గుల్లవుతున్న గుట్టలు… కనుమరుగవుతున్న ఖనిజాలు

  • – ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో అక్రమ మైనింగ్‌ వ్యాపారాలు
  • – కనుమరుగవుతున్న కోట్ల రూపాయల ఖనిజ సంపద.
  • – రెండు జిల్లాలకు విస్తరించి ఉన్న మైనింగ్‌ నిక్షేపాలు
  • – గుట్టలు లూటీ అవుతున్న పట్టించుకోని మైనింగ్‌ అధికారులు
  • – లీజు అనుమతులను కూడా గుర్తించ లేని అధికారులు
  • – పర్యావరణ అనుమతుల జాడ లేదు
  • – భారీ పేలుళ్లతో గుట్టల ధ్వంసం
  • – మైనింగ్‌ అనుమతులపై స్పష్టత లేని అధికారులు
  • – బ్లాస్టింగ్‌లకు కూడా లేని అనుమతులు
  • – మైనింగ్‌ తవ్వకాలకు అక్రమ విద్యుత్‌ కనెక్షన్లు
  • – పలు శాఖల అధికారులతో మాఫియా సంబంధాలు
  • – పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మైనింగ్‌ మాఫియా అక్రమాలు.
  • – షెడ్యూల్‌ ఏరియా నిబంధనలను మరిచిన అధికారులు
  • – ముఖ్యమంత్రి కేసీఆర్‌ తక్షణం స్పందించాలని ప్రజల డిమాండ్‌

(మిట్టపల్లి కిరణ్‌కుమార్‌)
పెనుబల్లి(ఖమ్మం),జ్యోతి న్యూస్‌ :-

అపారమైన ఖనిజ సంపద కలిగిన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంపై కార్పొరేట్‌ సంస్థల కన్నుబడి మైనింగ్‌ గుట్టలు కనుమరుగవుతున్నాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లి సరిహద్దుల్లో అపారమైన ఖనిజ సంపద వుంది. ఈ మండలంలో మైనింగ్‌ లీజుల మాయా జాలం అలుముకుంది. పేర్లు మార్చి ఒక సంస్థ తర్వాత మరో సంస్థ పేరిట తవ్వకాలు జరిగిపోతున్నాయి. అవే లీజులను సంస్థల, వ్యక్తుల పేర్లు మార్చి కేటాయిస్తూ మాయాజాలం సష్టిస్తు న్నారు. ప్రభుత్వానికి దక్కాల్సిన కోట్ల రూపాయల విలువైన ఖనిజాలను అక్రమ పద్ధతుల్లో కొల్లగొట్టుకుపోతున్నారు. ఈ క్రమంలో గుట్టలు లూటీ అవుతున్నాయి. ఇప్పటికే లీజులకు సంబంధించి కోట్లాది రూపాయల అపరాధ రుసుం కాస్తా అక్రమార్కులు చెల్లించకుండా మైనింగ్‌ శాఖ వత్తాసు పలుకుతున్నట్టుగా ఆరోపణలున్నాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లో రాష్ట్ర సరిహద్దులు దాటుతున్న కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపద. ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లో భద్రాచలం- విజయవాడ జాతీయ రహదారికి ఇరుపక్కలా విస్తరించి ఉన్న మైనింగ్‌ గుట్టలను అక్రమ క్వారీ ఇంగ్‌ వలన ఇప్పటికే కొంత కనుమరుగు అవ్వగ మిగిలి ఉన్న గుట్ట కూడా పూర్తిగా కను మరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది.ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గౌరారం, లింగగూడెం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం పెద్దిరెడ్డిగూడెం రెవెన్యూ గ్రామాల పరిధిలో పెద్ద ఎత్తున అక్రమ మైని ంగ్‌ కొనసాగుతోంది. పెనుబల్లి మండలంలోని దేవతలగుట్ట,చిట్యాల బోడు,టేకులగుట్టల్లో జరిగే మైనింగ్‌ వ్యవహారం గూర్చి స్థానిక ప్రజా ప్రతినిధులకు గానీ, అధికారులకు గానీ స్పష్టమైన సమాచారం లేదు అని అర్థం అవుతోంది. అన్నిరకాల అనుమతులు ఉన్నదీ లేనిదీ కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. అనుమతులు ఉన్నా వాటి పరిధి విస్తీర్ణం ఎంతో తెలియదు.ఇక్కడ మైనింగ్‌ కాంట్రాక్టరే అధికారులు,మైనింగ్‌ కాంట్రాక్టరే రాజకీయ నాయకులు,మొత్తం మీద మైనింగ్‌ కాంట్రాక్టర్లదే ఇష్టారాజ్యం.కోట్ల రూపాయల అక్రమ మైనింగ్‌ వ్యాపారంలో అధికారులు నిమిత్తమత్రులుగా మాకు ఏమీ తెలియదు అనుకుంటూ ఉంటున్నారు. కళ్ల ముందే రాష్ట్రల సరిహద్దులు దాటి పోతున్న కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపద తరలిపోతున్నా ప్రజలు, ప్రజా ప్రతినిధులు,అధికారులు చోద్యం చూస్తూ ఉండాల్సి వస్తోంది.షెడ్యూల్‌ ఏరియాలో ఉన్న గుట్టలను మైనింగ్‌ పేరుతో ధ్వంసం చేయడం.. ఏరియా నియమ నిబంధనలకు విరుద్ధం అని.షెడ్యూలు ఏరియా పరిధిలో గల గుట్టల్లో జరిగే చీకటి వ్యవహారంలో మొత్తం బినామీ మాఫియాలదే రాజ్యం అని.ఈ క్వారీల్లో వెలికితీసే విలువైన బండరాళ్లతో పాటు అన్నీ రకకాల సైజుల్లో దొరికే మెటల్‌ ను క్రషింగ్‌ చేస్తున్నారు.క్రషర్‌ మిల్లులను కూడా గుట్టల్లోనే నెలకొల్పారు.ఒకప్పుడు ఈ గుట్టల్లో స్థానిక కుటుంబాలకు చేతినిండా పని దొరికేది.ఇప్పుడు అదీ లేదు.ప్రస్తుతం ఇక్కడ పని మొత్తం అధునాతన యంత్రాలతోనే జరుగుతుంది.వందలాది లారీల్లో ఖనిజ సంపదను రోజు బయటి ప్రాంతాలకు సరిహద్దులు దాటి ఇస్తూ భారీగా అక్రమ రవాణా చేస్తున్నారు.ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలకు చెందిన గిరిజనేతర వ్యక్తుల చేతుల్లో మైనింగ్‌ మొత్తం ఉన్నట్లు తెలుస్తోంది.పెద్ద పెద్ద బండరాళ్ల తో ఏర్పడ్డ ఈగుట్టలను నుజ్జు చేసే క్రమంలో నిరంతరం భారీ పేలుడు పదార్థాలను విస్తతంగా వినియోగిస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో పేలుళ్లు నడుస్తున్న అధికారులకు తెలియదు అనటం విడ్డూరం.ఈ పేలుళ్లకు చుట్టు పక్కల రైతులు,సమీప ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నా అధికారులకు వినపడవు కనపడవు అన్న చందంగా ఉన్నది వ్యవహారం.పచ్చని పొలాల్లో రోజు పడే డస్ట్‌, రాళ్లతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.ఇక్కడ వెలువడే కాలుష్యం వల్ల పంట పొలాల్లో దిగుబడులు కూడా రావడం లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగుచేసుకునేందుకు పేదలకు ఇచ్చిన అసైన్‌ మెంట్‌ భూములను అక్రమ పద్ధతిలో లీజుకు తీసుకొని క్వారీయింగ్‌ సమయంలో వచ్చే వధా మెటీరియల్స్‌ డంపింగ్‌ కు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ క్రషర్‌ మిల్లులకు,క్వారీలకు విద్యుత్‌ సౌకర్యం కల్పనలో కూడా భారీ గా అక్రమాలు చోటు చేసుకున్నాయి అని అవి అన్నీ పూర్తిస్థాయిలో విచారణ చేస్తే బయటపడతాయి.పర్యావరణ నిబంధనలు అధికారులు పూర్తిగా గాలికోదిలారు. ఎన్విరాన్మెంటల్‌ క్లియరెన్స్‌ లేదు అని తెలుస్తుంది.వాటి గురించి అధికారులు అడగడం గానీ తెలుసుకోవడం గానీ ఉండదని అర్థం అవుతున్నది. మైనింగ్‌ మాఫియా అడ్డం దిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ గుట్టలను తోలచటం వలన పశు పశుపక్ష్యాదులకు,చిన్న చిన్న జీవరాశులకు అవాసం కూడా కనుమరుగవుతున్నట్లు పశులకాపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క హరితహారం కార్యక్రమం చేపట్టి అడవులను గుట్టలను నాశనం చేయవద్దని పదే పదే చెబుతున్న ఫారెస్ట్‌ డిపార్ట్మెంట్‌ మౌనం వహించడం వెనుక అర్థం పరమార్థం అర్థం అవ్వటం లేదు.ఫారెస్ట్‌ డిపార్ట్మెంట్‌ నియమ నిబంధనల ప్రకారం మొక్కలను ధ్వంసం నాశనం చేయటం శిక్షార్హం. గుట్టలో మైనింగ్‌ మాఫియా నాశనం చేసినటువంటి ప్రతి మొక్కకు నష్ట పరిహారం వసూలు చేయడంలో కూడా ఫారెస్ట్‌ డిపార్ట్మెంట్‌ ఉదాసీనత చూపించడమే కాకుండా తిరిగి మొక్కలు నాటిచ్చాడం లో కూడా అలాగే ప్రవర్తించిందని అలాగే మొక్కలను నాశనం చేసిన మాఫియాపై డిపార్ట్మెంట్‌ తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తాత్కాలిక పరిమిషన్‌ లతో పర్మినెంట్‌ గా మైనింగ్‌ సాగిస్తుంది అని తెలుస్తుంది.కొన్ని ప్రభుత్వ శాఖల కలయిక ఈ మైనింగ్‌ మాఫియా అక్రమాలకు అండదండలు సాగిస్తోంది.ఈ గుట్టల్లో జరిగే అక్రమ మైనింగ్‌ పై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ప్రకతి సహజ సంపదను భావితరాలకు వారసత్వంగా కాపాడాలని స్థానికులు కోరుకుంటున్నారు. అలాగే గుట్టను పూర్తిగా తొలచగా మిగిలిన భూమి చదును చేయగా వచ్చిన వందల ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు మైనింగ్‌ మాఫియా సిద్ధంగా ఉన్నారు.దీనిపై రెవెన్యూ మరియు మైనింగ్‌ అధికారులకు పిర్యాదులు కూడా ఇవ్వటం జరిగింది.మైనింగ్‌ మాఫియా పై చట్టపరమైన చర్యలు తీసుకొని తక్షణమే అక్కడ మైనింగ్‌ కార్యక్రమాలను నిలుపుదల చేసి పూర్తి విచారణ చేసి చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మైనింగ్‌ మాఫియా వలన జరిగిన నష్టాన్ని పుడ్చలేము జరగబోవు నష్టాన్ని అధికారుల రూపంలో ఆపగలం అని ఇప్పటికైనా ఆపగలిగే అధికారమ్‌ అధికారుల చేతిలో ఉందని తక్షణమే మైనింగ్‌ తవ్వకాలను మరియు క్రషర్‌ రింగ్‌ ను నిలుపుదల చేయాలని సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు.