మళ్లీ ‘భారీ వర్షాలు’!

  • మేఘావృతం అయిన ఆకాశం
  • జంటనగరాల్లో భారీ వర్షం
  • ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. శనివారం మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృత్తమై చిరు జల్లులతో వర్షం ప్రారంభమైంది.నగరంలోని అవి•ర్‌ ‌పేట్‌, ‌పంజాగుట్ట, బేగంపేట్‌, ‌సికింద్రాబాద్‌, ‌బంజారా హిల్స్, ‌మెహిదీ పట్నం తదితరల ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుండగా.. దిల్‌సుఖ్‌నగర్‌, ‌కొత్తపేట్‌, ఎల్‌బి నగర్‌,‌చింతల్‌కుంట, వనస్థలిపురంలో భారీ వర్షం పడుతోంది. దీంతో వర్షపు నీరు రహదారులపై చేరడంతో వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భాగ్యనగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఉరుముల ధాటికి నగరవాసులు భయపడిపోతున్నారు. ఇంటి నుంచి బయటికెళ్లిన జనాలు తిరిగి ఇంటికెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. మరికాసేపట్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఎల్లో సూచికను కూడా జారీ చేయడం జరిగింది.నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని..ఇళ్లలో నుంచి బయటికి రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.తెలుగు రాష్టాల్రతో పాటు పలు రాష్టాల్ల్రో శనివారం రోజు భారీవర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని లక్షద్వీప్‌ ‌ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధప్రదేశ్‌, ‌తెలంగాణ, కేరళ రాష్టాల్లో్ర విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. కేరళలోని ఉత్తర జిల్లాలకు ఆరెంజ్‌ ‌హెచ్చరిక జారీ చేశారు. కేరళలో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ అధికారులు సూచించారు. ఉత్తర కోస్తాంధ్రలోని చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కొన్ని రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశముందని తెలంగాణ స్టేట్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌ప్లానింగ్‌ ‌సొసైటీ వెల్లడించింది. రాజధాని నగరమైన హైదరాబాద్‌ ‌నగరంలో శనివారం ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఉదయమే ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో అక్టోబర్‌ 19 ‌వరకు ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవవచ్చని ఐఎండీ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఎపికి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. కృష్ణానగర్‌, ‌బారిపాడ, మల్కన్‌ ‌గిరి, హనంకొండ, ఔరంగబాద్‌, ‌సిల్వాసా ప్రాంతముల గుండా కొనసాగుతుందని, రాగల 24 గంటలలో మహారాష్ట్ర, తెలంగాణలలోని మరికొన్ని ప్రాంతముల నుండి మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతముల నుండి నైరుతి రుతుపవనాలు తిరోగమించే అవకాశాలు ఉన్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 5.8 ••ప ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపు వంగి కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావము వలన రాగల 24 గంటలలో అదే ప్రాంతములలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 24 గంటలలో ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఒడిషా-ఉత్తర ఆంధప్రదేశ్‌ ‌తీరాలను చేరుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతము తూర్పు-పశ్చిమ ఉపరితల ద్రోణి 13 డిగ్రీల అక్షాంశము వెంబడి తూర్పుమధ్య బంగాళాఖాతం,దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నుండి కర్ణాటక తీరానికి దగ్గరగా తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతములో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్రమట్టానికి 4.5 అడుగు నుండి 5.8 అడుగుల ఎత్తుల మధ్య కొనసాగుతోంది.వీటి ఫలితంగా ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఎక్కువ వర్షాలు ఉన్నట్లు స్పష్టం వాతావరణ శాఖ చేసింది.