కఠిన లాక్‌డౌన్‌ అవసరం: ఎయిమ్స్ ‌చీఫ్‌ ‌రణ్‌దీప్‌ ‌గులేరియా

ఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :
‌కరోనా విజృంభణతో దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల కొరత ఏర్పడుతున్నందున దేశవ్యాప్తంగా కఠిన లాక్‌డౌన్‌ అవసరమని ఎయిమ్స్ ‌చీఫ్‌ ‌డా. రణ్‌దీప్‌ ‌గులేరియా వెల్లడించారు. ఆదివారం మీడియాకు ఇచ్చిన ఇంటార్వ్యులో ఉత్తరప్రదేశ్‌, ‌మహారాష్ట్ర, హరియాణా, తెలంగాణ వంటి రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌ ‌విధిస్తున్న ప్పటికీ అంతగా ప్రభావం చూపలేకపోతున్నాయని వివరించారు. గతేడాది మార్చిలో విధించిన తరహాలో కఠిన లాక్‌డౌన్‌ అవసరమని అభిప్రాయపడ్డారు. వివిధ రాష్ట్రాల్లో వైద్య సదుపాయాల కొరత ఏర్పడుతోందన్నారు. వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ అం‌దక మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో ఆరోగ్య సదుపాయాలతో పాటు సిబ్బంది కూడా తగ్గిపోతున్నారని, ఇలాంటి సమయంలో అప్రమత్తంగా లేకపోతే పరిస్థితులు చేయిదాటిపోతాయని హెచ్చరించారు. వివిధ రకాల టీకాలు వస్తున్నాయని ప్రజల్లో ఒక రకమైన నమ్మకం ఏర్పడి ఇక కరోనా మనల్ని ఏం చేయదనే అభిప్రాయంతో ఉన్నారని వివరించారు. టీకాల భరోసాతో అనేక మంది కరోనా నిబంధనలు పాటించడం లే•ని, మనలో హెర్డ్ ఇమ్యూనిటీ ఉందని, వైరస్‌ ‌దరిచేదనే భావనలో ఉన్నామని తెలిపారు. కానీ వైరస్‌లో మార్పులు ఏర్పడితే హెర్డ్ ఇమ్యూనిటీ వైరస్‌ను తట్టుకోలేదని, అప్పుడు మహమ్మారి కార్చిచ్చులా వ్యాపిస్తూ వినాశనం సృష్టిస్తుందని హెచ్చరించారు.