సభ అనుమతుపై హైకోర్టు నోటీసు
హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లకు నోటీసు జారీ
హైదరాబాద్: తెంగాణలో సభు, సమావేశాకు సంబంధించిన అనుమతుపై బుధవారం హైకోర్టులో విచారణ కొనసాగింది. విశ్రాంత ఐఏఎస్ షఫీక్ ఉజ్జమాన్ దాఖు చేసిన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం విచారించింది. సభకు చివరి నిమిషంలో అనుమతి నిరాకరిస్తున్నారని.. కనీసం వారం ముందే దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాని పిటిషనర్ కోరారు. వాదను విన్న ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీతో పాటు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లకు నోటీసు జారీ చేసింది. మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పర్యవేక్షణ గృహాపై సమగ్ర నివేదిక సమర్పించండి..రాష్ట్రంలోని పర్యవేక్షణ గృహా(అబ్జర్వేషన్ హోమ్స్)పై సమగ్ర నివేదిక సమర్పించాని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పర్యవేక్షణ గ ృహాల్లో కనీస వసతు లేవన్న అంశంపై ఇవాళ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్ నేత ృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పర్యవేక్షణ గ ృహాల్లో వసతు లేమిపై కరీంనగర్ జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా ఉన్నత న్యాయస్థానం స్వీకరించింది. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పర్యవేక్షణ గృహాల్లో కనీస వసతు లేవని లేఖలో జడ్జి పేర్కొన్నారు. జిల్లాలోని స్వాధార్, వెలిచా గృహాల్లో వసతు లేకపోవడంతో బాలు ఇబ్బంది పడుతున్నారని లేఖలో సెషన్స్ జడ్జి పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం, మహిళా సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శుకు నోటీసు జారీ చేసింది. వారితో పాటు జైళ్ల శాఖ డీజీ, కరీంనగర్ కలెక్టర్, ఎస్పీకి కూడా ఉన్నత న్యాయస్థానం నోటీసు జారీ చేసింది.