లాక్‌డౌన్ సడలింపుల్లో రాష్ట్రాలు
- హర్యానాలో 14 వరకు లాక్‌డౌన్ పొడిగింపు
- దుకాణాలకు సరి, బేసి విధానాలలో అనుమతులు
- ఏడు రాష్ట్రాల్లో వేయికన్న తక్కువ కేసులు: హర్షవర్ధన్
అమరావతి,జ్యోతిన్యూస్ :
కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 20 వరకు కర్ఫ్యూను పొడిగించింది. జూన్ 10 తర్వాత ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు కర్ఫ్యూ సడలింపు సమయం పెంచారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు ప్రభుత్వ కార్యాలయాలు పని చేయనున్నాయి. కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సక్ష చేపట్టారు. సక్షకు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు హాజరయ్యారు.
హర్యానాలో 14 వరకు లాక్‌డౌన్ పొడిగింపు…
దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నాయి.పాజిటివ్ కేసులు తగ్గినప్పటికి ఈ మహమ్మారి వ్యాప్తి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను మరింత కాలం పొడిగించ డానికే మొగ్గుచూపుతున్నాయి. తాజాగా, హర్యానా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. అయితే, కొంత వరకు నిబంధలను మాత్రం సడలించినట్లు హర్యానా రాష్ట్ర కార్యదర్శి విజయ్ వర్ధన్ వెల్లడించారు. కార్పొరేట్‌ఫీసులలో 50 శాతం ఉద్యోగులు, కోవిడ్? నిబంధనలు పాటిస్తూ హజరవ్వాడానికి అనుమతి ఇచ్చారు. దుకాణాలను సరి, బేసి విధానాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరచి ఉంచుకోవడానికి వెసులుబాటు కల్పించారు. షాపింగ్ మాల్స్‌ను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఇచ్చారు. ఇక, బార్‌లు, హోటల్‌లు, రెస్టారెంట్, క్లబ్‌లకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 వరకు తెరచి ఉంచుకోవచ్చని తెలిపారు. వీటిలో కూడా 50 శాతంమేర ఆక్యుపెన్సీ మాత్రమే ఉండేలా చూడాలని సూచించారు. ప్రార్థన మందిరాలలో ఏసమయంలో అయినా.. 21 మందికి మించి ఎక్కువ మంది ఒకచోట గుమి గూడ కుండా చర్యలు తీసుకోవాలన్నారు. వివాహ వేడుకలలో 50 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. బరాత్‌లకు, ఊరేగింపులు, ఇతర సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా.. అంతిమ సంస్కారాలకు కూడా కేవలం 21 మందిలోపు మాత్రమే హజరవ్వాలని సూచించారు. అయితే, గత నెలలో హర్యానా రాష్ట్రంలో ప్రతిరోజు 15,000 వేల కరోనా కేసులు నమోదవుతుండగా, ప్రస్తుతం ఆసంఖ్య 9,974 కు తగ్గినట్లు ఆరోగ్యశాఖ ఒక ప్రకటన లో తెలిపింది.
ఏడు రాష్ట్రాల్లో వేయికన్న తక్కువ కేసులు: హర్షవర్ధన్
దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతుంది. ఢిల్లీ, హర్యానాతో సహా 7 రాష్ట్రాల్లో 1,000 కంటే తక్కువ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. దేశంలోని కోవిడ్ పరిస్థితులపై సోమవారం డియాతో మాట్లాడారు హర్షవర్ధన్. దేశంలో ప్రస్తుతం 14,01,609 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని, కరోనా రికవరీ రేటు నిలకడగా పెరుగుతోందని చెప్పారు. 10 రాష్టాల్లో్ర 83 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయని, మిగతా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 17 శాతం యాక్టివ్ కేసులు ఉన్నట్లు వివరించారు. మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఝార్ఖాండ్ రాష్టాల్రు వెయ్యి కంటే తక్కువ కేసులు నమోదవుతున్న జాబితాలో ఉన్నాయని హర్షవర్ధన్ తెలిపారు. ఇక జమ్మూకశ్మీర్, పంజాబ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్‌లో 2,000 కంటే తక్కువగానే కరోనా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్ర కేరళల్లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అన్నారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ సడలింపుపై దృష్టిపెట్టాయి. తాజాగా ఆంధప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూలో సడలింపులు ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు, ఇతర కార్యాలయాలు తెరిచేందుకు అనుమతించింది. ఈ సడలింపు జూన్ 10 నుంచి అమల్లోకి రానుంది. ఇక తెలంగాణలో కూడా లాక్ డౌన్ సడలింపులు ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. మంగళవారం జరిగనున్న కేబినేట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.