సృష్టికి మూం శివం
భారతీయు అత్యంత భక్తిశ్రద్ధతో జరుపుకునే ఉత్సవాల్లో మహాశివరాత్రి ప్రముఖమైంది. ఏడాదిలో కెల్లా వచ్చే అత్యంత చీకటి రాత్రిని యోగ సంప్రదాయానికి మూమైన మొదటి గురువు శివుడి అనుగ్రహం పొందే రోజుగా భావిస్తారు. ఈ రాత్రి ఏర్పడే గ్రహ స్థితు వ్ల మానవ శరీర వ్యవస్థలో సహజంగానే శక్తి ఊర్ధ్వముఖంగా కదుతుంది. ఈ నాటి రాత్రి వెన్నుముక నిటారుగా ఉంచి, జాగరణ చేయడం మన భౌతిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకి ఎంతగానో తోడ్పడుతుంది. భారతీయ సంస్క ృతిలో ఏడాదికి 365 పండుగు అంటారు. ఎందుకంటే ఒకప్పుడు భారతీయ సంస్క ృతిలో సంవత్సరానికి 365 పండుగు ఉండేవి. ఈ 365 పండుగు వేర్వేరు ప్రయోజనా కోసం సూచించబడ్డాయి. వివిధ చారిత్రక సంఘటను, విజయాకు సూచనగా లేదా విత్తనాు నాటడం ఇంకా పంటకోత లాంటి కొన్ని సందర్భాను వేడుకగా జరుపుకునేవారు. ప్రతీ సందర్భానికి ఒక పండుగ ఉండేది. కానీ మహాశివరాత్రికి మాత్రం ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. చాంద్రమానం ప్రకారం మాసంలోని 14వ రోజు లేదా అమావాస్యకు ముందు రోజుని శివరాత్రి అంటారు. పంచాంగంలో వచ్చే పన్నెండు శివరాత్రులో ఫిబ్రవరి, మార్చి నెలో వచ్చేదానికి ఆధ్యాత్మికంగా ప్రాధాన్యం ఉంది. ఈ రోజు రాత్రి భూమి ఉత్తరార్ధగోళం మనిషిలోని శక్తి సహజంగానే ఉప్పొంగే స్థితిలో ఉంటుంది. మనిషిని ప్రకృతి ఆధ్యాత్మిక శిఖరానికి తీసుకెళతుంది. కాబట్టి దీనిని ఉపయోగించుకోవడానికే భారతీయ సంస్కృతిలో రాత్రంతా జరిపే ఈ పండుగను నెకొల్పారు. త్లెవార్లూ జాగారం చేసి వెన్నెముకను నిటారుగా ఉంచడం ద్వారా శక్తు సహజంగా పైకి రావడానికి సహకరిస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంతో ప్రముఖమైంది. కుటుంబ బంధాలో ఉన్నవారికి, ప్రపంచంలో గాఢమైన ఆకాంక్ష ఉన్నవారికి కూడా మహాశివరాత్రి ఎంతో ఆవశ్యకం. గృహస్థు, కుటుంబ పరిస్థితుల్లో నివసించేవారు మహాశివరాత్రిని శివుడి పెళ్లిరోజుగా చూస్తారు. ప్రాపంచిక క్ష్యాతో ఉన్నవారును శివుడు తన శత్రువుందరినీ జయించిన రోజుగా చూస్తారు.సన్యాసుకు మాత్రం ఈ రోజు కైలాస పర్వతంతో పరమేశ్వరుడు ఒకటయిన రోజు. పురాణాను పక్కనబెడితే ఆధ్యాత్మిక సాధకునికి మహాశివరాత్రి రోజు రాత్రికి కల్పించే అవకాశా వ్ల యోగ సాంప్రదాయంలో ఇంత ప్రాముఖ్యత వచ్చింది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎన్నో అధ్యయనా తరువాత… మీకు జీవంగా తెలిసిన ప్రతీదీ, మీకు తెలిసిన ప్రతీ పదార్థం ఇంకా ఉనికి, మీకు తెలిసిన జగత్తు ఇంకా పాపుంతు, ఇవన్నీ కూడా కేవం ఒకే శక్తి వివిధ క్ష రూపా వ్యక్తీకరణ అని నిరూపిస్తున్నారు.
వేదాు.. ఇతిహాసాు, పురాణాలో ముఖ్యమైనవి. వీటిలో ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులోని రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరీలోని శివ అనే రెండక్షరాు మరీ గొప్పవి. శివ అంటే మంగళకరమని అర్థం. శివస్వరూపం అత్యంత మంగళకరమైనది. ఆ పరమ శివుని అనుగ్రహం కోసం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహా శివరాత్రి. పురాణాలో తెలియజేసిన మహా శివరాత్రిని ఏటా మాఘమాసం కృష్ణపక్ష చతుర్థశినాడు జరుపుకుంటాం.
‘శివ ఏవ కేవః’ సృష్టికి ముందు నిరాకారము, నిర్గుణము, నామరూప రహితము అగు ‘సత్’ పదార్థమొక్కటి ఉన్నదని, అది శివుడని తొపుతున్నాయి- వేద మంత్రము. స ృష్టి, స్థితి, యమునే ధర్మము వన ఆయనకు బ్రహ్మ, విష్ణు, శివ అనే నామము ఏర్పడ్డాయి. శివునికి ఉన్న నామ రూపాలో ఒకానొక ప్రత్యేకత, విశిష్టత ఉంది. పరమ శివుని రూపము రెండు. ఒకటి పురుష రూపం, రెండవది ‘లింగ’ రూపం. ‘శమయతీతి శివః’ అందరినీ బ్రహ్మానందంలో శమింపచేసేవాడు, శివుడు. ‘శీతే సజ్జన మనస్సు ఇతి శివః’ – సజ్జను మనస్సులో శయనించి ఉండేవాడు, శివుడు. ‘శివం వేదః తద్యోగాత్’ శివమంటే వేదము. ఓం శ్శాంతి శ్శాంతి శ్శాంతిః అని ప్రపంచానికి శాంతి మార్గాన్ని దర్శింపజేసి, శాంతింపజేసే వేదము – శివమవుతుంది. దాని యోగము గవాడు శివుడు. శివప్రదత్వాత్ శివః మంగళమును, శుభమును ఇచ్చేవాడు – శివుడు. ఇలా అనేక వ్యుత్పత్యర్థాు ఉన్నాయి. ముఖ్యమయినది మరోటుంది. ‘శం నిత్య సుఖమానంద మికారః, పురుషః స్మ ృతః వకారః శక్తిరమ ృతా మేళనం శివ ఉచ్యతేః’ అన్నది శివపురాణమే. ‘శం’ అంటే నిత్య సుఖము, ఆనందము. ‘ఇ’ కారం – పరమ పురుషుడు. ‘వ’కారం అమ ృత స్వరూపిణి అయిన శక్తి. ఈ ముగ్గురి కయికయే ‘శివం’ అవుతుంది. ఆనందమయమైన శివశక్తి సంయోగమే శివ శబ్దార్థం. పరమశివుని కంఠం నుండి బయల్వెడిలింది ఓంకారము. దాన్ని విడదీస్తే ‘అ ఉమ్’ అయింది. ‘అ’ను ‘మ్’ ప్రక్కన చేరుస్తే ‘ఉమ’ అయింది. ఉమ అంటే బ్రహ్మ విద్య. ఓంకారం బ్రహ్మవిద్య. అందుకే ‘ఉమ’ను పరమశివుడు ఎప్పుడూ తన దేహార్ధ భాగంలో ఉంచుకొంటాడు. వేదమాత శివునికి అర్ధాంగిగా ఉంటుంది. వారి భార్యాభర్త ృ సంబంధము నిత్యము, శాశ్వతము. దీనిననుసరించే భారతీయ వివాహ వ్యవస్థ స్థాపించబడిరది. పార్వతీ పరమేశ్వయి సనాతన దంపతు, ఆదిదంపతు. ‘సనాతన’ అంటే ఎ్లప్పుడూ, నిత్యనూతనం అని అర్థం. కాళిదాస మహాకవి తన రఘువంశ, కుమార సంభవమునెడి కావ్యము ద్వారా భారతీయ దాంపత్య వ్యవస్థను పార్వతీపరమేశ్వరు ద్వారా చెప్పాడు.
వాగర్థా వివసంపృక్తౌ, వాగర్థ ప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ – పార్వతీ పరమేశ్వయి వాగర్ధములాగా శాశ్వత సంబంధం కవాళ్లు. సప్త మహర్షు హిమవంతుని దగ్గరకు, పరమశివుని తరఫున రాయబారంగా వెళ్లి, ‘తమర్థ మివ భారత్యాసుత యోక్తు మర్హసి’ వేద వాక్కుతో పరమార్థము జత చేసినట్లు, యోగము చేసినట్లు, నీ కూతురైన పార్వతితో, శివుని యోగము చేయమన్నారు. అందుకే, శివరాత్రి రోజున లింగానికి రుద్రాభిషేకం జరుగుతూ ఉంటే, ఇటు పార్వతీ పరమేశ్వరుకు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇదే మహా శివరాత్రి మహోత్సవమంటే.
వ్యక్తమంటే కనిపించేది. ఆ వ్యక్తమంతా ఉమాస్వరూపం. కనిపించనిదంతా – అవ్యక్తం. ఆ అవ్యక్తం – శివస్వరూపం. ‘వ్యక్తావ్యక్త స్వరూపిణి’ అర్ధనారీశ్వర తత్త్వం. ఉమాశంకరు యోగమునకు విష్ణువని పేరున్నదని రుద్ర హృదయోపనిషత్ చెబుతోంది.
బాగా వికసించిన పుష్పముగ వృక్షము నుండి చాలా దూరము వరకు సుగంధ పరిమళము వ్యాపిస్తుంది. పుణ్యకర్ము చేసేవాడి నుంచి మంచి సుగంధము వస్తుంది. పరమశివుడు అనే తీగకు వేద రూప పుష్పము పూయటం వన, ఆ తీగె నుండి మంచి విద్యాగంధము వీస్తుందిట. ఆ గంధము ప్రజకు పుష్టిని, వ ృద్ధిని సమకూరుస్తుంది. ఇహపరము నిస్తుంది. అందుకే శివుణ్ణి ‘సుగంధి’ అని వేదము వర్ణించింది. ‘త్య్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనమ్ ఉర్వారుకమివ బంధనా న్మ ృత్యోర్ముక్షేయ మామృతాత్’ – ‘యజుర్వేదం త్రినేత్రుడు, పరిమళమును వెదజ్లువాడు, మంచి పుష్టిని చేకూర్చువాడు అయిన రుద్రుణ్ణి మేము ఆరాధించుచున్నాము. దోసపండును తొడిమ నుండి వేరు చేసినట్లు ఆ రుద్రుడు, మమ్మల్ని మ ృత్యువు నుండి వేరుచేసి, కాపాడి అమ ృతత్త్వాన్ని చేకూర్చుగాక’ అని అంటూ, మహాశివునికి లింగోద్భవకాంలో పరమశివుడికి అభిషేకం చేస్తున్నాం. ప్రతిమాసంలోనూ అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. మాఘ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రి అని పిుస్తారు. ‘శివరాత్రి’ అనే పదానికి, శుభప్రదమైన, మంగళకరమైన రాత్రి అని అర్థం. రాత్రి ‘చీకటి’ కదా.. అజ్ఞానానికి సంకేతం. ఇది మంగళకరమైన రాత్రి ఎలా అవుతుంది? శివరాత్రి నాడు ఉపవాసము, జాగరణ, లింగోద్భవ కా జ్ఞాన జ్యోతి దర్శనం, బిళ్వార్చన, నామసంకీర్తన, శివపార్వతు కళ్యాణం వ్ల అజ్ఞానం అనే చీకటి తొగింపబడుతుంది. శివారాధన వన ఆత్మజ్ఞానం కుగుతుంది. ‘చంద్రమా మననో జాతః’ మనస్సుకి అధిదేవత చంద్రుడు. చంద్రుని కళు క ృష్ణ పక్షంలో దినదినం క్షీణించి, చతుర్దశి నాడు కేవం ఒక కళే ఉంటుంది. అలాగే. మనసుకు చేరిన 16 మాలిన్యము (అష్టమదము, అరిషడ్వర్గము, మనస్సు అహంకారం) ఒక్కటే శేషించి ఉంటుంది. ఆ మాలిన్యాన్ని దూరం చేసేది – శివపూజ, శివాభిషేకం, శివనామ సంకీర్తనం.
ఇక్కడే మనం మార్కండేయుడి కథను, ఆధ్యాత్మికతను జ్ఞప్తి చేసుకోవాలి. ‘మనుష్యాణాం సహస్రేషు’ అన్నట్టు, కోటికొకడుంటాడు. పట్టుదగ సాహసికుడు, సాధకుడు. పట్టుదుంటే చాదు, పట్టుకోవటానికొక ఆంబనముండాలి. అదే శివాకార వ ృత్తి. ‘లీనంగమయ తేతి లింగం’ అఖండమైన జ్ఞానం. మార్కండేయుడు శివలింగాన్ని వాటేసుకొన్నాడంటే ఏమిటి అర్థం? 16 ఏళ్ల వయసుకే మ ృకండ మహర్షి కుమారుడైన మార్కండేయుడు కాధర్మం చెందవసి ఉంది. దీనికి ప్రతీకారం చేయాని శివలింగాన్ని పట్టుకున్నాడు. యముడు వచ్చి కాపాశం వేశాడు. కానీ, శివలింగం వాటేసుకున్నాడు కాబట్టి శివుడు ప్రత్యక్షమైనాడు, కాుణ్ణి పంపించి, అజరామరుణ్ణి చేశాడు మార్కండేయుణ్ణి. పదహారేళ్లవోకావు – షోడశ కళాత్మకమీ ప్రపంచం. కాం వ్లనే దానితో సంబంధం. అది కాంతోటే తిరుగుతుంది. అదే మ ృత్యువు. అదే కాపాశం. కామనే పాశం. దాన్ని జయించే మార్గం – శివాకార వృత్తి. మృత్యుభయం లేదు. మానవుడికి, అమ ృతత్త్వాన్నే ప్రసాదిస్తుంది. అసు అమృతమనేది ఎక్కడుంది? అది సంసారంలోనే ఉంది. విషం లాంటి మ ృత్యువూ ఉంది. మన జీవిత సాగరాన్ని మధించాలి, అపుడు రెండూ దర్శనమిస్తాయి. హాలాహం లాంటి కాలాన్ని కబళించి, కాలాతీతమైన శివతత్త్వమే నా స్వరూపమని గుర్తు చేసికొంటే అమ ృతత్వం భిస్తుంది. త్యాగగుణం అవడుతుంది. త్యాగం – నిశ్చ నిర్మ మనస్సునిస్తుంది. ‘త్యాగేనైకే అమ ృతత్త్వ మనసుః’ అన్నది శ్రుతి. దీన్నే బోధిస్తుంది మహాశివరాత్రి.
శివుణ్ణి సాకారంగా అనగా మూర్తమైన విగ్రహంగా తీసికొంటే- ఆయన భస్మానులేపనం, పృథివికి, గంగాజటాజూటం – జలానికి, ఫానేత్రం – అగ్నికి, నాగభూషణత్వం వాయువుకి, దిగంబరత్వం ఆకాశానికి సంకేతమైతే, చంద్ర శేఖరత్వం మనస్సుకి, వ ృషభ వాహనం బుద్ధికి, గజచర్మ ధారణం అహంకారానికి, త్రిశూ ధారణం – త్రిగుణాు తన కధీనమై ఉన్నాయని, త్రిగుణాతీతుడని వివరిస్తాయి. అమ్మవారు శరీరాన్నే పంచుకొని ఉందంటే ఏమిటి అర్థం? చిద్రూపం శివ తత్త్వమైతే, సద్రూదం శక్తితత్త్వం. సచ్చిత్తు అవినాభూతమయినవని చెప్పేది అర్ధనారీశ్వర తత్త్వం. ‘సత్యజ్ఞానానంద రూపా సామరస్య పరాయణా’ అన్నారు. మాఘ మాసంలో చతుర్దశి అర్ధరాత్రి లింగోద్భవ కాం. ఈ రోజు శివుడు తేజోమయంతో లింగాకారం నుండి ఆవిర్భవించాడు. ‘అధ్యవోచ దధివక్తా ప్రథమోదైవ్యోభిషక్, అహేగ్‌ంశ్చ సర్వాజ్ఞమ్భయస్థ్య ర్వాశ్చయాతు ధాన్యః’ దేవతకు ప్రప్రథమ వైద్యుడు రుద్రుడు. అందు శివునికి అభిషేకం చేస్తే సర్వరోగము నశిస్తాయి. ఆయన గొప్ప శస్త్ర చికిత్సా నిపుణుడు. మనిషికి ఏనుగు తను పెట్టినవాడు. అందుకే వైద్యు లోప శస్త్ర చికిత్స చేస్తుంటే జయప్రదంగా జరిగి, స్వస్థత చేకూరాని, మానసికంగా రుద్రనమకాన్ని ముఖ్యంగా ఈ మంత్రాన్ని ‘అఘారేభ్యో…’ అనే మంత్రాన్ని పఠించి, దైవ బలాన్ని కూడా అర్థిస్తారు. ఈశ్వరునికి వాహనము నంది. ఈశ్వర తత్త్వానికి లింగము ఎలా గుర్తో, జీవతత్త్వానికి ‘నంది’ అలా గుర్తు. జీవతత్త్వములోని పశుతత్త్వం. పశుతత్త్వముతో కూడిన ఈ జీవతత్త్వము ప్రక ృతి వైపున తన ద ృష్టిని తిప్పకుండా ఈశ్వరుని వైపు తిప్పటం చేత భగవంతునితో సన్నిహిత సంబంధాన్ని పొందుతుంది. నందిని, ఈశ్వరుడిని రెండుగా విభజించి చూస్తారు. నందికి ఈశ్వరునికి ఎవరూ అడ్డు తగకూడదు. అంటే జీవునికి, పరమాత్మకు అడ్డం ఉండకూడదు. నంది ధర్మానికి ప్రతీక. జీవుడు నంది శ ృంగము మధ్య నుంచి లోపున్న పరమాత్మను దర్శిస్తాడు. తనలో ఉన్న పశుతత్త్వాన్ని అణచివేసుకొని, ధర్మంతో అర్థ, కామాల్ని అనుభవిస్తే జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని పొందుతాడు. అప్పుడు నంది, ఈశ్వరుడు అని రెండుగా ఉండవు. ‘నందీశ్వర’ అని రెండూ ఏకమై పోయినాయి. అప్పుడు అన్నీ ఒకే తత్త్వంగా భాసిస్తాయి. ఇదే శివరాత్రి మనకు అందించే ఆధ్యాత్మికత. బిళ్వార్చన విశిష్టతను, ఆంతర్యాన్ని తొసుకుంటే ఎన్నో విషయాు మనకు బోధపడతాయ. బ్విపత్రం మూడు దళముతో కూడి ఉంటుంది. మానవును ప్రభావితం చేసే త్రిగుణముకు, త్రికాముకు, త్రితాపముకు ప్రతీక ఈ పత్రం. ఈ శరీరమే బ్విదళం. త్రిగుణము ఏకత్వమును సాధించినప్పుడే భగవంతుని అర్పణకు అర్హతను పొందుతుంది. ఆ ఏకత్వమును సూచిస్తుంది బ్విదళార్చన. తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం దగ్గరలో ఉన్న చిన్న శివాయంలో గ్రహణ సమయంలో ఒక దేవతా సర్పం ఆయంలోని బ్వి వృక్షం మీదకు ప్రాకి బ్విదళాల్ని తుంచి, సోమ సూత్రం గుండా శివాయంలోకి ప్రవేశించి శివలింగం మీద దళాన్ని ఉంచి, లింగాన్ని చుట్టుకొని, గ్రహణ సమయమంతా లింగం దగ్గరే ఉండి, గ్రహణం విడిచిన తరువాత, అదే సోమసూత్రం ద్వారా బయటకు వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వార్త, ఫొటోు కూడా పత్రికలో వచ్చినాయి. ఇది బ్విపత్రార్చన విశేషం.
మనలోని కామ పిశాచాన్ని, పశు రాక్షస తత్త్వాన్ని, దహింప చేసికోవాలి. పాశుపతమైన ఈ దీక్ష మనకుంటే, పశుపతి అనుగ్రహం మనకు భిస్తుంది. తిరోధన అనుగ్రహాు రెండూ పరమ శివుని చేతిలో ఉంటాయి. తిరోధానంతో శివుడే జీవుడయ్యాడు. అనుగ్రహంతో మరలా జీవుడైన తానే శివుడే భాసించాడు. ఇదే మహా శివరాత్రినాడు మనం తెలిసికోవసిన శివలీలా వైభవం. నాదతనుమ నిశం- శంకరం, నమామియే మనసా శిరసా అని చిత్తరంజని రాగంలో త్యాగరాజ స్వామి కీర్తించిన కృతి, మహాశివరాత్రికి సంపూర్ణ స్ఫూర్తిని, దీప్తిని ఇస్తుంది. ఈ శివ్వం పంచభూతమయం. పంచభూతమునగా – ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి. శివునికి భూతపడి అనే నామము ఉంది. అందుకే ‘ఈవావాస్య మిదం సర్వం’ అన్నది శ్రుతి. పంచభూత రూపుడను నేనే అని తెలియజేయటానికి పరమ శివుడు దక్షిణ భారతదేశంలో ఐదు క్షేత్రముందు ఆవిర్భవించి భక్తు కోర్కొ తీరుస్తున్నాడు. అవి, చిదంబరంలోని ఆకాశలింగం, శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగము, అరుణాచములో తేజో (అగ్ని), లింగము, జంబుకేశ్వరములో జలింగము, కాంచీ క్షేత్రములో పృధివ లింగ రూపము. ఇవే పంచభూత లింగ క్షేత్రము.