కరోనాను అడ్డుకోవడం కోసం కఠినంగా వ్యవహరిస్తున్నాం
- లాక్‌డౌన్‌ను ప్రజలను ఖచ్చితంగా పాటించాలి: డిజిపి
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
కరోనా మహమ్మారిని అడ్డుకోవడమే పోలీసు శాఖ లక్ష్యమని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. పెరుగుతన్న కేసులను తగ్గించే లక్ష్యంతో పెట్టిన లాక్డౌన్ వల్ల జనప్రవాహం తగ్గి వ్యాప్తి తగ్గుతోందని అన్నారు. లాక్డౌన్ అమలును డీజీపీ మహేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ, బాలానగర్, బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి, కండ్లకోయ ప్రాంతాల్లో గురువారం డీజీపీ పర్యటించారు. పర్యటనలో భాగంగా లాక్డౌన్ పరిస్థితు లను ఆయన పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో విధుల్లో ఉన్న పోలీసులకు డీజీపీ పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా డీజీపీ డియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో లాక్డౌన్ 100 శాతం విజయవంత మైందని పేర్కొన్నా రు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారు. లాక్డౌన్ అమలు చేయడం వల్ల కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రంలోకి రావాలంటే ఈ-పాసులు తప్పనిసరని స్పష్టం చేశారు. ఇదిలావుంటే నగరంలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. గురువారం నార్త్‌జోన్ పరిసర ప్రాంతాల్లో లాక్డౌన్ ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా డియాతో సీపీ మాట్లాడుతూ నార్త్‌జోన్ పరిధిలో ఎక్కువగా ఇతర జిల్లాల నుండి వాహనాలు వస్తున్నాయన్నారు. నార్త్ జోన్ పరిసర ప్రాంతాలలో మెడికల్ ఎమ్జ్గ•న్సీ ఎక్కువగా ఉందని తెలిపారు. ఫేక్ ఐడి కార్డస్ నకిలీ పాస్‌లు తీసుకుని రోడ్ల దకు వస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోజుకు 5 వేల నుండి 6 వేల వాహనాలు సీజ్ చేస్తున్నామన్నారు. ఈరోజు నార్త్ జోన్లో ఇప్పటికే 100 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి లాక్‌డౌన్‌ను విజయవంతం చేయాలని సీపీ అంజనీకుమార్ కోరారు.