సాంప్రదాయ భోజనం నిలిపివేయడం సరైనదే

  • ధర్మప్రచారాన్ని ముమ్మరం చేయాలన్న స్వరూపానంద

విశాఖపట్నం : రిషికేశ్‌ ‌లోని తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్తులను ఈవో డాక్టర్‌ ‌కెఎస్‌ ‌జవహర్‌ ‌రెడ్డి శనివారం పరిశీలించారు. తొలుత ఆంధ్రా ఆశ్రమంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వార్ల దర్శనం చేసుకున్నారు.
అనంతరం అక్కడి భవనాలను పరిశీలించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు.
టీటీడీ ఆస్తులను పరిశీలించి, వాటి పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈవో అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్టేట్‌ ‌విభాగం ప్రత్యేక అధికారి శ్రీ మల్లిఖార్జున, ఎగ్జిక్యూటివ్‌
ఇం‌జనీర్‌ ‌నరసింహమూర్తి తో పాటు స్థానిక అధికారులు ఉన్నారు.
అనంతరం ఈవో డాక్టర్‌ ‌జవహర్‌ ‌రెడ్డి రుషికేష్‌ ‌లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామి వారిని కలిశారు. సాంప్రదాయ భోజన విక్రయాలను నిలిపేస్తూ నిర్ణయాన్ని ప్రకటించడంపై స్వరూపానందేంద్ర సరస్వతి హర్షం వ్యక్తం చేశారు. అలాగే టీటీడీ ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయాలని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సూచించారు. టీటీడీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ‌జవహర్‌ ‌రెడ్డి.. శనివారం రిషికేష్‌ ‌వెళ్ళి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాములను కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ చేపట్టాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాలపై ఈఓ జవహర్‌ ‌రెడ్డికి.. స్వాములు పలు సూచనలు చేశారు. స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ గ్రావి•ణ ప్రాంతాల్లోని ఆలయాలను కేంద్రంగా చేసుకుని టీటీడీ తరపున హిందూ ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయాలని చెప్పారు. గిరిజన, హరిజన ప్రాంతాల్లో భజన మండళ్లకు పూర్వవైభవం తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా టీటీడీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఈవో జవహర్‌ ‌రెడ్డి.. పీఠాధిపతుల దృష్టికి తీసుకొచ్చారు. చిల్డ్ర ‌స్పెషాలిటీ హాస్పిటల్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని వివరించారు. టీటీడీ ద్వారా గోరక్షణ కోసం విస్తృత చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలపై ఈవో జవహర్‌ ‌రెడ్డిని స్వరూపానందేంద్ర స్వామి అభినందించారు.