కట్టు కథే…!

  • బి.ఫార్మిసి విద్యార్థిని కిడ్నాప్‌ ‌కేసు ఫార్స్
  • అదంతా డ్రామాగా గుర్తించిన పోలీసులు
  • అత్యాచారం అబద్దమని తేల్చిన వైద్యులు
  • కుటుంబ కలహాలతోనే డ్రామాలన అడినట్లు గుర్తింపు
  • వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి మహేశ్‌ ‌భగవత్‌

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌ఘట్‌కేసర్‌ ‌బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్‌ ‌వ్యవహారం ఓ ఫాల్స్ ‌కేసునుగా పోలీసులు నిర్దారించారు. బీఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం జరగలేదని రాచకొండ సీపీ మహేష్‌ ‌భగవత్‌ ‌తెలిపారు. విద్యార్థినిపై కిడ్నాప్‌, అత్యాచారం జరిగిందన్నది అవాస్తవం అన్నారు. కావాలనే యువతి కట్టుకథలు అల్లిందని తెలిపారు. ఘట్‌కేసర్‌ ‌విద్యార్థిని ఘటనపై శనివారం సీపీ మహేష్‌ ‌భగవత్‌ ‌డియాకు వివరాఉల వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతి చెప్పినవిధంగా ఘటన జరిగినట్లు ఆధారాలు లేవన్నారు. విద్యార్థిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భయపడి అబద్ధం చెప్పిందని తెలిపారు. విద్యార్థిని చెప్పిన విధంగా ఘటన జరిగినట్లు ఆధారాలు లేవని చెప్పారు.10 వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు డయల్‌ 100‌కు కాల్‌ ‌వచ్చిందని తెలిపారు. యువతిని ఆటోవాళ్లు కిడ్నాప్‌ ‌చేశారనే కాల్‌ ‌వచ్చిందని పేర్కొన్నారు. ఫిర్యాదు రాగానే పోలీసులు అలర్ట్ అయ్యారని తెలిపారు. పోలీసులు వెళ్లేసరికి యువతి స్పృహ కోల్పోయి ఉందన్నారు. రాత్రి 7.50 గంటలకు యవతి సెల్‌ ‌ఫోన్‌ ‌రెస్పాండ్‌ అయిందని చెప్పారు. తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు చెప్పిందని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్‌తో గతంలో వివాదాలున్నాయని విద్యార్థిని చెప్పినట్లు వెల్లడించారు. 100 సీసీ కెమెరాల ఫుటేజ్‌ ‌ను పరిశీలించినట్లు ప్రకటించారు. సీసీ ఫుటేజ్‌ ‌పరిశీలిస్తే ఎటువంటి ఆధారాలు లభ్యమవ్వ లేదన్నారు. కుటుంబ వివాదంతోనే యువతి బయటకు వెళ్లిందని చెప్పారు. పేరెంట్స్ ‌ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని తెలిపారు. విచారణలో అదంతా అవాస్తమని తేలిందని చెప్పారు. కొందరు అనుమానితుల్ని గుర్తించామని చెప్పారు. కేసులో విచారించిన ఆటో డ్రైవర్లకు మహేశ్‌ ‌భగవత్‌ ‌క్షమాపణలు చెప్పారు. విద్యార్థినిపై అత్యాచారం జరగలేదని, కిడ్నాప్‌కు కూడా ఎవరూ ప్రయత్నించలేదని రాచకొండ సీపీ మహేశ్‌ ‌భగవత్‌ ‌స్పష్టం చేశారు. 10వ తేదీ సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 7:50 గంటల వరకు 4 కిలోటర్ల నడిచిన యువతి.. కిడ్నాప్‌, అత్యాచారం చేశారని నాటకామాడింది. ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు బీ ఫార్మసీ చదువుతున్న యువతి రాంపల్లి బస్టాండ్‌ ‌వద్ద కాలేజీ బస్సు దిగింది. అక్కడ్నుంచి ఆటోలో తన సీనియర్‌తో కలిసి ఎక్కింది. ఆమె దిగాల్సిన స్టాప్‌ ‌కంటే ముందే సీనియర్‌ ‌దిగి వెళ్లిపోయాడు. హెరిటేజ్‌ ‌స్టాప్‌ ‌వద్ద దిగాల్సిన విద్యార్థి, ఆ తర్వాతి స్టాప్‌లో ఆటో దిగింది. అప్పుడు సాయంత్రం 6:30 గంటల సమయం అవుతోంది. యువతి తన తల్లికి ఫోన్‌ ‌చేసి తనను ఎవరో కిడ్నాప్‌ ‌చేశారని చెప్పింది. దీంతో కంగారుపడ్డ తల్లి 100కి డయల్‌ ‌చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కీసర, ఘట్‌కేసర్‌, ‌మల్కాజ్‌గిరి పోలీసులు అప్రమత్తమై యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువతికి పలుమార్లు ఫోన్‌ ‌చేయగా చివరకు 7:45 గంటలకు ఫోన్‌ ‌లిప్ట్ ‌చేసింది. తాను ఉన్న లోకేషన్‌ను పోలీసులకు షేర్‌ ‌చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. యువతి కాలికి గాయమైనట్లు పోలీసులు గుర్తించారు. బట్టలు కూడా సరిగా లేకపోవడంతో పోలీసులు ఆమెపై అత్యాచారం జరిగిందని భావించి మేడిపల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అప్పటికీ ఆ అమ్మాయి పోలీసులకు స్పందించడం లేదు. ఏం జరిగిందో చెప్పే స్థితిలో లేదు. పోలీసులు ఆ రోజు రాత్రి అమ్మాయిని విచారిస్తున్న సందర్భంగా కొన్ని విషయాలు చెప్పింది. తనను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని ఇంజెక్షన్‌ ఇచ్చారని, తలపై బాదారని తెలిపింది. తెల్ల కలర్‌ ఆటోలో ఈ ఘటన జరిగినట్లు, అది సెవెన్‌ ‌సీటర్‌ ఆటోల అని చెప్పింది. యువతి చెప్పిన సమాచారంతో అన్నోజిగూడ ఏరియాలోని ఆటో డ్రైవర్లను సుమారు 100 మందిని విచారించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ ముగ్గురిలో ఒకరు తనను బలవంతం చేశారని పోలీసులకు తెలిపింది. దీంతో అతన్ని పోలీసులు విచారణ చేయగా, తాను ఆ సమయంలో బార్‌కు వెళ్లానని ఆటో డ్రైవర్‌ ‌చెప్పాడు. డ్రైవర్‌ ‌సమాధానంతో సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించగా నిజమేనని తేలింది. యువతి తప్పుదోవ పట్టిస్తున్నట్లు పోలీసులు గ్రహించారు. ఇక ఆ యువతి మరుసటి మరో నాటకానికి తెరలేపింది. తనపై అత్యాచారం చేశారని తెలిపింది. దీంతో యువతిని మెడికల్‌ ఎగ్జామినేషన్‌కు పంపగా అలాంటిదే జరగలేదని తేలింది. ఇక చివరకు ఆ యువతి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది. ఇంటి నుంచి వెళ్లిపోయేందుకే కిడ్నాప్‌ ‌నాటకం, అత్యాచారం చేశారని తల్లికి ఫోన్‌ ‌చేసి చెప్పానని యువతి పోలీసులకు చెప్పింది. ఆర్నేళ్ల క్రితం కూడా ఆమె ఇలాగే కిడ్నాప్‌ ‌నాటకామాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. కుటుంబ సభ్యులతో గొడవల కారణంగానే యువతి ఈ ప్రణాళిక చేసినట్లు పోలీసులు వికరించారు.