరదా వారికి. నగలన్నీ అలంకరించుకుని తమని తాము చూసుకుని తెగ మురుసిపోతుంటారు. ఆభరణాలనగానే మహిళలకు ఠక్కున గుర్తొచ్చేది చెవికమ్మలు.. ముఖ్యంగా ముఖారవిందాన్ని మరింతగా పెంచే బంగారపు బుట్టలు..
పెద్ద పెద్ద బుట్టలు పెట్టుకోవటం ఇప్పుడు నయా ట్రెండ్. వివిధ రకాల రాళ్ళు పొదిగిన పెద్ద పెద్ద బుట్టలు చెవికి తగిలించుకుంటే చాలు… మిగిలిన నగలెన్ని పెట్టుకున్నా వాటి ముందు బలాదూర్. అందుకే పండగలు, పబ్బాలకు ఫంక్షన్లకి అతివలు బుట్టలు ధరించేందుకు ఇష్టపడతారు. ఓణీలు, చీరెలకు యాప్ట్‌గా సరిపోయే కర్ణాభరణాలివి
నెల్లూరుకి చెందిన షేక్ రబ్బానీ భారీ సైజులో ఉండే బంగారు బుట్టలు తయారు చేశాడు. ఇంకేముంది.. ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. రబ్బానిని అందరూ తెగ పొగిడేస్తున్నారు.

ఏం చేసినా డిఫరెంట్‌గా చేయాలనుకుంటాడు నెల్లూరుకు చెందిన స్వర్ణకారుడు రబ్బానీ. అందుకే భారీ సైజులో బంగారు బుట్ట తయారు చేసి రికార్డు స ష్టించాడు. అక్షరాలా 350 గ్రాముల బంగారంతో అతి భారీ సైజు కర్ణాభరణాలకి శ్రీకారం చుట్టాడు. చూసిన వారంతా వామ్మో ఇంత పెద్ద బుట్టలా అని అవాక్కౌతున్నారు. మరి ముఖ్యంగా లేడీస్ అయితే రబ్బానీకి ఫ్యాన్స్ అయిపోయారు.
రబ్బానీ ది పేదకుటుంబం.. పేదరికం వల్ల పెద్దగా చదువుకోలేదు. కుటుంబ పోషణకై… చిన్నతనంలోనే బంగారు షాపులో పనికి కుదిరాడు. అంచెలంచెలుగా ఎదిగి.. కొన్ని సంవత్సరాలకు నెల్లూరులోని చిన్నబాజారు యహారీ వీధిలో సొంతంగా షాపు ఏర్పాటు చేసుకున్నాడు. మిగిలిన స్వర్ణకారుల మాదిరిగా కాకుండా.. వెరైటీగా ఏమైనా తయారు చేయాలనుకుంటాడు. చెవి కమ్మల దగ్గర్నుంచి హారాలు వడ్డాణాలు ఒక్కటేమిటి.. అన్నింటిలో తన మార్క్ డిజైన్స్ కనిపించేలా రూపొందించి మహిళల్ని ఆకట్టుకుంటున్నాడు.
సాధారణ ఆభరణాలు ఎంత బాగా చేసినా… పెద్దగా ఎవరూ గుర్తించడం లేదు. అందులోనూ ఇటీవల కాలంలో… నెల్లూరులో స్వర్ణకారులు చాలా మందికి పని కూడా లేదు. కార్పోరేట్ సంస్థల ఆగమనంతో స్వర్ణకారులకి పనిలేకుండా పోయింది. ఆ క్రమంలో భారీ బుట్టలు తయారు చేయాలని అనుకున్నాడు. అంతే.. పదిరోజుల పాటు రోజుకి పది గంటలు శ్రమించి.. ఇదో ఇలా భారీ బంగారు బుట్ట కమ్మ రూపొందించి రికార్డు స ష్టించాడు. మూడు వందల యాభై గ్రాముల బంగారం, నాలుగు వందల యాభై గ్రామాలు వెండి, రాగి, యాభై గ్రాముల రాళ్లు తయారీలో వినియోగించాడు.
ప్రస్తుతం ఈ ఫొటోలు వాట్సాప్‌లో హల్ ఛల్ చేస్తున్నాయి. దీనిని చూసిన వారంతా వామ్మో… భలే.. భలే.. బంగారు బుట్ట అంటున్నారు. రబ్బానీ మాత్రం కాస్తంత చేయూత ఇవ్వండి.. ఇలాంటివి బోలేడు రూపొందించి.. మన దేశ ప్రతిభ సత్తాని చాటుతామంటున్నారు.