అతిక్రమిస్తే‘కఠిన చర్యలు’
- ప్రచారం ముగియడంతో 144 సెక్షన్ అమలు
- 13న ఎన్నిక..జూన్ 4న కౌంటింగ్
- నలుగురు కన్నా ఎక్కువ మంది గుమిగూడొద్దు
- ఎలక్ట్రానికి మీడియాలో ప్రచారానికి నో
- స్థానికేతరులు ఆయా ప్రాంతాలు విడిచి వెళ్లాలి
- పేపర్లలో ప్రకటనల కోసం ముందస్తు అనుమతి
- కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో 232 పోలింగ్ కేంద్రాలు
- ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్ అనుసంధానం
- ఇప్పటి వరకు రూ.320 కోట్ల నగదు సీజ్
- పోలింగ్ విధుల్లో లక్ష 90 వేల మంది సిబ్బంది
- 175 కంపెనీల కేంద్ర భద్రతా బలగాలతో నిఘా
- తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడి
హైదరాబాద్,జ్యోతిన్యూస్:
లోక్‌సభ ఎన్నిక నేపథ్యంలో శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసింది.ఆ తరవాత తెలంగాణ రాష్ట్రం లో 144 సెక్షన్ అమలవుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. నలుగురు కన్నా ఎక్కువ మంది గుమిగూడొద్దని స్పష్టం చేశారు. ఎలక్టాన్రిక్ డియాలో ఆరు గంటల నుంచి ప్రచారం చేయొద్దని తేల్చి చెప్పారు. జూన్ 1వ తేది సాయంత్రం 6.30 నిమిషాల వరకు 144 సెక్షన్ ఉంటుందని వివరించారు. మే 13వ తేదీన కొన్ని సంస్థలు సెలవు ఇవ్వడం లేదని తెలుస్తోంది.ఆ రోజు సెలవు ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్, హోటళ్లలో ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులు వెళ్లి పోవాలని వికాస్ రాజ్ సూచించారు.పేపర్లలో ప్రకటనల కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.160 కేంద్ర కంపెనీ ల బలగాలు రాష్ట్రంలో ఇప్పటికే మొహరించాయని వివరించారు. ఇతర రాష్టాల్ర నుంచి 20 వేల పోలీస్ బలగాలు వచ్చాయని పేర్కొన్నారు.ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్‌లో రెండు బ్యాలెట్ యూనిట్లు ఉంటాయని వివరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో 232 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్ ఉంటుందని,వాటిని సీఈఓ ఆఫీస్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంద ని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.రూ.320 కోట్ల నగదు ఇప్పటి వరకు సీజ్ చేశామని వివరించారు.నిబంధనలు అతిక్ర మించిన వారిపై 8600 కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. లక్ష 90 వేల మంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నా రని వివరించారు.వచ్చే 48 గంటల పాటు వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని వివరించారు. బల్క్ మెసేజ్‌లు సాయంత్రం 6 గంటల నుంచి ఆపాలని తేల్చి చెప్పారు. లక్ష 88 వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇప్పటి వరకు పోల్ అయ్యాయని తేల్చి చెప్పారు. 21 వేల 680 మంది ఓటర్లు హోం ఓటింగ్ వేసుకున్నారని వికాస్ రాజ్ తెలిపారు. 328 పోలింగ్ కేంద్రాలను ఏజెన్సీ ఏరియాల్లో ఏర్పాటు చేశామని వెల్లడించారు. మూడు పోలింగ్ కేంద్రంలో అత్యల్ప ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇక పోలింగ్‌కి ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటి వరకు 400 కోట్లకు పైగా విలువగల డబ్బు, మద్యం, వస్తువులను సీజ్ చేసింది. ఎన్నికల నిఘా, భద్రత కోసం రాష్ట్ర పోలీసులతో పాటు, 175 కంపెనీల కేంద్ర భద్రతా బలగాలతో నిఘా పెట్టింది. ఎన్నికల విధుల్లో 2.80 లక్షల మంది ఉద్యోగులు పాల్గొననున్నారు. ఈనెల 13న తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల కమిషన్. రాష్ట్రంలో మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్లు ఉండగా.ఇందులో సగానికి పైగా మహిళా ఓటర్లే ఉన్నారు.17 పార్లమెం ట్ నియోజకవర్గాలకుగాను 13 నియోజక వర్గాల్లో మహిళ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల 809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్లలో ఎండలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని సూచించింది ఎన్నికల సంఘం. 9,900 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించిన ఎన్నికల సంఘం, అలాంటి ఏరియాల్లో ప్రత్యేక బలగాలతో నిఘా పెట్టేలా ప్లాన్ చేసింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలను నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన ఎన్నికల సంఘం.. అలాంటి ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగాలని నిర్ణయించింది.రాష్ట్ర పోలీ సులతో పాటు ఎన్నికల విధుల్లో భాగంగా కేంద్రం నుండి 175 కంపెనీలు విధుల్లో ఉండనున్నాయి. ఎన్నికల విధుల్లో 2.80 లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించనున్నారు. ఎన్నికల్లో వ్యయ పరిశీలకులుగా 14 మందిని నియమి ంచారు. జనరల్ పరిశీలకులుగా 17 మందిని నియమించారు.ఇక హోమ్ ఓటింగ్ కోసం 23,247 మంది ఓటర్లు దర ఖాస్తు చేసుకోగా. ఇందులో 21,651 మంది ఓటు వేశారు.ఇక ఇవాల్టి వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా లక్ష 80 వేల కు పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఎన్నికలో టెక్నాలజీని కూడా ఈసారి బాగానే వినియోగిస్తున్నారు.సువిధ,సి విజిల్ యాప్‌లతో పాటు 1950 కాల్ సెంటర్ అందుబాటులో ఉంచారు. నేటితో ప్రచారాకిని గడువు ముగుస్తుంది. మిగిలే ఒక్క రోజు చాలా కీలకం కావడంతో అధికారులను ఎన్నికల సంఘం మరింత అప్రమత్తం చేసింది.