ప్రజా సమస్యలు విస్మరించారు

ఆప్‌ సర్కార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శ

న్యూఢిల్లీ :
అరవింద్‌ కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఢిల్లీ సర్కార్‌ ప్రజా సమస్యలను విస్మరించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఢిల్లీ వాసులకు ప్రధాని ఆవాస్‌ యోజన కింద ఇళ్లను నిర్మించేందుకు ఆప్‌ సర్కార్‌ చొరవ చూపలేదని దుయ్యబట్టారు. రానున్న ఢిల్లీ ఎన్నికలు ఈ దశాబ్ధంలో తొలి ఎన్నికలని భారత్‌ భవితవ్యానికి ఈ ఎన్నికలు కీలకమైనవని, అభివ ద్ధిని కాంక్షించే బీజేపీకి ఓటర్లు పట్టం కట్టాలని కోరారు. దేశ రాజధానిలోని ద్వారకా ప్రాంతంలో మంగళవారం ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ పలు కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిరాకరించిందని ఆరోపించారు.
పేదలకు రూ 5 లక్షల వరకూ ఉచిత వైద్య చికిత్సలు కల్పించే ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ఢిల్లీ పేదలు ఉపయోగించుకోలేకపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఏ ప్రభుత్వమూ చేయనంత వేగంగా దేశాన్ని తమ ప్రభుత్వం వేగంగా అభివద్ధి దిశగా నడిపించిందని చెప్పుకొచ్చారు. సీఏఏ, ఆర్టికల్‌ 370 వంటి జాతీయ భద్రతకు సంబంధించిన అన్నినిర్ణయాలకు తోడ్పాటును అందించే నాయకత్వం ఢిల్లీకి అవసరమని ఆకాంక్షించారు. బాట్లా హౌస్‌ ఉగ్రవాదుల పట్ల కన్నీరు కార్చే ఈ నాయకులు భద్రతా దళాల త్యాగాలను స్మరించలేరని విపక్షాలను దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్‌పై విమర్శకులు కూడా ప్రశంసలు గుప్పిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ బడ్జెట్‌ అత్యుత్తమమైనదని అంటున్నారన్నారు. అయితే కొందరు ఈ బడ్జెట్‌పై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఒప్పందం, త్రిపురలో బ్రూ-రాంగ్‌ తెగ సమస్య పరిష్కారానికి కుదుర్చుకున్న ఒప్పందం ఈ దశాబ్దంలో తన ప్రభుత్వ చారిత్రక విజయాలని చెప్పారు. దశాబ్దాలుగా రక్తపాతం, హింసతో బాధపడిన ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని నెలకొల్పినట్లు తెలిపారు. ఈ నెల 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్‌పై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. అయితే ప్రజలు ఇప్పుడు వాస్తవాలు తెలుసుకున్నారని, విమర్శకులు కూడా ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో ఇదే అత్యుత్తమ బడ్జెట్‌ అని అంగీకరిస్తున్నారని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన జే పీ నడ్డాను మోదీ సత్కరించారు. కేంద్ర బడ్జెట్‌పై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. మంగళవారం జరిగిన భాజపా పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీ ఎంపీలనుద్దేశించి ప్రసంగించారు. బడ్జెట్‌పై గందరగోళ పరిస్థితిని తీసుకురావాలని కొందరు యత్నించారని, అయితే ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో ఇదే ఉత్తమ బడ్జెట్‌ అని ఇప్పుడు విమర్శకులు కూడా అంగీకరిస్తున్నారని మోదీ అన్నారు. ఈ సందర్భంగా బోడో ఒప్పందం గురించి కూడా మోదీ ప్రస్తావించారు. బోడో ఒప్పందంతో పాటు బ్రూ తెగల సమస్యల పరిష్కారానికి చేసుకున్న ఒప్పందాలు తమ ప్రభుత్వ చారిత్రక విజయాలని కొనియాడారు. దశాబ్దాలుగా రక్తపాతం, హింసతో అల్లాడిపోతున్న ఈశాన్య ప్రాంతంలో ఈ నిర్ణయాలు శాంతిని నెలకొల్పుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, భాజపా ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన జేపీ నడ్డాను ప్రధాని మోదీ సన్మానించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.