హైదరాబాద్‌ మెట్రో రెండోదశలో మూడు కొత్త మార్గాు

మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రెండో దశ నిర్మాణంలో భాగంగా రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ)వరకు మెట్రోను విస్తరించేందుకు ప్రణాళికు సిద్ధం చేస్తున్నామని.. దీనికిగానూ డీపీఆర్‌ను సిద్ధం చేసినట్లు హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.  రెండో దశలో రాయదుర్గం నుంచి ఆర్జీఐఏ (31 కి.మీ.), క్డీకాపూల్‌ నుంచి ఆర్జీఐఏ, నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు నూతన మార్గాను ఏర్పాటు చేయానే ఆలోచనలో ఉన్నట్లు ఎన్వీఎస్‌ రెడ్డి వివరించారు. పాతబస్తీలో 5 కి.మీ. మేర మెట్రో నిర్మాణానికి ప్రణాళికు సిద్ధం చేశామన్నారు. ప్రయాణికు ద్వారా హైదరాబాద్‌ మెట్రోకి రోజుకి రూ. కోటి, మెట్రో మాల్స్‌ నుంచి నెకు రూ. 10 కోట్ల ఆదాయం సమకూరుతున్నట్లు ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దాదాపు 16 కోట్ల మందికిపైగా మెట్రోలో ప్రయాణించారన్నారు.
చిత్తూరు జిల్లాలోని తిరుపతి నుంచి తిరుమ కొండపైకి మెట్రో ప్రాజెక్టు విషయంలో మూడు రోజు సర్వే చేసినట్లు ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. తిరుమ మొత్తం రిజర్వ్‌ ఫారెస్ట్‌ కింద ప్రకటించారని.. మెట్రో ప్రాజెక్టు విషయంలో త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తామని అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి తిరుమకు మెట్రో ప్రాజెక్టుకు ఒక మంచి మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయనున్నట్లు ఆయన చెప్పారు.