‘పుల్వామా అమరు త్యాగాన్ని మర్చిపోం’
ప్రధాని మోదీ, రాజ్‌నాథ్, అమిత్ షా నివాళి
దిల్లీ: సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదు భీకర దాడికి తెగబడ్డారు. ఆ ఘటనలో 40 మంది సైనికు అమరుయ్యారు. పుల్వామా దాడి జరిగి ఏడాది అవుతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమరుకు నివాళుర్పించారు. వారి త్యాగాన్ని భారత్ ఎన్నటికీ మర్చిపోదన్నారు.
‘గతేడాది పుల్వామా దాడిలో ప్రాణాు కోల్పోయిన ధీర జవాన్లకు నివాళి. దేశ సేవ, రక్షణ కోసం తమ జీవితాను అంకితం చేసిన గొప్ప వ్యక్తు వారు. ఆ అమరు త్యాగాను యావత్ భారతం ఎన్నటికీ మర్చిపోదు’ అని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘2019లో ఇదే రోజున జరిగిన పుల్వామా దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళుర్పిస్తున్నాం. వారి త్యాగాను దేశం ఎన్నటికీ మర్చిపోదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ దేశం ఏకమైంది. దేశ రక్షణ కోసం ముష్కరుపై పోరు కొనసాగించేందుకు మేం కట్టుబడి ఉన్నాం’ అని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. మాత ృభూమి సార్వభౌమత, సమగ్రత కోసం గొప్ప త్యాగం చేసిన ధీర జవాన్లు, వారి కుటుంబా పట్ల భారత్ ఎప్పుడూ గర్వపడుతోందని కేంద్రమంత్రి అమిత్ షా ట్విటర్ ద్వారా నివాళుర్పించారు.
స్మారకస్తూపంతో నివాళి.. పుల్వామా దాడిలో ప్రాణాు కోల్పోయిన జవాన్ల త్యాగాకు గుర్తుగా జమ్ముకశ్మీర్‌లోని లెత్‌పొరా శిబిరంలో స్మారకస్తూపాన్ని ఆవిష్కరించారు. ఆ స్తూపంపై 40 మంది జవాన్ల పేర్లు, ఫొటోను ముద్రించారు. అమరువీరుకు ఇదే అసలైన నివాళి అని సీఆర్పీఎఫ్ అదనపు డైరెక్టర్ జుల్ఫికర్ హసన్ అన్నారు .