దేశీయ ప్రయాణాలకు పచ్చజెండా

సడలింపుల పై ప్రత్యేక దృష్టి పెట్టిన డొనాల్డ్ ట్రంప్ 

వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టకపోయినా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలసడలింపు పై ప్రత్యేక దృష్టి పెట్టారు. వచ్చేవారం నుంచి దేశీయ ప్రయాణాలకు పచ్చజెండా ఊపారు. శ్వేతసౌధంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా రవాణా సౌకర్యాలను పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. తర్వలోనే భారీ ర్యాలీలు నిర్వహించేందుకు సైతం సిద్ధపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే లాక్డౌన్‌ అమెరికా ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతినడంతో, ట్రంప్ ఆంక్షల సడలింపుల పై దృష్టిసారించారు. ఈ నేపథ్యంలోనే వచ్చేవారం తాను అరిజోనా రాష్ట్రంలో పర్యటించనున్నట్లు వెల్లడించారు. ఈ పర్యటన కేవలం ఆర్థిక కలాపాలను బలో పేతం చేయడానికేనని, ఇందులో రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. కరోనా వైరస్విజృంభించాక ట్రంప్ వాషింగ్టన్ వదిలి బయటకు వెళ్లడం ఇదే తొలిసారి. అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన ఒహాయో రాష్ట్రంలోనూ రాబోయే రోజుల్లో పర్యటిస్తానని, త్వరలోనే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడతానని ట్రంప్ అన్నారు. అందుకోసం భారీ సభలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సుమారు 25వేల మందితో సభలు నిర్వహిస్తామని వెల్లడించారు. అనంతరం కరోనా వైరస్ పై స్పందిస్తూ.. కొవిడ్ మహమ్మారి దానంతట అదే పోతుందని, వ్యాక్సిన్ పై ఆధారపడట్లేదని చెప్పారు. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. వ్యాక్సిన్ ఉన్నా లేకున్నా ఆర్థిక పరిస్థితిని బలో పేతం చేయాలనుకుంటున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే, వైరస్ పోయేంత వరకు అందరూ ఓపికపట్టాలన్నారు. వైరస్ దానంతట అదే పోతుందని, త్వరలోనే నశించిపోతుందని పేర్కొన్నారు. లా డౌన్లో నష్టపోయిన ఆర్థిక రంగం త్వరలోనే గాడిన పడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, గడిచిన 24 గంటల్లో అమెరికాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 2,502గా నమోదైంది. అంతకుముందు రెండు రోజులతో పోలిస్తే బుధవారం మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో అమెరికాలో మొత్తం మృతుల సంఖ్య 61,361కిపెరిగింది.