సొంతింటినుంచే మొదలు..!
పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలు విషజ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సర్కారు చర్యలు చేపట్టింది. పారిశుధ్య నిర్వహణా లోపాన్ని సరిచేస్తే వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులు విజంభించకుండా తీసుకోవాల్సిన చర్యలపై వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, జీహెచ్‌ఎంసీ అధికారులతో కేటీఆర్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సొంత ఇళ్లలో పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు. దానిలో భాగంగా తన నివాస గహం ప్రగతి భవన్‌లో మంగళవారం పారిశుధ్య నిర్వహణపై దష్టిసారించారు.
తన ఇంటిని కేటీఆర్ స్వయంగా క్లీన్ చేశారు. దోమల మందును చల్లారు. నీటి తొట్లలో నూనె వేశారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు సొంత ఇంటి పారిశుధ్య నిర్వహణ డ్రైవ్‌లో పాల్గొనాలని కోరారు. ప్రతి ఒక్కరు తమ సొంత ఇంటిలోపల.. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కేటీఆర్ వెంబడి నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు శాసన సభలో ప్రభుత్వ విప్ బాల్కసుమన్ కూడా ఉన్నారు. మంత్రి ఇచ్చిన పిలుపుమేరకు తాము కూడా సొంత ఇంటి పారిశుధ్య నిర్వహణకు అవసరమైన చర్యలు చేపడతామని కేటీఆర్‌తో చెప్పారు. ప్రజలకు కేటీఆర్ చేసిన సూచనలు.. ‘ఇంటి లోపల పేరుకుపోయిన, వినియోగంలో లేని వస్తువులను తొలగించాలి. ఇళ్లలో నీటి తొట్లు, పూలమొక్కలు ఉన్న చోట్లలో నీరు నిలువకుండా చూడాలి. ప్రజల భాగస్వామ్యంతోనే సీజనల్ వ్యాధుల నివారణ సులభమవుతుంది. జన సమ్మర్థ ప్రదేశాలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీ తరపున దోమల నివారణతో పాటు పరిశుభ్రత నిర్వహణకై అన్ని చర్యలు చేపడుతున్నాం’ అని కేటీఆర్ ఓ ప్రకటనలో అన్నారు.
సీజనల్ వ్యాధుల నివారణ ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. బహిరంగ ప్రదేశాలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీ తరుపున దోమల నివారణతో పాటు పరిశుభ్రత నిర్వహణ చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ సొంత ఇళ్లలో పారిశుద్ధ్య నిర్వహణ పైన ద ష్టి సారించి ప్రభుత్వ ప్రయత్నాలతో కలిసి రావాలన్నారు. ముఖ్యంగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు సొంత ఇళ్లలోని పారిశుద్యం అత్యంత కీలకమైన అంశం అన్నారు. నిన్న జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో సీజనల్ వ్యాధుల పైన వైద్య శాఖ మంత్రి, వైద్య శాఖ అధికారులు, పురపాలక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం సొంత ఇళ్ళలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ తెలిపారు.
ఈ మేరకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజలను చైతన్యవంతం చేసి పారిశుద్ద్యం నిర్వహణలో వారిని భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వ అధికారులు, పురపాలక ప్రతినిధులు తమ సొంత ఇళ్ళలోని పారిశుధ్య నిర్వహణ చేపట్టి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ తన నివాస గ హం ప్రగతి భవన్ లోని పారిశుద్ధ్య నిర్వహణ పైన ద ష్టిసారించారు. ముఖ్యంగా దోమల వ ద్ధికి అవకాశం ఉన్న ఉన్న నీటి తొట్లు, నీటి నిలువ ప్రదేశాల్లో నీటిని తొలగించే చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు ఇంటి మూలల్లో ఉన్న ఉపయోగంలో లేని వస్తువులను తీసివేసి దోమల లార్వా వ ద్ధికి అవకాశం లేకుండా చేసే చర్యలను చేపట్టారు. ఈ మేరకు ప్రగతి భవన్ లోని నీటి తొట్లలో ఆయన నూనె వేశారు.
ప్రతి ఒక్కరూ స్వంత ఇంటి పారిశుద్ధ్య నిర్వహణ పైన పైన దష్టి సారించి సీజనల్ వ్యాధుల బారి నుంచి కాపాడుకునే ప్రయత్నం ప్రారంభించాలని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఇళ్ళ ముందు కానీ లేదా ఇంటి లోపల నీటి నిలువ ఉండే ప్రాంతాల్లో నీటిని తొలగించే ప్రయత్నం చేయడం లేదా వాటిపైన నూనెను చల్లడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. దీంతోపాటు ఇళ్లలో ఉన్న పనికిరాని లేదా ఉపయోగం లేని లేని వస్తువులను తొలగించుకోవాలని కోరారు. కేటీఆర్ వెంబడి నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు శాసన సభ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కూడా ఉన్నారు. మంత్రి ఇచ్చిన పిలుపు మేరకు తాము కూడా సొంత ఇంటి పారిశుద్ధ్య నిర్వహణ పైన అవసరమైన చర్యలు చేపడతామని వారిరువురు మంత్రి కేటీఆర్ కు తెలిపారు.