గడచిన 24 గంటల్లో మరో 3417 మంది మృతి

  • ‌దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
  • కొత్తగా మరో 3,68,147 కేసులు నమోదు
  • కోవిడ్‌ ‌కేంద్రంగా కామన్‌వెల్త్ ‌గేమ్స్ ‌విలేజ్‌

న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :
‌భారత్‌లో కరోనా సెకండ్‌ ‌వేవ్‌ ఉదృతి తీవ్రంగానే ఉన్నది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 3,68,147 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,99,25,604కి చేరింది. ఇందులో 1,62,93,003 మంది కోలుకొని డిశ్చార్జ్ ‌కాగా, 34,13,642 కేసులు యాక్టివ్‌ ‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 3417 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,18,959కి చేరింది. దేశంలో 24 గంటల్లో 3,00,732 మంది కోలుకొని డిశ్చార్జ్ ‌కావడం విశేషం. ఇకపోతే, దేశంలో ఇప్పటి వరకు మొత్తం 15,71,98,207 మందికి వ్యాక్సిన్‌ ‌ను అందించారు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కరోనా వైరస్‌ ‌రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కామన్‌ ‌వెల్త్ ‌గేమ్స్ ‌విలేజ్‌ ‌ను మొట్టమొదటిసారి కొవిడ్‌ ‌కేర్‌ ‌కేంద్రంగా మార్చారు. ఈ కొవిడ్‌ ‌కేర్‌ ‌కేంద్రంలో సొంతంగా ఆక్సిజన్‌ ‌ప్లాంటును కూడా ఏర్పాటు చేశారు. కామన్‌ ‌వెల్త్ ‌గేమ్స్ ‌విలేజ్‌ ‌కొవిడ్‌ ‌కేంద్రంలో 1500 లీటర్ల కెపాసిటీతో పనిచేసే ఆక్సిజన్‌ ఎ•-‌లాంటును నిర్మించారు. కరోనా రోగులకు అక్సిజన్‌ అం‌దేలా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ‌కొరత ఏర్పడిన నేపథ్యంలో కామన్‌ ‌వెల్త్ ‌గేమ్స్ ‌కొవిడ్‌ ‌కేంద్రంలో ఆక్సిజన్‌ ఎ•-‌లాంటు ఏర్పాటు చేశారు. ఆక్సిజన్‌ ‌కొరతతో 12 మంది రోగులతోపాటు ఓ సీనియర్‌ ‌డాక్టరు మరణించారు. ఢిల్లీ సర్కారు తమకు 976 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌ అం‌దించాలని కోరగా కేంద్రం 490 మెట్రిక్‌ ‌టన్నుల కోటాను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. రోజుకు 4 లక్షలకు చేరువలో కేసులు నమోదువుతున్నాయి. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్‌ అం‌దక ఎంతో మంది కోవిడ్‌ ‌రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణవాయువు కొరత కారణంగా ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.