కమలం కౌంట్ డౌన్!
ఐదు రాష్ట్రాలలో పట్టు కోల్పోయిన కాషాయదళం..
- -జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడ్డ బీజేపీ
- -చేజార్చుకుంటున్న మిత్రపక్షాలు
- -ఒంటెత్తు పోకడలతో వివాదాస్పద నిర్ణయాలు
- -71 శాతం నుంచి 35 శాతానికి పడిపోయిన బీజేపీ గ్రాఫ్
- -ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్‌లో త్వరలోనే ఎన్నికలు
- -దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలలో కమలానికి చుక్కెదురు
- -పౌరసత్వ బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం
- -సోనియా నేతృత్వంలో బలం పుంజుకుంటున్న కాంగ్రెస్
- -బీజేపీ ప్రజాప్రతినిధులపై క్యాబ్ నిరసనల ప్రభావం
హైదరాబాద్:
దేశంలో బీజేపీ హవా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ సాచ్యురేషన్ స్థాయికి చేరడానికి దశాబ్దాలు పడితే, బీజేపీకి ఆరేళ్లలోనే ఈ స్థాయికి చేరినట్లు దేశ ముఖచిత్రం చెబుతోంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత దేశంలో బీజేపీ భవిష్యత్తుపై ప్రశ్నలవర్షం కురుస్తోంది. ఇదేసమయంలో అన్నిపార్టీలు తమ వెంట నిలవాలని కాంగ్రెస్ వెల్‌కమ్ సాంగ్ ప్లే చేస్తోంది. బీజేపీకి హిందుత్వ అంశం ఓట్లు కురిపించడం లేదా, ఆ పార్టీ డౌన్‌ట్రెండ్ మొదలైందా అన్న అంశంపైనే నేటి చర్చ…
గత లోక్‌సభ ఎన్నికల్లో సింగిల్ హ్యాండ్‌తో 303 సీట్లను బీజేపీ గెలిచినా, రాష్ట్రాల్లో మాత్రం ఆ పార్టీకి వరుస పరాభవాలు ఎదురవుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యపై అనుకూల తీర్పు, పౌరసత్వ సవరణ చట్టం వంటి ధమాకాలు ఉన్నా రాష్ట్రాల్లో అధికారం చేజారుతోంది. ఈ ఏడాదిలో మహారాష్ట్రలో శివసేనకు దూరమై బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. మహా షాక్ తర్వాత జార్ఖండ్ ఎన్నికల్లో ఓటమితో దేశంలో కమలం వాడిపోతోందన్న సంకేతాలు బలంగా వెళుతున్నాయి. 81 సీట్లున్న అసెంబ్లీలో- మ్యాజిక్ ఫిగర్ 42 సీట్లను కాంగ్రెస్-జేఎంఎం కూటమి చేరుకుంది. మైనింగ్ స్టేట్ జార్ఖండ్‌లో కాంగ్రెస్, జేఎంఎం సంబరాలు ఊపందుకున్నాయి.
జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ ఓటమిని ఒప్పుకుని రాజీనామా చేశారు. సీఎం కుర్చీలో కూర్చోడానికి జేఎంఎం నేత హేమంత్ సోరెన్ రెడీ అయ్యారు. ఓడిపోయిన బీజేపీ సాకులు వెతుక్కునే పనిలో ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకనే ఓడిపోయామని బీజేపీ సర్దిచెప్పుకునే ప్రయత్నం చేస్తోంది.
గత లోక్‌సభ ఎన్నికల్లో అపూర్వ మెజారిటీతో రెండోసారి అధికారానికి వచ్చిన బీజేపీ.. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చతికిలబడుతున్నది. రెండేండ్ల క్రితం (2017లో) దేశంలోని 71% భూభాగాన్ని ఏలిన కమలనాథులు తాజాగా జార్ఖండ్ ఓటమితో 35 శాతానికి తగ్గిపోయారు. 2017లో బీజేపీ హిందీ మాట్లాడే దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్నది. కానీ వరుసగా ఎదురవుతున్న ఓటములతో కాషాయ ‘సామ్రాజ్యం’ కుదించుకుపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో త్వరలో జరుగనున్న ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తన వ్యూహాలను సమీక్షించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. రెండేండ్ల క్రితం బీజేపీ సొంతంగా లేదా మిత్రపక్షాలతో కలిసి దేశంలోని 69 శాతం జనాభాపై అధికారం కలిగి ఉంది. నేడు అది 43 శాతానికి తగ్గిపోయింది. గత ఏడాది మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌తోపాటు రాజస్థాన్‌లో మొదలైన ఓటముల పరంపర తాజాగా జార్ఖండ్ వరకూ కొనసాగింది. లోక్‌సభ ఎన్నికల్లో గణనీయమైన విజయాన్ని నమోదు చేసిన కమలనాథులు.. అదే విధమైన ఫలితాలను అసెంబ్లీ ఎన్నికల్లో సాధించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న వర్గాలను పక్కనపెట్టి ఇతరవర్గాలకు ఊతమిచ్చే వ్యూహాన్ని బీజేపీ పునఃపరిశీలించుకోవాలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.
హర్యానా, మహారాష్ట్ర, జార?ండ్ రాష్ట్రాలలో బీజేపీకి వ్యతిరేకంగా జాట్‌లు, మరాఠాలు, గిరిజనులు సంఘటితమైన విషయాన్ని వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. హర్యానాలో జననాయక్ జనతా పార్టీతో చేతులు కలిపి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ మహారాష్ట్రలో ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి దాని ప్రయత్నాలకు గండికొట్టాయి. బీజేపీకి దీర్ఘకాలం మిత్రపక్షంగా ఉన్న శివసేనతో చేతులు కలిపిన ఎన్సీపీ, కాంగ్రెస్‌లు మహారాష్ట్రలో అధికారాన్ని కైవసం చేసుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి హర్యానాలో 58 శాతం, జార్ఖండ్‌లో 55 శాతం ఓట్లు వచ్చాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్‌లో 36 శాతం, హర్యానాలో 33 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కొద్ది నెలల వ్యవధిలోనే బీజేపీ దాదాపు 20 శాతం ఓట్లను కోల్పోయింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటివి అమలు చేస్తున్నప్పటికీ కాషాయ పార్టీ ఓటమి పాలవడం గమనార్హం. అయోధ్య తీర్పు కూడా బీజేపీకి లాభం చేకూర్చలేకపోయింది.
గతంలో కాంగ్రెస్ పార్టీని ఒక్కో రాష్ట్రంలో గద్దే దించుతూ అందలం ఎక్కుతూ వచ్చిన బీజేపీ నాయకత్వం కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం మొదలు పెట్టింది అన్నట్లుగానే ప్రధాన రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి చివరికి కేంద్రం లోనూ గద్దె దిగింది . ఇప్పుడు బీజేపీ కూడా ముప్త్ భారత్ రేసులోకి వచ్చేసింది . ఇప్పుడు యూపీ ,కర్ణాటక ,గుజరాత్ మినహా పెద్ద రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. దశబ్దా కాలంగా మోడీ ,అమిత్ షా లు పార్టీలో తిరుగు లేని ఆధిపత్యం చెలాయిస్తున్నారు . అమిత్ షా స్కెచ్ వేస్తె ఇక తిరుగే ఉండదని బీరాలు పలికిన కమలనాధులు ఈ చేదు పలితాలు ఎంతకూ మింగుడు పడడం లేదు .
కాంగ్రెస్ పార్టీ ఆర్థిక కష్టాలు ,నాయకత్వ లేమి వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలోనే ఇలాంటి సానుకూల ఫలితాలు రావడం ఆ పార్టీ కి పూర్వవైభవం ఫై ఆశలు మళ్ళి చిగురించాయి.మూడువందల కు పైగా ఎంపీ స్థానాలు సాధించి కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు ఒక్కో రాష్ట్రాన్ని చేజార్చుకుంటుంది. కశ్మిర్ లో ఆర్టికల్ 370 ని ఉపసంహరించక బీజేపీ ప్రభ అనూహ్యంగా పెరిగిందని కమలనాధులు సంబర పడ్డారు. కానీ ఆ ఊపులో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది .గతంలో ఒంటారిగా పోటీచేసినా ఎక్కువస్థానాలే సాధించిన బీజేపీ ఈసారి శివసేన తో పొత్తుపెట్టుకొని బరిలోకి దిగి దాదాపు 20 స్థానాలు కోల్పోయింది.అక్కడ సీఎం కుర్చీ కోసం అమిత్ షా ఓ రకంగా సర్కస్ పిట్లే చేశారు. అయిన అధికారం దక్కలేదు. బేరసారాలకు తెరలేపారు కానీ ఫలితం దక్కలేదు.పౌరసత్వ సవరణ చట్టం చేసాక జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో చేదు పలితాలు వచ్చాయి.
2014 ఎన్నికల్లో 45 స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చిన బీజేపీ 25 స్థానాలకు పరిమితం అయ్యింది. మహారాష్ట్ర తరహాలోనే మోడీ అమిత్ షాలు ఎన్నికల ప్రచారం విస్త తం గా నిర్వహించారు.అయినప్పటికీ ఓటర్లు బీజేపీని తిరస్కరించారు.జేఎంఎం కాంగ్రెస్ కూటమికి పట్టం కట్టారు.కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే బీజేపీ రెండు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది.
హర్యానాలో జేఎంఎం చేయూతతో గట్టెక్కింది. 2014 మొదటిసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అయిదు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. పార్టీకి కంచు కోటలాంటి రాజస్థాన్ .మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ ,పంజాబ్ చేజారి పోయాయి.వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ బీహార్ ,తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.అక్కడకూడా బీజేపీ కి అధికారం దక్కడం దుస్సాధ్యమే అంటున్నారు. కశ్మీర్‌లో 370 ఉప సంహరణ ,పౌరసత్వ సవరణ చట్టం తర్వాత మోడీ గ్రాఫ్ బాగా పెరిగిందని బీజేపీ మీడియా ఉదరగొడ్తుంది .కానీ అసెంబ్లీ ఎన్నికల పలితాలు మాత్రం ప్రతికూలంగా రావడం కమలనాథులకు మింగుడు పడడం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే తరహాలో మొదట ప్రధాన రాష్ట్రాలను కోల్పోయి చివరికి కేంద్రంలోను అధికారం కోల్పోయింది.