‘బాలు సంగీత విభావరి’ని విజయవంతం చేయాలి
- 25న త్రివేణి ఫంక్షన్ హాల్లో వేడుకలు
- కరపత్రాలు ఆవిష్కరించిన మనం వికాస వేదిక
సూర్యాపేట,జ్యోతిన్యూస్ :
సూర్యాపేట పట్టణానికి సుపరిచితులైన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను గుర్తు చేసుకుంటూ 25న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హాల్లో నిర్వహించే ఎస్పీ బాలు సంగీత విభావరిలో పట్టణ ప్రజలు, సంగీత ప్రియులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మనం వికాస వేదిక అధ్యక్ష,కార్యదర్శులు పెద్దిరెడ్డి గణేష్, డీఎస్వీ శర్మలు కోరారు. బుధవారం స్థానిక మంత్రి జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సంగీత విభావరి కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ ఎస్పీ బాలు తన జీవితకాలంలో సందర్శించిన పట్టణాలలో సూర్యాపేట ఒకటి అన్నారు.అలాంటి మహానుభావుడిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నా రు.నేటి నుంచి స్థానిక పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఎస్పీబాలు పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సంగీత విభావరి కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,ప్రముఖ సినీ దర్శకులు శివనాగేశ్వరరావులు ముఖ్య అతిథులుగా రానున్నట్లు తెలిపారు.ఎస్పీ బాల సుబ్రహ్మ ణ్యంకు ఘనంగా నివాళులర్పించిన అనంతరం ప్రభావ మ్యూజిక్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో జరిగే సంగీత విభావరి ఆద్యంతం బాలు పాటలతో సాగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సంగీత ప్రియులు,పట్టణ ప్రజలు,బాలు అభిమాను లు కరుణ నియమనిబంధనల మేరకు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో మనం వికాస వేదిక సభ్యులు అంజన్ ప్రసాద్,రాజశేఖర్,చిట్టిపాక వీరయ్యలు పాల్గొన్నారు.