తెలంగాణకే ఆదర్శం
ఇబ్రహీంపూర్
అభివృద్ధిలో అన్నిరంగాలలో దూసుకెళుతున్న హరీష్‌రావు దత్తత గ్రామం
- ఐక్యతకు, అభివద్ధికి నిదర్శనం ఇబ్రహీంపూర్
- గ్రామంలో 1,232 మంది జనాభా
- ఉత్తమ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన హరీష్‌రావు
- ఊరంతా ఎక్కడ చూసినా పచ్చదనమే
- ఇంటింటా టాయిలెట్ సౌకర్యం
- ఆగష్టు నాటికి నమోదుకాని ఒక్క జ్వరం కేసు
- పచ్చదనం, పరిశుభ్రతకే ప్రాధాన్యం
- హర్యానా స్పీకర్ కన్వర్‌పాల్ కితాబు
- 29 రాష్ట్రాలకు చెందిన 60 మంది ఎమ్మెల్యేల సందర్శన
- ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఆదర్శగ్రామం
”పల్లెలు దేశానికి పట్టు కొమ్మలు అని గాంధీజీ చెప్పిన మాటలు అక్షరాల నిజం చేయడమే కాదు. ఇవాళ ఇబ్రహీంపూర్ గ్రామం ఇండియాలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులకే పాఠాలు నేర్పుతున్నది. హరిత హారం, ఇంకుడు గుంతలు, చెత్త సేకరణ, సౌర విద్యుత్, వంద శాతం అక్షరాస్యత.. లాంటి పలు అంశాల్లో ఇప్పటికే జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. కానీ ఇవాళ ఇక్కడి ప్రజల చైతన్యంతో గ్రామ సభలను సమర్థవంతంగా నిర్వర్తించి.. ఏ సమస్య ఉన్నా.. సమస్య పరిష్కారం దిశగా అడుగేసింది. ఎకతాటిగా గ్రామస్తులంతా కలిసి తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండటంలోను శెభాష్ అనిపించుకుంటూ ఇవాళ దేశంలోని కోట్లాది ప్రజలకు ఆదర్శమైంది”
హైదరాబాద్:
నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్‌లో 2019లో ఆగష్టు ఆఖరు వరకు జ్వరం, అతిసారం కేసులు నమోదు కాలేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేటలో ఇటీవల ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు చైతన్యంతో ముందుకు సాగడంతోనే ఇది సాధ్యమైందన్నారు. నియోజకవర్గంలోని గ్రామాలన్ని ఇదే బాట పట్టాలని పిలుపునిచ్చారు. ఇబ్రహీంపూర్‌లో 2015లో 11 జ్వరం, మూడు అతిసారం, 2016లో ఆరు జ్వరం, నాలుగు అతిసారం, 2017లో ఎనిమిది, 2018లో ఏడు జ్వరం కేసులు నమోదయ్యాయని వివరించారు. 2017, 2018లో ఒక్కరికీ కూడా అతిసారం రాలేదన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు గ్రామంలో ప్రజలు ఆరోగ్యంతో జీవనం సాగిస్తున్నారు.
ఇబ్రహీంపూర్ గ్రామంలో 267 ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించారని, వథా నీరంతా భూమిలోకి ఇంకుతోందని హరీశ్ తెలిపారు. కాలువల్లో మురుగు కనిపించడం లేదని, ఫలితంగా దోమల రహితంగా మారిందన్నారు. ఇంటింటా శౌచాలయం ఉందని, వాటిని వినియోగిస్తున్నారని తెలిపారు. గ్రామం బయట 46 గొర్రెల, 110 గేదెల షెడ్ల నిర్మాణంతో జీవాలు అక్కడ ఉంటున్నాయన్నారు. ఊరంతా లక్షల సంఖ్యలో మొక్కలు నాటడంతో పచ్చదనం విస్తరించిందని తెలిపారు. బాల వికాస ప్లాంటు, నియోజకవర్గ మంచినీటి పథకం ద్వారా అన్ని కుటుంబాలకు శుద్ధజలం అందుతోంది. ఫలితంగా అతిసారం కేసులు నమోదు కావడం లేదన్నారు. గ్రామంలో 1,232 మంది జనాభా ఆనందంగా జీవిస్తున్నారన్నారు. ఈ గ్రామంలో చేపట్టిన కార్యక్రమాలను అన్నిచోట్లా సంపూర్ణంగా అమలు చేసి జ్వరం, అతిసార రహిత గ్రామాలుగా మారాలని ఆకాంక్షించారు.
ఐక్యతకు, అభివద్ధికి ఆ గ్రామం నిదర్శనం. కలిసి పనిచేసుకుంటే ప్రతీ గ్రామం ఒక బ ందావనమేనని నిరూపించిన పల్లె. అభివద్ధి అంటే ఏంటో తెలియని ఆ కుగ్రామాన్ని ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. సిద్దిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్ ఇప్పుడు దేశం మెచ్చిన మోడల్ విలేజ్! ఇబ్రహీంపూర్! పరిచయం అక్కర్లేని ఆదర్శ గ్రామం. సిద్దిపేట రూరల్ మండలంలోని ఇబ్రహీంపూర్ ను ఎమ్మెల్యే హరీశ్ రావు దత్తత తీసుకుని అభివ ద్ధి చేశారు. గ్రామంలో ఇంటింటికి ఇంకుడు గుంత ఉంటుంది. హరితహారంతో పల్లె పచ్చగా మారింది. ఒకే గ్రామంలో రెండు లక్షల మొక్కలు నాటారు. కందకాల నిర్మాణం అబ్బురపరుస్తుంది. సుస్థిర వ్యవసాయం, పశుపాకల నిర్మాణం.. ఇలా ప్రతీదీ ఇక్కడ అద్భుతమే. ఉపాధి హామీలో భాగంగా గ్రామంలో 26 పనులు అమలు చేస్తున్నారు. గ్రామస్తులంతా ఐక్యంగా నిలిచి, ఇబ్రహీంపూర్ ను నందనవనంగా తీర్చిదిద్దుకున్నారు. అందుకే, ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఇబ్రహీంపూర్ ను సందర్శించి వెళ్తున్నారు.
తాజాగా 29 రాష్ట్రాలకు చెందిన 60 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇబ్రహీంపూర్ గ్రామాన్ని సందర్శించారు. ప్రజాప్రతినిధుల బందానికి ఎమ్మెల్యే హరీశ్ రావు స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో బ ందాన్ని స్వాగతించారు. అనంతరం ఈ బ ందం గ్రామంలో అభివద్ధి కార్యక్రమాలను పరిశీలించింది. ఇంకుడు గుంతలు, పంట పొలాలు, వైకుంఠధామాన్ని బందం సభ్యులు పరిశీలించారు. గ్రామస్తులంతా కలసికట్టుగా పల్లెను అభివ ద్ధి చేసుకున్న తీరును హరీశ్ రావు వారికి వివరించారు.
ఇబ్రహీంపూర్ గ్రామస్తులు చాలా అద ష్టవంతులన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. 29 రాష్ట్రాల నుంచి 60 మంది ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి గ్రామంలో జరిగిన అభివ ద్ధిని చూసి నేర్చుకుంటున్నారని చెప్పారు. ఇది ఇబ్రహీంపూర్ ప్రజల గొప్పతనమని, ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రశంసించారు. భవిష్యత్తులో గ్రామాన్ని మరింత ఆదర్శంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఇబ్రహీంపూర్ గ్రామాన్ని చూసి హర్యానా స్పీకర్ కన్వర్ పాల్ అబ్బురపడ్డారు. ప్రభుత్వ పథకాలను గ్రామస్తులు అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు. వాటర్ మేనేజ్ మెంట్ విషయంలో గ్రామ ప్రజలు కనబరిచిన ఐక్యత స్ఫూర్తిదాయకమని కితాబిచ్చారు. ఇబ్రహీంపూర్ రావడం చాలా సంతోషంగా ఉందన్న ఆయన.. అభివ ద్ధి, ఐక్యత విషయంలో ఇబ్రహీంపూర్ గ్రామం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రశసించారు.
ఇబ్రహీంపూర్ గ్రామ సందర్శన గొప్ప అనుభూతిని మిగిల్చిందని ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు చెప్పారు. అభివ ద్ధి విషయంలో ఈ గ్రామం దేశానికి అందించిన స్ఫూర్తి చాలా గొప్పదన్నారు. ఇబ్రహీంపూర్‌లో అమలు చేస్తున్న విధానాన్ని తాము కూడా అడాప్ట్ చేసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు చాలా బాగున్నాయని బీహార్ ఎమ్మల్యే మెచ్చుకున్నారు.
ఇబ్రహీంపూర్ గ్రామాన్ని సందర్శించడం సంతోషం కలిగించిందని బీహార్ కు చెందిన మహిళా ఎమ్మెల్యేలు చెప్పారు. సుస్థిర వ్యవసాయం, నీటి నిర్వహణ, పరిశుభ్రత, ఇంకుడు గుంతల నిర్మాణం, పశువుల పాకల ఏర్పాటు వంటి వాటిని ఇతర గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఇలాంటి పథకాల అమలు కోసం ప్రత్యేక చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఇబ్రహీంపూర్ ఆదర్శంగా తమ నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. ఐక్యతకు, అభివ ద్ధికి నిదర్శనం ఇబ్రహీంపూర్ గ్రామం. కలిసి పనిచేసుకుంటే ప్రతీ గ్రామం ఒక బ ందావనం అవుతుందని నిరూపించింది. గతంలో అభివద్ధి అంటే తెలియని ఈ పల్లెను హరీశ్ రావు ఆదర్శంగా తీర్చిదిద్దారు. ఒకప్పుడు మారుమూల గ్రామంగా ఉన్న ఇబ్రహీంపూర్.. ఇప్పుడు దేశం మెచ్చిన మోడల్ విలేజ్!
అన్నీ రి ”కార్డు”లే..!
పల్లెటూరంటే ఒకటో రెండో చెప్పుకోదగ్గ విశేషాలుంటాయి. ఈ ఊరికి వందల ప్రత్యేకతలున్నాయి. ఆ మాటకొస్తే జాతీయంగానూ ఈ విలేజ్ ప్రివిలేజ్ ని సంపాదించింది. మొన్నటి దాక ఇబ్రహీంపూర్ అని ఎవరినైనా అడిగితే.. ఓహో ఇంకుడు గుంతల ఊరా.. అనేవారు. ఇప్పుడు వెళ్లి అడిగితే.. అదో ఆదర్శగ్రామమని పేరొచ్చింది. వందశాతం మరుగుదొడ్లు, వందశాతం పన్నుల వసూలు, ఇంటింటికీ ఇంకుడుగుంత, దోమలు లేని ఊరు, ప్రతిష్ఠాత్మక అవార్డులు, లాభాల్లో సాగు, సమద్ధిగా భూగర్భజలాలు, ఊరంతా పచ్చదనం, సమష్టితత్త్వానికి నిదర్శనం. అభివద్ధి పుస్తకంలో ‘ఇబ్రహీంపూర్’ మొదటి అధ్యాయంగా మారడమే కాకుండా ఎన్నో జాతీయ స్థాయి అవార్డులను సంపాదించింది. వీటిలో జాతీయ గ్రామీణ నిర్మల్ పురస్కార్ -2013, జాతీయ స్థాయిలో స్వశక్తికరణ్ అవార్డు -2014-2015, రాష్ట్రీయ గౌరవ గ్రామ సభ అవార్డు-2017, స్వచ్ఛ విద్యాలయ జాతీయ స్థాయి అవార్డు-2017, స్వచ్ఛ విద్యాలయ రాష్ట్రస్థాయి అవార్డు-2017, రాష్ట్ర, జిల్లాస్థాయిలో ఉత్తమ పంచాయతీ అవార్డులు 3, రాష్ట్రస్థాయి హరితమిత్ర అవార్డులను పొంది.. ఎంతోమంది నాయకులకు ఈ గ్రామ ప్రజలు తమ అనుభవ పాఠాలు నేర్పుతున్నారు.
దేశంలో ఆదర్శ గ్రామాలు చాలానే ఉన్నాయి. కానీ ఇబ్రహీంపూర్ అన్నింటికంటే చెప్పుకోదగ్గది. ఎంతగా ఉంటే.. దేశ విదేశాల వారు సైతం వచ్చి ఊరి బాగోగుల్ని పరిశీలించి పోయారు. ఇప్పడు ఇబ్రహీంపూర్ ఒక టూరిజం స్పాట్.! ఇప్పటి దాక దాదాపు 25 విదేశీ బందాలు వచ్చి ఇబ్రహీంపూర్ గ్రామాన్ని సందర్శించి ఇక్కడి మార్పుని అధ్యయనం చేశాయి. భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటరీ జే.ఎస్.మాథుర్, కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్-ఏంఓఆర్డీ జాయింట్ సెక్రటరీ అపరంజిత సారంగి, దేశంలోని అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీఘర్ రాష్ట్రం మినహాయించి మిగతా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారులు వచ్చి ఈ గ్రామాన్ని సందర్శించి అధ్యయనం చేసి వెళ్లారు. ఈ గ్రామానికి ఇప్పటి వరకు దాదాపు 40 వేల మంది పై చిలుకు వరకు వచ్చి సందర్శించారు. ఈ గ్రామ సర్పంచ్ కుంబాల లక్ష్మీకి డెహ్రాడూన్ వెళ్లి ట్రైనీ ఐఏఎస్‌లకు గ్రామాభివద్ధి పాఠాన్ని వివరించే అవకాశం దక్కింది.
ఈ ఐదేళ్ల కాలంలో ఈ గ్రామానికి వేలాది మంది సందర్శకులు వచ్చారంటే వీరి పట్టుదల, కార్యదక్షతకు వందనం చేయాల్సిందే.