అమెరికాలో తుఫాను బీభత్సవం
ఉత్తర లూసియానాలో దెబ్బతిన్న 300లకు పైగా ఇళ్లు, భవనాలు
న్యూఢిల్లీ: కరోనా వైరతో బెంబేలెత్తిపోతున్న అమెరికాలో తుఫాను బీభత్సం సృష్టించింది. ఒకేసారి అధిక సంఖ్యలో టోర్నడోలు విరుచుకుపడటంతో ఉత్తర లూసియానాలో 300లకు పైగా ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలు దెబ్బతిన్నాయి. దక్షిణ మిస్సిసిపీ రాష్ట్రంలో ఆరుగురు మృతి చెందారు. ప్రధాన నగరాలైన వాల్తాల్ లో ఒకరు మరణించగా.. లారెన్స్ లో ఇద్దరు, జెపరెన్స్ దేవ్స్ లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. భారీ చెట్లు, ట్రక్కులు తుఫాను ధాటికి నేలకొరిగాయి. మంజీవిమానాశ్రయంలో టోర్నడో కారణంగా భవనాలు కూలీ రన్ వే పై శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. 30 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు. అలబామా, పశ్చిమ జార్జియా రాష్ట్రాలు, తూర్పు టెక్సాస్ నుంచి తూర్పు తీరం వరకు విస్తరించి ఉన్న ప్రాంతాలకు తుఫాను ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 3 వరకూ రైళ్లు, విమానాలు రద్దు ప్రకటించిన సంబంధిత మంత్రిత్వ శాఖలు న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభణ కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ మే 3 వరకూ లాక్ డౌనను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా దేశీయ, అంతర్జాతీయ విమానాలు, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు సంబంధిత మంత్రిత్వ శాఖలు ప్రకటించాయి. ‘కొవిడ్ 19 విజృంభణ కారణంగా విధించిన లాక్ డౌన్ నిబంధనల కొనసాగింపుగా అన్ని ప్యాసింజర్ రైళ్లను మే 3 అర్ధరాత్రి వరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం . వాటిలో ప్రీమియమ్, మెయిల్, ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్, కోల్ కతా మెట్రో, కొంకణ్ రైల్వే తదితర రైళ్లు ఉన్నాయి. నిత్యావసర వస్తువుల సరఫరా దృష్ట్యా కొన్ని గూడ్స్, పార్శిల్ రైళ్లకు మాత్రం అనుమతి ఉంది’ అని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అప్పటి వరకు టికెట్ బుకింగ్ కౌంటర్లు కూడా మూసివేసే ఉంటాయని , తెలిపింది. అలాగే లాక్ డౌన్ పై స్పందించిన విమానయాన మంత్రిత్వ శాఖ ట్విటర్ వేదికగా విమానాల రద్దుపై ప్రకటన చేసింది. ‘దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల పై ఉన్న నిషేధం మే 3 అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది’ అని ట్వీట్ చేసింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఈ ఉదయం ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పొడిగింపుకు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ, వైరస్ తీవ్రతను తగ్గించేందుకు పొడిగింపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.