కరోనా కట్టడి పై

కలిసుందాం రా కరోనా వైరస్ ను కలిసికట్టుగా ఎదుర్కొందాం అని ట్రంప్ కి ట్వీట్ చేసిన మోదీ

న్యూఢిల్లీ: “విపత్కర పరిస్థితులే మిత్రులను మరింత దగ్గర చేస్తాయి. భారత్ – అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. మానవతా దృక్పథంతో సాయానికి భారత్ ఎప్పుడూ ముందుంటుంది. కరోనా పై పోరులో భారత్ చేయాల్సిందంతా చేస్తోంది. కరోనా వైరస్ ను కలిసికట్టుగా ఎదుర్కొందాం” – ట్విటర్‌లో ప్రధాని మోదీ కరోనా చికిత్సకు ఉపయోగపడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు కృతజ్ఞతలు తెలిపారు. మోదీని అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించిన ట్రంప్ భారత్ చేసిన సాయాన్ని గుర్తుంచుకుంటామన్నారు. ప్రధానికి, భారత ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసిన అగ్రరాజ్యాధినేత అసాధారణ సమయాల్లో స్నేహితుల మధ్య పరస్పర సహకారం అవసరమని పేర్కొన్నారు. దీనిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. “మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్… ఇలాంటి సమయాలు మిత్రులను మరింత దగ్గర చేస్తాయి. భారత్-అమెరికా భాగస్వామ్యం ముందు కంటే మరింత బలో పేతమయ్యింది. కొవిడ్-19కు వ్యతిరేకంగా మానవాళి చేస్తున్న పోరాటానికి తమవంతు సాయంగా భారత్ చేయగలిగినదంతా చేస్తుంది. దీనిని (కరోనా) మనం కలిసి జయిస్తాం” అని మోదీ ట్విటర్ ద్వారా సమాధానమిచ్చారు. కరోనా చికిత్సలో వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు అందించాలంటూ అమెరికా, బ్రెజిల్ తో సహా 30 దేశాలు భారత్ కు విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో తమ దేశ అవసరాలకు సరిపడా నిల్వలు ఉంచుకుని, మిగిలిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని భారత్ నిర్ణయించిన విషయం తెలిసిందే. కరోనా పై పోరాటానికి మానవతా దృక్పథంతో భారత్ చేయగలిగిన సాయమంతా చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కరోనా వైరసను కట్టడి చేసే యాంటి మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్వీన్ కావాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ ను అడిగిన విషయం తెలిసిందే. అమెరికా కోరిక మేరకు భారత్ క్లోరోక్విన్ మాత్రలను ఆ దేశానికి సరఫరా చేసింది. దీని పై ట్రంప్ స్పందిస్తూ…. అసాధారణ పరిస్థితుల్లో స్నేహితుల మధ్య మరింత సహకారం అవసరమని అన్నారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ పై నిర్ణయం తీసుకున్న భారత్ కు, ఆ దేశ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… విపత్కర పరిస్థితులే మిత్రులను మరింత దగ్గర చేస్తాయన్నారు. భారత్-అమెరికా సంబంధాలు ఇదివరకు ఎన్నడూ లేనంతగా మరింత బలపడుతున్నాయన్నారు. కోవిడ్ పై కి పోరాటానికి భారత్ చేయగలినంతా చేస్తుందన్నారు. కరోనా వైరసను కలికి కట్టుగా ఎదుర్కొంటూ విజయం సాధిద్దామని పేర్కొన్నారు.