ఇక యుద్ధమే…!
- మాదక ద్రవ్యాలపై ఇక ప్రచార యుద్దం
- సీఎం కేసీఆర్ ఆదేశాలతో కార్యాచరణ
- త్వరలోనే విధివిధానాలు ఖరారు
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
మత్తు పదార్థాలతో వచ్చే అనర్థాలపై ప్రభావపూరితమైన షార్ట్ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలు, సందేశాత్మక ఆడియో, వీడియో ప్రచార ప్రకటనలను రూపొందించనున్నారు.తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు సాగనున్నాయి. సిఎం కెసిఆర్ ఆదేశాలతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టేందుకు రంగం సిద్దం అయ్యింది.మాదక ద్రవ్యాల రవా ణా, వాడకంపై సవి•క్ష సందర్బంగా సిఎం కెసిఆర్ చేసిన సూచనలతో ఇక పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్ట నున్నారు.దీనికి సంబంధించి సిఎం ఓఎస్డి దేశిపతి శ్రీనివాస్ కార్యక్రమాలను రూపొందించనున్నారు. ఈ ప్రచార బాధ్యతలను సీఎస్ సోమేశ్ కుమార్‌కు సీఎం కెసిఆర్ అప్పగించారు. విద్యార్థిదశ నుంచే అవగాహన కలిగే విధంగా ప్రత్యేక పాఠాలను రూపొందించి, సిలబస్‌లో చేర్చాలని,అందుకవసరమయ్యే చర్యలు ప్రారంభించాలని ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ను ఆదేశించారు.డ్రగ్స్ దుష్ఫలితాలపై ప్రతిభావంతంగా నిర్మించే సినిమాలకు సబ్సిడీ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామని సీఎం పేర్కొన్నారు.రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిరోధంపై బుధవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర పోలీస్, ఎక్సై జ్ ఉన్నతాధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాక సత్వర కార్యాచరణ చేయనున్నారు.రాష్ట్రం గొప్ప అభివృద్ధిని సాధిస్తున్న సందర్భంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల లభ్యత పెరగడం శోచనీయం అని సిఎం అభిప్రాయపడ్డారు. వ్యవసాయంలో వచ్చిన అభివృద్ధి కారణంగా రాష్ట్రంలో కోటీ 30 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. పంజాబ్ రాష్టాన్న్రి కూడా మించి ధాన్యం దిగుబడులు పెరిగాయి. ఇదే క్రమంలో సిఎం ఆదేశాలతో రాష్ట్రంలో గంజాయిని నిరోధించేందుకు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, ప్లయింగ్ స్క్వాడ్లను పూర్తిస్థాయిలో బలోపేతం చేయనున్నారు.విద్యాసంస్థల వద్ద పోలీసు లు ప్రత్యేక నిఘా పెట్టి గంజాయి లేదా డ్రగ్స్ రవాణాను అరికట్టనున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల సంఖ్యను పెంచనున్నారు. అలాగే సరిహద్దుల్లో చెకింగ్ పెంచనున్నారు. సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవడంతో పాటు తగినన్ని వాహనాలను సమకూర్చుకోవాల్సి ఉంది. ఇంటెలిజెన్స్ విభాగంలో కూడా ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. గంజాయి వాడకందారుల ఆధారంగా సరఫరా చేసేవారిని పట్టుకునే ప్రయత్నాలు ఇక ముమమరం చేయనున్నారు. చెక్ పోస్టులను, నిఘా కేంద్రాలను కేవలం హైవేల వి•దనే కాకుండా, అవసరమైన అన్నిచోట్లా ఏర్పాటు చేస్తారు. ఇందుకు అవసరమైన నిధులను కలెక్టర్లకు విడుదల చేస్తారు.