కాల్ చేస్తే ఇంటికే ‘మెడిసిన్ ‘

  • వృద్ధులకు, వికలాంగులకు ఉచిత సేవలు
  • యూత్ ఫర్ యాంటీకరప్షన్ సంస్థ వినూత్న కార్యక్రమం

హైదరాబాద్, జ్యోతిన్యూస్ : కరోనా మనిషిని బయట అడుగు పెట్టనివ్వట్లేదు. యువకులు, మహిళలు, ఆరోగ్యంగా ఉన్నవారే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరీ నిత్యం మందులు వాడే పరిస్థితి ఏంటి. వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లలకు ఆసరా ఏది, వారి మందులు ఐపోతే తీసుకొచ్చి ఇచ్చేవారెవరు.. కరోనా భయమెమో కాని నిత్యం మందులు వాడే వారి పరిస్థితి మాత్రం రోజు రోజుకు ఇబ్బందికరంగా మారిపోతుంది. ఎన్నో సంస్థలు ఆహారం ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు కాని ఆనారోగ్యంతో ఉన్నవారికి మెడిసిన్ ఇచ్చే వారు కావాలి. ఒక్కరికి సహాయం చేసినా, ఒక్కరి ఆనందానికి తోడ్పడినా చాలంటూ ముందడుగు వేసింది యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ… కరోనా వైరస్ అరికట్టేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోను లాక్ డౌన్ నిర్వహించారు. తెలంగాణలోని ప్రజలను ప్రాణాలను కాపాడేందుకు పటిష్టమైన లాక్ డౌన్ కొనసాగుతోంది. సాధారణ ప్రజలే బయటికి వచ్చే సందర్భాలు లేవు. అలాంటి సమయంలో వారాల వారీగా, నెలల వారీగా, ప్రతిరోజు మందులు వాడే వృద్ధులు, వికలాంగులు, పిల్లల పరిస్థతి ఆగమ్యగోచరంగా మారిపోయింది. ప్రజల రక్షణ, ఆరోగ్యం కాపాడడం కోసం ప్రభుత్వాలు అడుగడుగునా తనిఖీలు చేపట్టింది. వృద్ధులు, వికలాంగులు బయటకు వెళ్లలేని పరిస్థితి. మందులు ఐపోయి సమయానికి వాడకుండా ఇబ్బందులు పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారికి మీకు మేమున్నామంటూ, వారికి సహయం చేసేందుకు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ముందడుగు వేసింది. గత పది సంవత్సరాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అవినీతి నిర్మూలన కోసం శాంతియుతంగా పనిచేస్తున్న వైఏసి సంస్థలో యాభై వేలకు మందికి పైగా సభ్యులు, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ సంధర్బంగా వినూత్న కార్యక్రమం చేయాలని హైదరాబాద్ నగరంలోని సంస్థ సభ్యులు వంద మంది యువకులు ప్రతిరోజు టూ వీలర్ వాహనాల ద్వారా వారికి ఉచితంగా డోర్ డెలివరీ చేస్తూ వారికి కావలసిన మందులను తెచ్చి ఇస్తూ మందులకు ఐనా బిల్లులను మాత్రమే తీసుకుంటున్నారు. ఫోన్ లేదా వాట్సప్ ద్వారా సమాచారం అందిస్తే ఇంటికే వెళ్లి మందులు ఇస్తున్నారు. ఈ సమయంలో యూత్ ఫర్ యాంటీ కరప్పన్ సంస్థ చేస్తున్న సేవలను పలువురు అభినందిస్తున్నారు. బయటికి వెళ్లలేని, ఓపికలేని వృద్ధులు, వికలాంగులను ఈ సమయంలో మెడిసిన్ అందిస్తూ అదుకోవాలనే ఆలోచన రావడం చాలా గొప్పపరిణామమని కొనియాడుతున్నారు. ప్రభుత్వాలు లాక్ డౌన్ ఎత్తివేసే వరకు మా సేవలు కొనసాగుతాయన్నారు. వ ఎద్దులకు, వికలాంగులకు, చిన్న పిల్లలకు మందులతో పాటు ఇతర వస్తువులకు అందించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని, కొంతమంది వృద్ధులకు ఆహారాన్ని కూడా అందిస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరంతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ కాల్ చేసిన స్పందిస్తూ సాధ్యమైనంత వరకు మెడిసిన్ ఇస్తూ సేవలందించనున్నామన్నారు. మరిచిపోలేని సంఘటనలు… – హైటెక్ సిటీలో సెంట్రల్ యూనివర్శిటీ ప్రొపెసర్ ఉంటారు. వాళ్ల అమ్మ బోడుప్పల్ లో ఉంటుంది. డయాబెటిస్ పెషెంట్. వాళ్ల అమ్మకు మెడిసిన్ పంపాలి ఎవరూ లేరు. పేస్ బుక్ లో మెడిసిన్ పంపాలని ఫోస్ట్ చేశారు. తెలిసిన వారు మా వైఏసీ ఇమేజ్ ను అతనికి ట్యాగ్ చేశారు. అతను కాల్ చేశారు. ఒక్క గంటలోనే చైన్ పద్ధతి ద్వారా హైటెక్ నుంచి పంజాగుట్ట, పంజాగుట్ట నుంచి రామంతాపూర్, రామంతాపూర్ నుంచి బోడుప్పల్ మెడిసిన్ ఇచ్చాం. వారు ఇరువురి ఆనందానికి అవధులు లేవు. వారు చూపిన కృతజ్ఞత జీవితంలో మరిచిపోలేనిది. – గల్ప్ నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ల ఫ్యామిలీ చిల్కూరు దేవాలయం సమీపంలో ఉంటారు. వాళ్లకు ఐదు సంవత్సరాల బాబు. అతనికి ఈఎనీ సమస్య. అర్జంట్ గా దానికి సంబంధించిన మెడిసిన్ కావాలి. అది జుబ్లిహిల్స్ చెక్ పోస్టు దగ్గర ఉంటాయి. వాటిని తీసుకొని వాళ్ల ఇంటికి వెళ్లి ఇచ్చి వచ్చాం. వాళ్లు చాలా సంతోషంగా ఫీల్ అవ్వడమే కాకుండా జీవితంలో మరిచిపోలేమన్నారు. మా సంస్థకు మరిచిపోలేని అనుభూతి. – ఒకరు రిటైర్డ్ కలెక్టర్. పెద్ద మనిషి అయ్యారు. అతనికి మెడిసిన్ కావాలి. బయటికి పోలేడు. అమెరికాలో ఉన్న వాళ్ల అమ్మాయికి కాల్ చేశాడు. వారు సామాజిక మాధ్యమాల్లో వెతికేసరికి వారికి వైఏసీ సంస్థ గురించి తెలిసింది. దాని గురించి తెలుసుకొని వాళ్ల నాన్నకు నంబర్ ఇచ్చింది. ఆ రిటైర్డ్ కలెక్టర్ కాల్ చేశారు. మేము వెళ్లి మెడిసిన్ ఇచ్చాం. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.