వైరసన్ను తరిమే కూలర్
త్వరలో మహారాష్ట్ర ఆసుపత్రులలో ప్రవేశపెట్టనున్న సైటెక్ ఎయిర్ఆన్
న్యూఢిల్లీ: ఇళ్లలో కంటే… ఆస్పత్రుల్లో వైరస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే… అక్కడకు రకరకాల పేషెంట్లు వస్తుంటారు. అక్కడ రకరకాల వైరస్లు ప్రబలుతుంటాయి. ముఖ్యంగా కరోనా వైరస్ లాంటి వాటిని కంట్రోల్ చెయ్యడానికి ఇప్పుడు ఎన్నో రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా వైరస్లను తరిమేసే యంత్రం అందుబాటులోకి వచ్చింది. దాని పేరు సైటెక్ ఎయిర్ఆన్. ఇది చూడటానికి మన ఎయిర్ కూలర్ లాగే ఉంటుంది. కానీ ప్రతి 8 సెకండ్లకూ… 10 కోట్ల నెగెటివ్ అయాన్లను గాల్లోకి వదులుతుంది. ఫలితంగా ఆస్పత్రుల్లో, ఇళ్లలో ఉండే వైరస్ లో… 99.7 శాతం తగ్గిపోతాయి లేదా చచ్చిపోతాయి. ఈ యంత్రం వైరలను ఎలా చంపుతుందంటే… ఈ వైరస్ పై చుట్టూ ప్రోటీన్ ఉంటుంది. ఈ యంత్రం నుంచీ ఒక రకమైన డిటర్జెంట్ గాల్లోకి వెళ్తుంది. అది వైరస్ల కొవ్వుపై వాలుతుంది. అంతే… ఆ కొవ్వు కరుగుతుంది. దాంతో వైరస్ చచ్చిపోతుంది. వైరస్లకు కారణమయ్యే కార్బన్ మోనాక్సైడ్, నెట్రోజన్ డై ఆక్సైడ్ వంటి ప్రమాదకర వాయువుల్ని ఈ యంత్రం నాశనం చేస్తుంది. ఈ యంత్రం మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కూలర్ వంటి ఈ యంత్రం ప్రతి 8 సెకన్లకు 10 కోట్ల నెగిటివ్ అయాన్లను వెదజల్లుతుంది. తద్వారా కేవలం గంటలోనే ఆస్పత్రి గదుల్లో వైరస్ల ప్రభావాన్ని (వైరల్ లోడు ) 99.7% తగ్గిస్తుంది. వైరస్ల లుతుంది. ఉపరితలంపై ఉండే ప్రోటీన్ ను ఈ యంత్రం నుంచి వచ్చే డిటర్జెంట్ ప్రాపర్టీ ధ్వంసం చేస్తుంది. కార్బన్ మోనాక్సైడ్, నెట్రోజన్ డై ఆక్సైడ్ వంటి కలుషిత వాయువులను నిర్వీర్యం చేస్తుంది. ఇన్ ఫెక్షన్లు, హానికారక వాతావరణ కారకాలను తట్టుకొనేలా శరీర శక్తిని పెంచడం దీని మరో ప్రత్యేకత. పుణెకు చెందిన ‘సైటెక్ పార్క్’ అనే అంకుర సంస్థ అభివృద్ధి చేసిన ఈ యంత్రాన్ని ఇప్పటికే పలు రకాల వైరలపై విజయవంతంగా ప్రయోగించారు. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలతోపాటు విమాన క్యాబిన్లు, ఇళ్లలో వాడకానికి ఇది అనువుగా ఉంటుంది. ఈ యంత్రాల ఉత్పత్తి కోసం కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ రూ.కోటి విడుదల చేసింది. త్వరలో అందుబాటులోకి రానున్న వెయ్యి పరికరాలను మహారాష్ట్రలోని వివిధ ఆసుపత్రుల్లో ఏర్పాటుచేయనున్నారు. కొవిడ్ రోగులకు చికిత్సనందించే వైద్యులు, పారామెడికల్ సిబ్బంది వైరస్ బారిన పడే ముప్పును తాజా యంత్రం తగ్గించే అవకాశముంది.