కరోనా..భారతం

మృతుల సంఖ్య 437..13 వేలకు దాటిన కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు 437 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. బాధితుల సంఖ్య 13వేలు దాటింది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1007 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,387కి చేరింది. మొత్తం బాధితుల్లో 1749 మంది కోలుకోగా ప్రస్తుతం మరో 11,201మంది చికిత్స పొందుతున్నారు. గడచిన మూడురోజుల్లో దేశంలో దాదాపు వేయి మంది కోలుకోవడం కాస్త ఉపశమనం కలిగించే విషయం. మహారాష్ట్రలోనే 194 మరణాలు.. మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా రాష్ట్రంలో కొవిడ్ మృతుల సంఖ్య 194కి చేరింది. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 289 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3205కి చేరింది. ముంబయిలో కొవిడ్-19 తీవ్రత ఆందోళనకరంగా ఉంది. కేవలం ఒక్క ముంబయి నగరంలోనే 2వేల కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దేశ రాజధాని దిల్లీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. తాజాగా పాజిటివ్ కేసులు సంఖ్య 1640కి చేరింది. వీరిలో 38మంది మృత్యువాతపడ్డారు. వైరస్ తీవ్రత అధికంగా ఉ న్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక తమిళనాడులో కేసుల సంఖ్య 1267కి చేరింది. రాజస్థాన్లో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 1131కి చేరగా ముగ్గురు మృత్యువాతపడ్డారు. మహారాష్ట్ర అనంతరం కరోనా వైరస్ తో మరణించే వారి సంఖ్య మధ్యప్రదేశ్, గుజరాత్ లలో అధికంగా ఉంది. మధ్యప్రదేశ్ లో ఇప్పటివరకు 1120మందికి కరోనా నిర్ధారణ కాగా వీరిలో 53మంది ప్రాణాలు విడిచారు. గుజరాత్ లో నిన్న ఒక్కరోజే 164 కేసులు నమోదుకాగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 930కి చేరింది. ఈ వైరస్ సోకి 36మంది బలయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో 534, తెలంగాణలో 700 కేసులు.. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా తీవ్రత అధికంగా ఉంది. తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 700కు చేరగా.. 18మంది మరణించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఈ వైరస్ సోకి 14మంది మరణించగా మొత్తం కేసుల సంఖ్య 534కి చేరింది. హైదరాబాద్, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఈ వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య అత్యధికంగా ఉంది. గుజరాత్ లో విజృంభణ గుజరాత్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. శుక్రవారం ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. దీంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. గడిచిన 12 గంటల్లో కొత్తగా 92 కేసులు నమోదు అయ్యాయని, దాంతో కేసుల సంఖ్య 1021కి పెరిగిందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయంతి రవి మీడియాకు తెలిపారు. అలాగే శుక్రవారం ఇద్దరు మృత్యువాత పడడంతో మృతుల సంఖ్య 38కి పెరిగిందన్నారు. వడోదరలో 31 ఏళ్ల వ్యక్తి, అహ్మదాబాద్ లో 55 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతిచెందారని జయంతి వెల్లడించారు. రాష్ట్రంలో పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయినవారి సంఖ్య 74కు చేరిందని ఆమె పేర్కొన్నారు. ఈ రోజు నమోదైన కేసుల్లో అహ్మదాబాద్ నుంచే అత్యధికంగా 45 మంది వైరస్ బారిన పడ్డారని చెప్పారు. సూరత్ లో 9, భారుచ్ లో 8, నర్మదాలో 5 మంది బాధితులయ్యారని తెలిపారు. అలాగే బొతా లో 3, పంచమహాల్ 2.. ఆనంద్, చోటాదేవ పుర్, దాహెడ్, ఖేడా, మహిసాగర్ ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున కొత్త కేసులు నమోదైనట్లు వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన 1021 కేసుల్లో అత్యధికంగా ఐదు జిల్లాల నుంచే వచ్చాయని, అందులో అహ్మదాబాద్(590), వడోదర(137), సూరత్ (102), రాజ్ కోట్ (28), భావ్ నగర్(26) కేసులని పేర్కొన్నారు. . రైతులను ఆదుకుంటున్న ప్రధానమంత్రి ‘ కిసాన్ ‘ సమృద్ధి యోజన -కరోన వైరస్,లాక్ డౌన్ నేపధ్యంలో ముందస్తుగా రూ.2000 చెల్లింపులు – జూన్ నెల విడత ఇప్పుడే విడుదల. – నేరుగా రైతు ఖాతాలలో జమ చేస్తున్న కేంద్రప్రభుత్వం – తెలంగాణలో 34.7 లక్షల మందికి లబ్ది హైదరాబాద్,జ్యోతిన్యూస్ : కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి కింద ముందస్తుగా అందిస్తున్న రూ. 2000 ఆర్ధిక సహాయం ఈ సమయంలో ఆదుకుంటోంది. కుటుంబ కనీస అవసరాలకు ఆసరా అవుతోంది. గత మార్చి 24 నుండి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని వర్గాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు కూడా పనులకు వీలు లేకపోవడం, ఆర్ధిక కార్యకలపాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. వ్యవసాయ పనులు కూడా నిలిచిపోయాయి. రైతులతో పాటు, వ్యవసాయ కూలీలకు కూడా పనులు లేవు. ఫలితంగా కనీస అవసరాలు, ఖర్చులకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్తితుల్లో ఆయా వర్గాలకు ఉపశమమనం కల్పించాలనే ఉద్దేశముతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద వివిధ రూపాల్లో సహకారం ప్రకటించింది. ప్రభుత్వం వ్యవసాయరంగానికి ఊతంగా ఉండాలనే ఉ ద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి కింద యేడాదికు 6000 రూపాయలు మూడు విడతల్లో ఆర్ధిక సహకారం అందిస్తోంది. అయితే ఈ సారి మొదటి విడత కింద జూన్ మాసంలో ఇవ్వాల్సిన 2000 రూపాయల సహాయాన్ని కరోనా ప్రభావం కారణంగా ముందుగానే అందిస్తోంది. కానీ కరోన వైరుస్ వ్యాప్తి కట్టడి కోసం ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో అన్ని వర్గాల ఇబ్బందుల్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం రైతులకు సహకారం ఉంటుంది అనే ఉద్దేశంతో జూన్ నెలలో ఇవ్వాల్సిన తొలి విడత సహాయాన్ని ఏప్రిల్ నెలలోనే విడుదల చేసింది. అర్హులైన రైతులకు రూ. 2000 మొత్తాన్ని ఇప్పటికే వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. ఈ మే రకు తెలంగాణలో రైతులకు ఇప్పటికే సహాయం అందింది. తెలంగాణా రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ ఇప్పటికే ఆర్ధిక సహాయం అందింది. ఇలా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 34.70 లక్షల మంది రైతులకు రూ.2000 చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి. కష్ట కాలంలో ఆదరువు దొరికింది : లాక్ డౌన్ కాలంలో కొన్ని రోజులుగా ఎలాంటి పనులకు వెళ్లలేదు. జీవనభృతి కష్టమైన ఈ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి కింద రూ.2000 అందించింది. కుటుంబ రోజువారీ అవసరాలకు ఇది ఎంతో ఉ పయోగపడింది. ఆదరువుగా నిలిచింది – బ్రహ్మచారి, బీర్కూర్, కామారెడ్డి జిల్లా, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం రూ.2000 అందాయి. పంటలు చేతికి వచ్చే సమయంలో లాక్ డౌన్ కాలంలో పంటలు అమ్ముకోవడానికి ఇంకొన్ని రోజులు పడుతుంది. కుటుంబ పోషణ ఖర్చులకి కేంద్రం అందించిన మొత్తం ఎంతగానో ఉపయోగపడ్డాయి – వీరయ్య, వెంకటేశ్వర పల్లి, రేగొండ మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా.