మరింత సన్నని ఐప్యాడ్లు

ఆపిల్‌ సంస్థ నుంచి వచ్చే ఐ ప్యాడ్‌లు ఇక నుంచి మరింత సన్నగా ఉంటాయని ఆ కంపెనీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటి వరకూ ఏ ఐప్యాడ్‌ లేనంత సన్నగా మ్యాక్‌బుక్‌ మోడళ్లను తెస్తామని వారు చెప్తున్నారు. ఐప్యాడ్‌ మ్యాక్‌బుక్‌ ప్రోలలో ఆరు సన్నటి మోడళ్లు 2020 సంవత్సరానికి మార్కెట్‌లోకి వస్తాయని వెల్లడించారు. 0.29 అంగుళాల సన్నటి మ్యాక్‌బుక్‌ మోడళ్లలో ఓఎల్‌ఈడీ లైట్లను ఉపయోగించగా, సన్నటి మోడళ్లలో స్క్రీన్‌ డిస్‌ ప్లే కోసం చిన్న ఎల్‌ఈడీ లైట్లను, సన్నటి పిక్చల్స్‌ను ఉపయోగించబోతున్నట్టు వారు తెలిపారు. ఈ ఆరు సన్నటి మోడళ్లను రానున్న ఏడాదిలో ఎప్పుడైనా విడుదల చేయొచ్చని చెప్పారు. కాగా, ఈ సన్నటి మ్యాక్‌ బుక్‌ సైజ్‌ 16 అంగుళాలు ఉంటుందని టెక్‌రిపోర్టులు అంచనా వేస్తున్నాయి.