చర్యలు తీసుకోండి…

  • ప్రజాస్వామ్య దేవాలయంపై దాడులా
  • మూకదాడి పోలీసులకు తెలిసే జరగడం దారుణం
  • ప్రజాస్వామ్యంలో ఇంతటి దారుణాన్ని ఎప్పుడూ చూడలేదు
  • దాడి చేసిన వారితోనే ఎదురు కేసులు పెట్టించడం మరీ దారుణం
  • ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసే కంకణం కట్టుకున్నారు
  • దాడులపై డిజిపిని ముందే హెచ్చరించినా పట్టించుకోలేదు
  • 36 గంటల దీక్షలో ఉద్వేగపూరితంగా ప్రసంగించిన చంద్రబాబు

అమరావతి,జ్యోతిన్యూస్‌ :
‌టీడీపీ పార్టీ ఆఫీస్‌, ‌నాయకులపై దాడిచేసిన వారిని పోలీసులు దగ్గర ఉండి సాగనంపటం సిగ్గుచేటని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపైనే దాడికి దిగి, తమపైనే కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది ప్రపంచంలో వింతగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇంతటి దారుణాన్ని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. టిడిపి కార్యాలయాలపై దాడికి నిరసనగా చేపట్టిన దీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాష్ట్రపతి పాలన కోరలేదన్నారు. కానీ ఇవాళ ప్రజల దేవాలయాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు,పార్టీ కార్యాలయాలపై వరుస దాడులు జరుగుతున్నందుకే రాష్ట్రపతి పాలన కోరామని వివరించారు. పార్టీ ఆఫీసులోకి చొరబడిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే ఎదురు కేసులు పెట్టించటం సిగ్గుచేటని మండి పడ్డారు. దాడి చేసిన వారితో ఎదురు కేసులు పెట్టించిన డీజీపీకి హ్యాట్సాఫ్‌ ‌చెప్పాలా అని అన్నారు. చేతకాకుంటే పోలీసు వ్యవస్థను మూసేయండని హితవుపలికారు. ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ నేతలు వాడిన భాషపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్‌ ‌విసిరారు. ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసేందుకే ముందుకు పోతున్నార న్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ ‌భవన్‌ ‌లో 36గంటల నిరసన దీక్ష చేస్తున్నామని… ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ దీక్ష చేస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ ‌భవన్‌లో దాడి జరిగింది కాబట్టే ఇక్కడే దీక్షకు కూర్చున్నామని తెలిపారు. 70లక్షల మంది కార్యకర్తలు నిర్మించుకున్న దేవాలయం ఇది అని అన్నారు. ఒక పద్ధతి ప్రకారం పక్కా ప్రణాళికతో పార్టీని తుదముట్టించాలనే కుట్రతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయాల్ని యత్నించారని ఆయన అన్నారు. చిన్నపిల్ల ఇంట్లో ఉంటే కూడా లెక్కచేయకుండా పట్టాభి ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు. పార్టీ కార్యాలయంపై దాడి జరగబోతోందని మంగళవారం సాయంత్రం డీజీపీకి ఫోన్‌ ‌చేస్తే స్పందించలేదని తెలిపారు. ఇతర పోలీసు ఉన్నతాధికారులకు యత్నించినా స్పందన లేదన్నారు. దీంతో వెంటనే గవర్నర్‌కు ఫోన్‌ ‌చేస్తే ఆయన స్పందించారని తెలిపారు. రాష్ట్రం మొత్తం ఏకకాలంలో టీడీపీ కార్యాలయాలు, నేతలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని చెప్పామన్నారు. పోలీసులు, ప్రభుత్వం కలిసి చేస్తున్న దాడిపై తక్షణమే స్పందించాలని అవి•త్‌షాను కోరామని అన్నారు. ఇది ప్రజలపై, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని తెలిపారు. తనకేమైనా పర్లేదనే వెంటనే పార్టీ కార్యాలయానికి వచ్చానని చంద్రబాబు చెప్పారు. ఇదిలావుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షకు మద్దతుగా వెళ్తున్న కార్యకర్తలు, నాయకులకు అడ్డంకులు ఎదురయ్యాయి. అనుమతి ఇచ్చామంటూనే కార్యకర్తలను పార్టీ కార్యాలయానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. బ్యారికేడ్లు అడ్డుపెట్టి పార్టీ కార్యాలయానికి వెళ్లే రోడ్లను బ్లాక్‌ ‌చేశారు. పార్టీ కార్యాలయానికి వెళ్ళడానికి అనుమతిలేదని పోలీసులు చెబుతున్నారు. పార్టీ కార్యాలయంలపై దాడికి నిరసనగా చేపట్టిన దీక్షలో పాల్గొనేందుకు వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌ ‌మార్గాన్ని పోలీసులు మార్చారు. అదే సమయంలో సీఎం బయల్దేరడంతో మార్గాన్ని మళ్లించారు. తాడేపల్లి వైపు కూడా మంగళగిరి వి•దుగా చంద్రబాబు కాన్వాయ్‌ను మళ్లించారు. రూట్‌ ‌మారడంతో దాదాపు 20 నిమిషాలు ఆలస్యంగా చంద్రబాబు దీక్షా స్థలికి చేరుకున్నారు. దీక్షలో అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ఱుడు, బక్కని నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.