మతసామరస్యానికి సూర్యాపేట జిల్లా ప్రతీక : మాజి మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి

సూర్యాపేట : వాడవాడలా వినాయక ఉత్సవాలలో యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారని, సూర్యాపేట జిల్లా మత సామరస్యానికి నిలయమని, వినాయక ఉత్సవాలలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటున్నారని మాజి మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 24 వ వార్డులో నెలకొల్పిన వినాయక విగ్రహం వద్ద సోమవారం నాడు ఆయన ప్రత్యేక పూజలు చేసారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అంజద్ అలి, స్ధానిక నాయకులు చెరకు రామన్న,సాయిక్ర్రష్ణ, షేక్ రుస్తుం, మాడపాటి నవీన్,నందు, సుంకరబోయిన రాము, వేణుధర్ రెడ్డి, రావుల నాగరాజు, రణదీర్ సింగ్, బాదల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంరెడ్డి దామోదర్ రెడ్డికి అడ్వాన్స్ గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కటింగ్ చేశారు.