Post Views: 1,050
- ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం
- డ్రగ్స్ మాఫియాకు కేంద్రంగా మారిన ఏపీ
- విచ్చలవిడిగా నకిలీ మద్యం అమ్మకాలు
- రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు
- రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి
- ఏపీ• డిజిపిని రీకాల్ చేయాలి
- రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించిన చంద్రబాబు
- టిడిపి నేతలతో కలసి కోవింద్‌ను కలసిన బృందం
న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్ :
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం కొనసాగుతోందని.. దీనిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశామని టిడిపి అధినేత చంద్రబాబు తెలిపారు. ఎపిలో రాష్ట్రపతి పాలన విధించాలని, డిజిపిని రీకాల్ చేయాలని కూడా కోరామన్నారు. పార్టీ నేతలతో కలిసి దిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. వినతిపత్రం సమర్పించిన ఇటీవలి ఘటనలు వివరించారు. పలు అంశాలను ఆయన ముందు ప్రస్తావించారు. అనంతరం ఆయన వి•డియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ గంజాయి, డ్రగ్స్ పట్టుకున్నా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయని ఆయా రాష్టాల్ర పోలీసులు చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు.దేశం, అంతర్జాతీయంగా ఎక్కడా లేని లిక్కర్ బ్రాండ్లు ఏపీలో ఉంటున్నా యని చంద్రబాబు ఆక్షేపించారు. మద్యపాన నిషేధం పేరుతో భారీగా రేట్లు పెంచారని.. మాఫియాగా ఏర్పడి సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారని పరోక్షంగా వైకాపా నేతలను ఉద్దేశించి ఆరోపించారు. ’డ్రగ్స్ ఫ్రీ ఏపీ’ కోసం తెదేపా పోరాడుతోందన్నారు. డ్రగ్స్‌తో యువత.. తద్వారా జాతి నిర్వీర్యమవుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ పరిస్థితిని నియంత్రించాలని కోరితే ఒకే రోజు తెదేపా కార్యాలయాలపై దాడి చేశారని ఆరోపించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంపై దాడి చేయడం చరిత్రలోనే మొదటిసారని.. ఇది కచ్చితంగా ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమేనన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్లుగా రాష్ట్రంలో ఉన్మాది పాలన కొనసాగుతోందని చంద్రబాబు మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. వి•డియానూ నియంత్రిస్తున్నారు. తెదేపా నేతలపై ఇష్టానుసారంగా దాడులు చేయడమే కాకుండా అక్రమంగా కేసులు పెట్టి, అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్లు తిప్పుతున్నారు. పోలీసులు గూండాల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. కస్టడీలో టార్చర్ పెడుతున్నారు. తెదేపా నేతలను ఆర్థికంగా, శారీరకంగా హింసలు పెడుతున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతుంటే మా కార్యాలయంపై దాడి చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ, అడిగే హక్కు లేదని.. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వాళ్లే దాడి చేసి ప్రజలపై కేసులు పెడుతున్నారని.. రాష్టాన్న్రి భయానకంగా మార్చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రపతికి అవన్నీ వివరించామన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో ఆర్టికల్ 356ను ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని రామ్‌నాథ్ కోవింద్‌ను కోరినట్లు చంద్రబాబు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ మాఫియా దేశ సమగ్రతకు ముప్పుగా తయారయ్యే పరిస్థితి ఉందని.. దీన్ని నియంత్రించాలని రాష్ట్రపతిని కోరామన్నారు. తెదేపా కార్యాలయంపై దాడి ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. దీనిపై విచారణ జరిపి వాస్తవాలు వెలికితీయాలని కోరామన్నారు. సీఎంతో కలిసి పోలీసు వ్యవస్థని డీజీపీ భ్రష్టు పట్టించారని చంద్రబాబు ఆరోపించారు. డీజీపీని రీకాల్ చేయాలని.. ఆయన చేసిన తప్పులకు శిక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా తెదేపా పోరాటం కొనసాగిస్తుందన్నారు. న్యాయం జరిగే వరకు వదిలిపెట్టమని.. దోషులను కఠినంగా శిక్షించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు బృందం సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి ఆంధప్రదశ్లో పరిస్థితిపై వివరించారు. టీడీపీ ఫిర్యాదుపై రామ్‌నాథ్ కోవింద్ సానుకూలంగా స్పందించారు. ఏపీలో పరిస్థితిపై వాకబు చేస్తామన్నారు. టీడీపీ నేతలు చెప్పినవన్నీ చాలా సీరియస్ అంశాలని అన్నారు. వీటన్నింటినీ పరిశీలనకు తీసుకుంటామన్నారు. అమరావతి రాజధాని ఏమైందని టీడీపీ బృందాన్ని రాష్ట్రపతి ప్రశ్నించారు. అమరావతిని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేశారని చంద్రబాబు వివరించారు. అలాగే రాష్ట్రపతికి రాజమండ్రి శిరోముండనం కేసు విషయం వివరించారు. ’వి•రు ఆదేశించినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని’ రాష్ట్రపతికి టీడీపీ బృందం తెలిపింది.ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామన్నారు. నాలుగు ప్రధాన డిమాండ్లతో రాష్ట్రపతిని కలిశామన్నారు. ఏపీలో ఆర్టికల్ 356ను అమలు చేయాలని, దాడుల ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని, ఏపీలో గంజాయి, హెరాయిన్లపై చర్యలు తీసుకోవాలని, డీజీపీని రీకాల్ చేయాలని, చేసిన తప్పులకు శిక్షపడాలని కోరినట్లు చెప్పారు. 8 పేజీల లేఖను ఆధారాలతో సహా రాష్ట్రపతికి అందజేశామని అన్నారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారన్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆఫీసులు, నేతలపై దాడులు చేశారని, డీజీపీ, పోలీసులకు ఫోన్లు చేస్తే స్పందించరని మండిపడ్డారు. ఘటనాస్థలికి తాను వెళ్లేసరికి దాడి చేసినవారిని పోలీసులే పంపిస్తున్నారని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమేనన్నారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా ఏపీలో మూలాలున్నాయని ఆరోపించారు. ఏపీలో 23వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, సహజవనరులను ఎక్కడికక్కడ దోచుకుంటు న్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్‌పై దాడులు చేసి ఇంటికి పంపించే వరకు ఊరుకోలే దన్నారు. రాష్ట్రంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయన్నారు. తమపై దాడులు చేసి..తిరిగి మాపైనే కేసులు పెడుతున్నా రన్నారు. టీడీపీ నేతలను అక్రమ కేసులతో వేధిస్తున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండేళ్లుగా జగన్‌రెడ్డి చేస్తున్న పరిపాలనపై బుక్ రూపొందించిన టీడీపీ.. ’స్టేట్ స్పాన్సర్డ్ టెర్రర్’ అనే పుస్తకాన్ని విడుదల చేసింది.ఏపీలో మద్యపాన నిషేధమని చెప్పి జగన్‌రెడ్డి సొంత వ్యాపారం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం మాఫియా నడుస్తోందని ఆరోపించారు.డ్రగ్స్‌తో యువత నిర్వీర్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కంట్రోల్ చేయమని అడిగితే ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. జగన్ గత రెండేళ్లుగా రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.రాష్ట్రంలో అన్ని రాజ్యాం గ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయన్నారు. వైసీపీ శ్రేణులు హైకోర్టు జడ్జిలపై కామెంట్లు చేస్తూ పోస్టులు పెడు తున్నారన్నారు.చివరికి పార్లమెంట్సభ్యుడిపై కూడా పోలీసులు చేయి చేసుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.చంద్ర బాబు వెంట ఎంపిలు కేశినేని నాని, రామ్మోమన్ నాయుడు, పయ్యవుల కేశవ్,అచ్చన్నాయుడు తదితరులు ఉన్నారు.