కరోనాను తరిమే నమో దీప కాంతులు
సర్వమత సమ్మత ఐక్యతా దీపం వెలిగిద్దాం..సమూలంగా కరోనాను తరిమేద్దాం
-నేటి రాత్రి 9 గంటల 9 నిమిషాలకు వెలుగు దీపాలు సిద్ధం -మోదీ పిలుపు మేరకు ఐక్యంగా స్పందిస్తున్న జనం -దేశమంతటా ఇప్పుడు ఇదే చర్చ.. -మతాతీతంగా విజయవంతం చేసేందుకు రెడీ -మోదీ పిలుపు వెనక శాస్త్రాలు వెతుకుతున్న ఛాందసులు -కేవలం ఐక్యత కోసమే అంటున్న కమలనాధులు -మినీ దీపావళి జరుపుకునేందుకు మేము సైతం అంటున్న ప్రజలు
కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ఆదివారం ప్రజలందరూ తమ తమ ఇళ్లల్లోని విద్యుత్ లైట్లన్నీ ఆ పేసి, జ్యోతులు వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపు నిచ్చిన విషయం విదితమే. అయితే దీనికి సంబంధించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి కవితా గానాన్ని ప్రధాని మోదీ శనివారం రోజు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు… ఆ కవిత ఇదే… “రండి.. తిరిగి దీపాలను వెలిగిద్దాం…పట్టపగలే చిమ్మ చీకటి నీడ చేతిలో ఓడిన సూరీడు..అంతరాళల్లోని ప్రేమను పిండుకుందాం….ఆరిన వత్తిని వెలిగిద్దాం… రండి… తిరిగి దీపాలను వెలిగిద్దాం..మజిలి యే మన గమ్యంగా భావిద్దాం… కన్నుల నుండి లక్ష్యం దాగి ఉన్నది..వర్తమాన మోహపు వలలో పడి..రేపటి భవిష్యత్తు మరవద్దు… రండి తిరిగి దీపాలను వెలిగిద్దాం… అసంపూర్తి యజ్ఞంలో ఆహుతులు మిగులు మన వారిని చుట్టు ముట్టిన విఘ్నాలు…అంతిమ విజయపు ‘వజ్ర’ నిమిత్తం నూతన దధీచుల అస్తికల కరిగిద్దాం..రండి… తిరిగి దీపాలను వెలిగిద్దాం…” అన్న మాజీ ప్రధాని వాజ పేయి కవితా పంక్తులను ప్రధాని మోదీ ట్విట్టర్ లో పోస్టు చేశారు.
హైదరాబాద్: ఏప్రిల్ 5వ తేదీన అంటే ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో 9 నిమిషాలపాటు ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లవద్దనే ఉండి ఇళ్లల్లోని విద్యుత్ లైట్లన్నీ ఆ పేసి, జ్యోతులు వెలిగించి, తమ ధృఢ సంకల్పాన్ని వెల్లడించాలి. చమురు దీపాలు లేదా కొవ్వొత్తులు, టార్చ్ లైట్లు లేదా సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్లు… ఏవి వీలైతే అవి వెలిగించి, కరోనా అనే చీకటిని, ఆ మహమ్మారిని తరిమేద్దాం అనే సంకల్పం తీసుకోవాలి. నా కోసం మీ విలువైన సమయంలో ఓ 9 నిమిషాలు కేటాయించండి. జనతా స్పూర్తిని మరోమారు చాటండి’ అని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశ ప్రత్యేకత అని సాధారణంగా చెప్తూ ఉంటాము. భిన్నత్వాన్ని మనం గౌరవిస్తాం కానీ మీరెప్పుడైనా ఈ భిన్నత్వాన్ని అనుభూతి చెందే ప్రయత్నం చేసారా? మనం ఒకానొక జాగృతావస్థలో ఉన్నాం అని నేను ప్రతిసారీ చెప్తూ వస్తున్నాను. భారతదేశంలోని వైవిధ్యాలను అనుభూతి చెందండి, వాటిని స్పృశించండి, వాటి పరిమళాన్ని అస్వాదించండి అని ప్రత్యేకంగా మన యువతతో చెప్పాలనుకున్నాను. మీరు చూడండి, మీ వ్యక్తిత్వ వికాసానికి కూడా మన దేశంలోని వైవిధ్యాలు పెద్ద పాఠశాలలుగా మారగలవు అని ఒకానొక సందర్భంలో ప్రధాని మోదీ తెలిపారు. కి భారతదేశంలో చెప్పుకోవాల్సిన మతాలు మూడు. హిందూ, ముస్లిం, క్రైస్తవం, అయితే ఏ మతంలోనైనా కొవ్వొత్తి కావొచ్చు, కాగడాలు కావొచ్చు, దీపాలు కావొచ్చు. ఏవైనా వెలుగును ప్రసాదించేవే తప్ప ఇందులో మతానికి సంబంధించినది అంటూ ఏదీ లేదు. కాకపోతే హిందువులు ప్రతినిత్యం ఇంట్లో, వాకిళ్లలలో, గుళ్లలో దీపాలు వెలిగించడంతో అదేదో మతానికి సంబంధించిన కార్యక్రమంగా చాలా మంది అపోహపడుతుంటారు. సాధారణ భాషలో దీపం అంటే జ్ఞానం. దీపం అంటే ఒక ధైర్యం. దీపం అంటే వెయ్యి ఏనుగుల బలం. ఒక మనో సంకల్పం. ప్రస్తుత పరిస్థితిలో దేశ ప్రజలకు కావలసినవి ఇవన్నీ. వీటినే మోదీ దీపం అనే జ్ఞాన బలంతో మన సంకటాలను దూరం చేసుకోవాలంటూ పిలుపునిస్తున్నారు. ప్రధాని మోడీ జాతికి ఇచ్చిన సందేశంలో కరోనా నివారణ చర్యలు, పేదల ఆకలి కేకలు తీర్చే ప్రణాళిక, వలస కూలీకి భరోసా ఉంటాయని అంతా భావించారు. కానీ ప్రధాని మోడి వాటిని టచ్ చేయకుండా కరోనా నిర్మూలను దీపాలు వెలిగిద్దాం అంటూ ప్రకటన చేశారు. భారతీయ సంప్రదాయంలో ప్రతి ఇంటిలోని దేవుని మందిరంలో దీపం వెలిగించాలి. కొందరు పొద్దున వెలిగిస్తే మరి కొందరు పొద్దున, సాయంత్రం కూడా వెలిగిస్తారు. కొన్ని గృహాల్లో అఖండ దీపారాధన వుంటుంది. దీపంతో వెలుగు ఏర్పడుతుంది. చీకటిలో దీపం మనకు దారిని చూపించి ధైర్యాన్ని ఇస్తుంది. దీపమనేది ఒక జ్ఞానంలాంటిది. . అజ్ఞానాన్ని, చీకట్లను పారదోలుతుంది. మనలోని అహాన్ని దీపపు వెలుగుల్లో ఆవిరి చేయాలి. దీపం ఎప్పుడూ పైకి వెలుగుతూ వుంటుంది. దీపశిఖ స్పూర్తిగా మనం కూడా జ్ఞానపు వెలుగులను అందుకుంటూ ఉన్నత శిఖరాలను అందుకోవాలన్నదే దీప పరమార్థం. మోదీ చెప్పింది ప్రతి ఇంట్లో 9వ తారీఖున 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించాలి అని. అలా విడుదలైన వెలుగులు ఆకాశంలో పోటాన్ శక్తిగా మారి, నవగ్రహాల ప్రయోగ కక్షలోకి వస్తాయి. అలా రావటం వల్ల నవ గ్రహాలు మరింత శక్తివంతంగా తయారవుతాయి. అప్పుడు అవి క్వాంటం శక్తిగా, ఆ తర్వాత అటామిక్ ఎనర్జీగా మారి కరనో వైరస్ నిర్మూలను కారణం అవుతాయి అని. ఇక ఇదే కోవలో మరో కారోనా దీపం కథ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ కరోనా దీపం కథ ప్రకారం 5 వ తారీకు 4 వ నెల .. సమయం రాత్రి 9 గంటలు.. దీపాలు పెట్టవలసిన సమయం 9 నిమిషాలు..ఆ రోజు దశమి .. చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదవ తిథి దశమి. అధి దేవత యముడు. తొమ్మిదిని మృత్యుంజయ సంఖ్యగా భావిస్తారు. సంఖ్యా శాస్త్రంలో తొమ్మిదవ అంకెను ‘బ్రహ్మసంఖ్య’ దైవసంఖ్యబీ వృద్ధి సంఖ్య మరియు పురాణ సంఖ్య అని కూడా పేరు ఉంది. బిడ్డ తల్లి గర్భంలో ఉండేది 270 రోజులు. . నవమాసాలు పెరిగేది తల్లి గర్భము లో …మనిషి శరీరానికి ఉన్న రంధ్రాలు కూడా ‘తొమ్మిది’. సర్పానికి తప్ప సృష్టిలోని దీక్ష ప్రతి ప్రాణికి తొమ్మిది రంధ్రాలు ఉండవలసిందేనట. కలియుగం పొడుగు 4,32,000 సంవత్సరాలు. ఈ సంఖ్యలో అంకెల మొత్తం 9. ద్వాపర యుగం పొడుగు దీనికి రెండింతలు, అనగా 8,64,000 సంవత్సరాలు. ఈ సంఖ్యలో ఉన్న అంకెలని కలపగా 18, వీటిని కలపగా 9. ఇదే విధంగా త్రేతాయుగం, క ృతయుగం. ఈ నాలుగు యుగాల కాలం అయిన ఒక మహాయుగంలో 43,20,000. ఈ సంఖ్యలో అంకెలని కూడగా 9. ఒక కల్పంలో 71 మహాయుగాలు కనుక కల్పంలో 30,67,20,000 సంవత్సరాలు. ఇందులో ఉన్న అంకెలన్నీ కలిపితే 18, వీటిని కలిపితే 9. నవగ్రహాలు.. నవ రత్నాలు . .. మహాభారతంలోని పర్వాలు 18, మహాభారత యుద్ధ దినాలు 18, మహాభారత సైన్యం 18 అక్షహిణులు. బగవద్గీత అద్యాయలు 18. (ఒకటి ఎనిమిది కిలిపితే తొమ్మిది అవుతుంది కదా!) భగవాన్ వ్యాసమహర్షి రచించిన పురాణాలు కూడా 18. సరిగ్గా రాత్రి 9 గంటలు.. వేదాలలో 9 కి ఎంతో ప్రత్యేకత ఉంది.. గ్రహాలు 9.. కావున . కరెక్ట్ గా 9 నిమిషాలు కరెంట్ తీసేసి అంధకారం చేయడం వలన క్రిమిలకు ఏమి జరుగుతుందో అర్థం కాదు.. వెంటనే దీపాలు వెలింగించడం వలన ఒకేసారి క్రిముల కండ్లు మసక బారి ఏమి జరుగుర్తుందో అర్థం కాదు.. అప్పుడు కరెక్ట్ గా మన గొంతు నుండి నమో మోడీ నమో మోడీ అనే వచ్చే అరుపు క్రిముల పాలిట మృత్యు పాశం అవుద్దీ.. ఎవ్వరో కానీ వేదాలని అపసోపాన పట్టిన మహనీయుడు ఈ ఐడియా ఇచ్చాడు.. నమో మోడీ.. నమో మోడీ… ఏ పని అయినా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం చేస్తారు.లోకాలకి వెలుగుని,తేజస్సుని ప్రసాదించే సూర్యుడు జీవుల పై దయతో తాను లేనప్పుడు వారికి జీవాన్ని, శక్తిని ప్రసాదించటం కోసం అస్తమిస్తూ తన తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడట.శరీరంలో ప్రాణంలాంటిది ఇంట్లో దీపం.అందుకే సర్వ జీవులకి ప్రాణదాత అయిన సూర్యుని అస్తమయానికన్నముందుగా ఇంట్లో సంధ్యా దీపం పెట్టే సంప్రదాయాన్ని ఏర్పరచారు మన పెద్దలు.ఇక దీపాన్ని, దీపమే కదా అని తీసేయడానికి వీలు లేదు.ఎందుకంటే కష్టాలలో దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు కాపాడేది కూడా దీపారాధనే.మరి ఎలా దీపారాధన చేస్తే ఆపదలో వున్నవారు రక్షింపబడుతారో తెలుసుకుందాం. మనిషి తన జీవితంలో విపరీతమైన కష్టాలు ఏర్పడి,దిక్కుతోచని స్థితిలో వున్నప్పుడు.దుర్గాదేవి దేవాలయంలో 14 రోజులపాటు ప్రదోషకాలంలో అమ్మవారి ఎదురుగుండా పసుపురంగు గుడ్డమీద మేలిమి గంధం,పసుపు, కుంకుమపొడి చల్లి,దాని మీద మట్టి ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో ఆవనూనెతో ఒక వత్తి వేసి.తూర్పు ముఖంగా చూసే విధంగా దీపారాధన చేయాలి.అంతేకాకుండా దుర్గాదేవి ప్రీతికోసం చీర,రవికల గుడ్డ, గాజులు,పువ్వులు అన్నీ ఎరుపు రంగులో ఉండేవి దానం ఇవ్వాలి.దీని ద్వారా శక్తిసామర్థ్యాలు,ధైర్యం పెరిగి, కార్యసిద్ధి కలుగుతుంది. ఇక వాహన ప్రమాదాలు తరుచుగా జరుగుతున్నప్పుడు, 8 బుధవారాలు శివాలయంలో ఉండే అర్చకుడికి స్వయంపాకం దానంగా ఇచ్చి,ఆ ఆలయంలో మట్టి ప్రమిదలో ఆవునెయ్యి పోసి దక్షిణ ముఖంగా దీపం వెలిగించాలి. ఇలా చేస్తే తప్పక మీకున్న ఇబ్బందులు తొలగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. సైన్స్ ప్రకారం కూడా చూస్తే ఏప్రిల్ 5 తేదీ ఆదివారం అయింది ఆరోజు వామన ద్వాదశి, మఖ, పుబ్బ నక్షత్రములు ( సింహరాశి ) లో సంచరించున్న సమయంలో దీపం పెడితే సూర్య గ్రహానికి సంబంధించిన వారం, రాశి కనుక భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఆరోగ్యం కుదుట పడి చెడు దగ్ధం అవుతుంది అని శాస్త్ర వచనం. దైవోపాసన మార్గంలో ఉండే వారికి అర్ధం అవుతుంది. అందుకని అందరూ ఖచ్చితంగా దీపం పెట్టండి శుభం కలుగుతుంది. దీపం :- నూనె, నెయ్యితో మాత్రమే దీపారాధన చేయండి ఇది ఆరోగ్యదాయిని. ఈ దీపం వెలిగించే నూనెలో కొంచెం కర్పూరం, లవంగం వేసి వెలిగిస్తే మీ ఇంటి పరిసర ప్రాంతంలో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది. పొరపాటున ఎలాక్ట్రానిక్ సంబధించిన లైట్స్ అంటే టార్చ్ , సెల్ ఫోన్ తో వచ్చే లైట్ వలన శుభం కంటే అశుభం ఎక్కువ జరిగే అవకాశం ఉంది ఎలాగంటే జ్యోతిష పరంగా ఎలాక్ట్రానిక్ లైట్ అంటే రాహును ప్రభావితం చేస్తుంది. రాహువు బలపడితే కాలసర్ప ప్రభావం పెరుగుతుంది, మతపరమైన భేదాభిప్రాయాలకు కారకుడు అవుతాడు కాబట్టి ఎలాక్ట్రానిక్ లైట్ వద్దు అని సూచించడం జరుగుతున్నది. సైన్స్ ప్రకారం కూడా చూస్తే :- ప్రతి ఇంటిలో 9 గంటల 9 నిమిషాల 9 సెకన్లకు 9 దీపాలు వెలిగిస్తే ప్రతి దీపం యొక్క వెలుగు ఆకాశంలోకి విడుదల అవుతుంది, ఇలా విడుదల అయినా అన్ని దీపాల వెలుగులు ఫోటాన్ శక్తులుగా మారుతాయి. అప్పుడు 9 ‘నవ గ్రహాలు అన్నీ అత్యంత శక్తివంతంగా తయారవుతాయి. అవి ప్రయాగ కక్ష్య లో తిరగడం వల్ల ఒకేసారి కొన్ని కోట్ల దీపాల వెలుగుల వల్ల 33 కోట్ల దేవతలు రాహు, కేతువుల నుండి విముక్తులై ఆ ఫోటాన్ శక్తిని క్వాంటం శక్తిగా, ఆ క్వాంటం శక్తి అటామిక్ ఎనర్జీగా మారుస్తారు, ఆ అటామిక్ ఎనర్జీ యే కరోనాను చంపుతుంది. బహుశా అందుకే మన ప్రధానిగారి దీప ప్రజ్వలన పిలుపు అయి ఉంటుంది. అదే మన సంస్కృతి, మన సనాతన హిందు ధర్మరహస్యం.
