‘లాక్‌డౌన్’ పొడిగింపు !
- మరో 10 రోజుల పాటు కొనసాగింపు
- సాయంత్రం 5 గంటల వరకు సడలింపు
- 5నుంచి 6 వరకు ఇళ్లకు చేరుకునేలా వెసులుబాటు
- సాయంత్రం 6నుంచి ఉదయం 6 వరకు అమలు
- కఠినంగా అమలు చేయాలని పోలీసులకు ఆదేశం
- కొన్ని ప్రాంతాల్లో యధాతధ స్థితిగా లాక్‌డౌన్ అమలు
- తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం
- కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినేట్ ఆమోదం
- తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా….
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
తెలంగాణలో అమలవుతున్న లాక్‌డౌన్‌ను మరో పదిరోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. లాక్‌డౌన్ నిబంధనలు సడిలిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి ఒంటి గంట వరకు ఉన్న లాక్‌డౌన్ సడలింపును సాయంత్రం 5గంటల వరకు పొడిగించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్యక్షతన హైదరాబాద్ ప్రగతిభవన్‌లో సమావేశమైన మంత్రి వర్గం కరోనా పరిస్థితులు,లాక్‌డౌన్ పై చర్చించింది. లాక్‌డౌన్ సడలింపులో భాగంగా 5 గంటల వరకు పొడిగించిన ప్రభుత్వం ప్రజలు ఇళ్లకు చేరుకునేం దుకు మరో గంట సమయం ఇచ్చారు. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు పూర్తి లాక్‌డౌన్ కఠినంగా అమల్లో ఉంటుంది. ఆ తర్వాత నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని పోలీసు శాఖను కేబినెట్ ఆదేశించింది. కరోనా పూర్తిగా అదుపులోకి రాని.. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాల గూడ, నియోజక వర్గాల పరిధిలో మాత్రం, లాక్‌డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న యదాతధ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. లాక్‌డౌన్ మూడో దఫాపై గత నెల 30న మంత్రి మండలి సమావేశమై ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెసులుబాటు కల్పించింది. ఆ తర్వాత ఇళ్లకు చేరుకునేందుకు గంటసేపు అనుమతించింది. గత నెల 31 నుంచి ఇది అమలవుతోంది. మూడో విడత లాక్‌డౌన్ గడువు ఈ నెల 9తో ముగుస్తుండటంతో తదుపరి కార్యాచరణ కోసం మంత్రి మండలి ఇవాళ సమావేశమైంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలతో దుకాణాలు, వ్యాపార సముదా యాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నడుస్తున్నాయి. దాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. ప్రస్తు తం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను మరింత సడలించాలని ప్రభుత్వం భావించింది.
ఇదిలా ఉండగా గత కేబినెట్ సమావేశం చేసిన ఆదేశాలమేరకు సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజక వర్గాల్లో కరోనా పరిస్థితిని తెలుసుకునేందుకు రాష్ట్ర వైద్యాధికారుల బృందం పర్యటించింది. ఈ నియోజకవర్గాల్లో కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని, అందుచేత, ఈ ఏడు నియోజక వర్గాల్లో లాక్ డౌన్‌ను ప్రస్తుతం కొనసాగిస్తున్న సమయాన్ని అనుసరించే మరో పదిరోజుల పాటు కొనసాగి ంచాలని కేబినెట్ కు వైద్యాధికారుల బృందం సిఫారసు చేసింది. వారి సిఫారసుల మేరకు పైనె తెలిపిన 7 నియోజక వర్గాల్లో లాక్ డౌన్ యధాతధ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.
తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా….
తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,897 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో మరో 15 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 2,982 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24,306 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 182 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 3,409కు చేరింది.