జ్యోతిషుడు చెప్పాడు..350 సీట్లు మావే

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లో 2022లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 350 సీట్లు గొస్తామని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. ఇటీవ ఓ జ్యోతిషుడు ఈ విషయాన్ని తన చేయి చూసి చెప్పారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కు గణన చేపడతామన్నారు. పార్టీ కార్యాయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇటీవ విమానంలో దిల్లీ వెళుతున్నప్పుడు ఓ జ్యోతిషుడు నా చేయి చూసి కష్టపడి పనిచేస్తే 350 సీట్లు సాధిస్తారని అన్నారు. మీరే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఆయన చెప్పినట్టే కష్టపడి పనిచేసి 2022 ఎన్నికల్లో ఆయన చెప్పిన దానికంటే ఒక్క సీటు ఎక్కువే తెచ్చుకుంటా’’ అని అఖిలేష్‌ ధీమా వ్యక్తం చేశారు. అబద్ధాు చెప్పి భాజపా 300 సీట్లు గెవొచ్చేమో గానీ, నిజాయతీతో కష్టపడి పనిచేసి తాము 351 సీట్లు సాధిస్తామని అన్నారు.
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కులా వారీగా జన గణన చేపట్టకుంటే తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని హామీ ఇచ్చారు. రాబోయే బిహార్‌ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని స్పష్టంచేశారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో పాల్గొనే అంశంపై పార్టీ నేతతో చర్చిస్తున్నామని తెలిపారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాకు గానూ భాజపా నేతృత్వంలోని ఎన్డీయే 325 సీట్లు గ్చొకోగా.. ఎస్పీ 47, బీఎస్పీ 19 స్థానాకే పరిమితమయ్యాయి.