ఇక వాహనాలు సీజ్…..!!

తెలంగాణ పోలీస్ కొత్త రూల్స్ అమలు

యావత్ ప్రపంచం ఇప్పుడు కరోనా మహమ్మారితో వణికిపోతోంది. మన దేశంలో కూడా దీని ప్రభావం దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఉంది. తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో మాత్రం కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. అందులో యాదాద్రి భువనగిరి జిల్లా ఒకటి. ఇక్కడ శ్రీ లక్ష్మినర్సింహ స్వామి వారి కరుణా కటాక్షం వల్లే ఈ జిల్లాల్లో కరోనా సోకలేదని, సాక్షాత్తు ఆ మహావిష్ణువే శ్రీ లక్ష్మి నర్సింహస్వామి రూపంలో ఈ జిల్లా ప్రజలను కాపాడుతున్నాడని స్థానికులు చెప్పుకుంటున్నారు. జిల్లాలోని దాదాపు ఏడున్నర లక్షల మంది ప్రజల ప్రాణాలను కాపాడే దేవుడిగా ఉన్నాడని నమ్ముతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడటం కోసం ఆలయంలోని పండితులు కూడా ప్రతి నిత్యం స్వామివారికి ప్రత్యేక పూజలు, యాగాలు నిర్వహిస్తున్నారు. స్వయంభు క్షేత్రంగా వెలసిన యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని రెండో తిరుపతిగా కేసీఆర్ ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. ఎంతో చరిత్ర, మహిమ కలిగిన ఈ పుణ్య క్షేత్రంలో నరసింహస్వామి వంద రూపాలతో నిత్యపూజలు అందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి పొందారు.గ్రహ పీడితులు,మానసిక రోగులు, ఇక్కడ సకల పీడల నుంచి రక్షణ కల్పించే ఈ స్వామికి ప్రదక్షిణల మొక్కు చెల్లించుకుంటే ఆయా బాధల నుంచి త్వరగా విముక్తి పొందుతారని భక్తుల ప్రగాఢ నమ్మకంగా ఉంది. త్రేతాయుగంలో యాదమహర్షి చేసిన తపస్సుతో నారసింహుడు ఇక్కడ అయిదు రూపాల్లో సాక్షాత్కరించాడని స్థలపురాణం చెబుతోంది. జ్వాలా నరసిం హుడు, యోగా నారసింహుడు, గండభేరుండ నారసింహుడు, ఉగ్ర నారసింహుడు, శ్రీ లక్ష్మీ నారసింహ రూపాల్లో యాద మహర్షికి దర్శమిచ్చిన స్వామి.. లోకకల్యాణార్థం ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆ మహర్షి కోరిక పై లక్ష్మి నర్సింహ స్వామిగా ఇక్కడే ఉండిపోయారని చరిత్ర చెబుతోంది. మనిషిలోని వికృత ఘోషలు, వింత వ్యాధులను , అరికట్టడంలో ఆ నర్సింహస్వామికి ప్రత్యేక మహిమలు ఉన్నాయని వేలాది మంది భక్తులు విశ్వసిస్తారు. లోక వినాశా నానికి వచ్చినప్పుడు కాపాడేందుకు ఆ స్వామివారి దివ్యశక్తితో పాటు దివ్య సుదర్శన చక్రం, మంగళ హారతులిచ్చే మహాకాల చక్రం ఉపయోగపడుతాయని వివిధ పురాణాల ద్వారా తెలుస్తోంది. అరిష్టాలన్నీ తొలగించి ప్రజలందరికి సుఖశాంతులను ప్రసాదించే ఆ లక్ష్మి నర్సింహస్వామికి స్థానిక ప్రజలు కరోనా మహమ్మరి నుంచి కాపాడాలని ప్రతి నిత్యం పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. లక్ష్మి నర్సింహస్వామి గిరి ప్రదక్షణం వల్ల ఎలాంటి దుష్ట శక్తులైనా, ఎలాంటి వ్యాధులైనా దగ్గరకు రావని ఇక్కడి ప్రజల విశ్వాసం. స్వామి పాదాలను ఆ మహావిష్ణువే కడిగి కర్మ విమోచుడైనట్లు కథనాలు ఉన్నాయి. బోగ, ప్రేత,పిశాచ, వ్యాధుల నివారణ కోసం స్వామివారి స్మరణం చేస్తున్న భక్తులు కరోనా మహమ్మరి వల్ల సర్వ అవస్థలు పడుతున్న రాష్ట్ర,దేశ ప్రజలకు విశ్వ వైద్యుడై కాపాడాలని ఆ కలియుగ దైవం శ్రీ నర్సింహ స్వామిని ఆరాధిస్తున్నారు.