అందరి సలహాలతో ముందుకు వెళతా: ఈటెల
- పాత ఉద్యమకారులతో మాట్లాడా
కరీంనగర్,జ్యోతిన్యూస్ :
రెండు రోజులుగా అందరితో మాట్లాడానని.. పాత ఉద్యమకారుల సలహాలు తీసుకున్నానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని జిల్లాల నేతలూ వచ్చి కలిశారన్నారు. తనకు జరిగిన అన్యాయంపై స్పందించారన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆత్మీయులతో మాట్లాడుతానని.. వాళ్ళతో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తానన్నారు. ఆత్మ గౌరవం పెద్ద సమస్య అయ్యిందని పేర్కొన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయమని.. అందరూ అర్థం చేసుకోవాలన్నారు. సమస్య వస్తే దగ్గరికే వస్తానని ఈటల వెల్లడించారు

