ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదులో చురుకుగా ఉండాలి

  • – ఇంఛార్జీలతో మంత్రి కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌,జ్యోతిన్యూస్‌ :
వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ఇంఛార్జిలతో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి పట్టభద్రుల ఓటర్ల నమోదుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. పంచాయతీ నుంచి అసెంబ్లీ వరకు అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధించిం ది. రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. ఇప్పటికే వివిధ నియామ క ప్రక్రియల ద్వారా దాదాపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. ప్రయివేటు రంగంలో రూ. 2 లక్షల కోట్ల పెట్టు బడులను ప్రోత్సహించామని గుర్తు చేశారు. పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా 15 లక్షల మందికి ఉపాధి కల్పించామ ని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పాలనలో అపూర్వమైన సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. 60 ఏళ్ల ప్లోరైడ్‌ రక్కసిని ఆరేళ్లలో తరిమేశామన్నారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ప్రతిపక్షాలు దివాళా తీశాయని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. నమోదు ప్రక్రియను వేగవంతంగా చేపట్టి అందరినీ ఎన్‌రోల్‌ అయ్యేలా చేయాలన్నారు.