మండుతున్న ‘పెట్రోల్’ ధరలు
- సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న చమురు కంపెనీలు
- వరుసగా నాలుగో రోజూ పెరిగిన పెట్రో ధరలు
- హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ 91.65కు చేరిక
న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్ :
చమురు కంపెనీలు సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలు శుక్రవారం మరోసారి పెరిగాయి. వరుసగా నాలుగో రోజు ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌పై 39 పైసల వరకు పెంచాయి. ఫిబ్రవరిలో ధరలు పెరగడం ఇది ఆరోసారి. దేశంలో పెట్రో ధరలు వరుసగా నాలుగోరోజు ఎగబాకి తాజా గరిష్ఠాలకు చేరాయి. చమురు సంస్థలు పెట్రోల్ పై 29 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.88.14కు, డీజిల్ ధర రూ. 78.38కు ఎగబాకింది. హైదరాబాద్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు ఎగబాకాయి. నగరంలో లీటర్ పెట్రోల్ ధర శుక్రవారం రూ. 91.65కు చేరింది. లీటర్ డీజిల్ ధర రూ. 85.50గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరాయి. అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 94.64కు చేరగా.. డీజిల్ ధర రూ. 85.32గా ఉంది. 2017, జూన్ 15 నుంచి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల ఆధారంగా రోజు వారీ ధరల్లో హెచ్చుతగ్గులను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పెంచిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.91.65, డీజిల్ రూ.85.50కి పెరిగింది. ముంబైలో పెట్రోల్ రూ.94.64, చెన్నైలో రూ.90.44, బెంగళూరులో రూ.91.09, జైపూర్‌లో రూ.94.81, పాట్నాలో రూ.90.86, బెంగళూరులో రూ.91.09, డీజిల్ లీటర్‌కు ముంబైలో రూ.85.32, చెన్నైలో రూ.85.32, బెంగళూర్‌లో రూ.83.09, జైపూర్‌లో రూ.86.89, పాట్నాలో రూ.83.87, త్రివేండ్రం రూ.84.28కు చేరింది. గత కొంతకాలంగా ప్రతి వారంలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు ధరలను పెంచుతోంది. మిగిలిన రెండు, మూడు రోజులు ధరల పెరుగుదలలో మార్పు ఉండటం లేదు.