న్యాయం జరిగే వరకు పోరాటం…
- తెలంగాణను అడ్డంగా దోచుకుంటున్న కెసిఆర్
- లాయర్ దంపతుల హత్యపై నోరు మెదపని కెసిఆర్
- సిబిఐతో విచారన జరిపించాలి..చీఫ్ జస్టిస్‌కు లేఖ రాస్తా
- న్యాయం జరిగివేరకు ఉద్యమిస్తానన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్
- టిఆర్ఎస్ లీడర్లే హంతకులన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
సాండ్, ల్యాండ్, మైన్స్ వైన్స్ దోచుకోవడానికి తెలంగాణ ఏర్పాటు చేసుకున్నట్లు ఉందని, సీఎం కేసీఆర్ వ్యవహ రంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కెసిఆర్ తీరు రాష్ట్ర ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తో ందని కాంగ్రెస్ నేత ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటులో న్యాయవాదుల పాత్ర అత్యంత ప్రధానమైనదని అన్నారు. అలాంటి న్యాయవాద జంటను పట్టపగలే హత్య చేసినా దిక్కు లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏమి చేయాలనుకుంటున్నారంటూ ఉత్తమ్ ప్రశ్నించారు. కనీసం బుధవారం జరిగిన హత్యపై స్పందంచకపోవడం దారుణమని మండిపడ్డారు. న్యాయం కోసం పోరాడే పేద బ్రాహ్మణ కుటుంబం వారిదని, సమాజంలోని అన్ని వర్గాలకు మేలు జరగాలని ఆయన వ్యాఖ్యానించారు. శీలం రంగయ్య లాకప్ డెత్ పై గట్టు వామన రావు హైకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారని, రాష్ట్రంలో కొందరు పోలీసులు పింక్ షర్ట్ వేసుకున్నట్లు ప్రవర్తిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. 2020 సెప్టెంబరులో న్యాయవాదులకు పోలీసుల రక్షణ కల్పించాలని హైకోర్టు చెప్పింది. అయినా పోలీసులు పట్టించుకోకపోవడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ఆరోపణలు చేశారు. అదే టీఆర్ఎస్ నాయకులు ఆగడాలు చేస్తే..కేసీఆర్ మద్దతు ఉంటుందా అంటూ పుట్ట మధు అక్రమాలపై న్యాయవాద దంపతులు కేసులు వేశారని స్పందించలేదా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలీస్ శాఖకు మంచి పేరు ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆత్మపరిశీలన చేసు కోవాలని ఉత్తమ్ సూచించారు. రామగుండం సీపీ సత్యనారాయణ టీఆర్ఎస్•-కు తొత్తుగా పని చేస్తున్నారని సీపీని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. వామనరావు హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోలేదంటే కాంగ్రెస్ పోరాడుతుందని.. హైకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తానన్నారు. ఈ విషయంపై పార్లమెంట్•-లో ప్రస్తావిస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. న్యాయం కోసం పోరాడే పేద కుటుంబం నుంచి వచ్చిన వారిని చంపడం అత్యంత హేయమైన చర్య అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది రాష్ట్రాన్ని దోచుకోవడానికే అని, సాండ్ ల్యాండ్ మైన్ దోపిడీతో పాటు ఇప్పుడు హత్యలకు తెగబడుతున్నారని విమర్శించారు. ఇది ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ చేసిన హత్యే అని, కేసీఆర్ ఈ హత్యలను కనీసం ఖండించడం లేదని అన్నారు. శీలం రంగయ్య లాకప్ డెత్ పై హైకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారని, హైకోర్టులో కేసు వేసినందుకు తనకు ప్రాణహాని ఉందని గట్టు వామనరావు సతీమణి, న్యాయవాది నాగమణి కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి
ఇప్పటి వరకు స్పందించలేదని, హోంశాఖా మంత్రి పూర్తిగా డ్మగా ఉన్నారని అన్నారు. దళిత వ్యక్తి లాకప్ డెత్ పై కేసు వేస్తె వీరిని చంపేశారని అన్నారు. పుట్టా మధు అక్రమాలపై కోర్టులో కేసులు వేశారని, దాని ఫలితమే ఈ హత్యలు అని అన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థపై నమ్మకం పోయిందని, సీబీఐ చేత విచారణ జరిపించాలని అన్నారు. పార్లమెంట్ లో ఈ హత్యలపై ప్రస్తావన తీసుకొస్తామని, న్యాయం జరగకుంటే ఉద్యమం చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మంథిని ప్రాంతంలో టీఆరెస్ లీడర్ల అరాచకానికి పోలీసులే సపోర్ట్ చేస్తున్నారని, వామనరావు దంపతుల హత్యలో టీఆరెస్ నేతలే కీరోల్ గా వున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక అక్రమాలకు అరాచకాలకు వామనరావు దంపతులు అడ్డుపడుతున్నారని, టీఆర్ఎస్ లీడర్ పుట్ట మధు ప్రోత్సహంతోనే ఈ హత్య జరిగిందని ఆయన అన్నారు. గతంలో మంథని పోలీస్ స్టేషన్లో రామగిరి మండలం రామయ్యపల్లి గ్రామానికి చెందిన దళితుడు శీలం రంగయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని, అతని లాకప్ డెత్ బయటికి తీయడానికి వామనరావు ఫైట్ చేస్తున్నారని అన్నారు. ఆ డెత్ మిస్టరీ బయటికి రాకుండా ఉండడానికి లాయర్ దంపతులను హత్య చేశారని ఆయన అన్నారు. వారం రోజుల క్రితం హాలియా సభలో కేసీఆర్.. టీఆరెస్ పార్టీ ని విమర్శిస్తే.. నశం నశం చేస్తామన్నారని , బహుశా.. కేసీఆర్ బర్త్ డే గిప్ట్ గానే.. ఈ హత్య చేశారా.. అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో వంగవీటి మోహన రంగ హత్య ఎలా జరిగిందో అలా చేశారని, అప్పుడు టిడిపి ఎలా వ్యవహరించిందో.. ఇప్పుడు అలా టీఆరెస్ వ్యవహరిస్తోందన్నారు. పోలీసులు..ఈ రాష్ట్రంలో టీఆరెస్ లీడర్లకే ఫ్రెండ్లి పోలీస్ లు గా పనిచేస్తున్నారని విమర్శించారు. ఈ హత్యతో కేవలం మంథిని ప్రాంతానికే కాక.. రాష్ట్రం మొత్తం ఉలికి పడిందని, ఈ కేసులో నిర్లక్ష్యం చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హై కోర్ట్ ఈ హత్య కేసును సుమోటా కేసు గా తీసుకుంది, కానీ ఈ మర్డర్ పై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సీబీఐ విచారణలనే ఈ హత్యలో కీలకమైన వ్యక్తి ఎవరో సిబిఐ విచారణలోనే తేలుతుందని అన్నారు.