కలెక్టర్లే కీలకం

కీలక నిర్ణయాలను తీసుకునే అధికారం వారికే: కేసీఆర్‌ 
  • -లంచం ఇవ్వకుండా ప్రజలకు సత్వర సేవలు 
  • -నూతన రెవెన్యూచట్టంపై అభిప్రాయసేకరణ 
  • -జిల్లా కలెక్టర్ల వ్యవస్థ మరింత పటిష్టం 
  • -పట్టణాలు, గ్రామాల అభివద్ధికి పక్కా ప్రణాళికలు 
  • -60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక 
  • -ఎజెండాలో దాదాపు 32కి పైగా అంశాల్ణు
  •  -సుపరిపాలన లక్ష్యంతో ముందుకుసాగాలి 
  • -అధికారం చేపట్టాక తొలిసారి కలెక్టర్లతో సమావేశం
  •  -కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్‌ 

హైదరాబాద్‌: 
కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో కలెక్టర్లను పాత్రధారులను చేయడంకోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రగతిభవన్‌లో కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, సీఎస్‌, సంబంధిత శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. నయాపైసా లంచం ఇవ్వకుండా ప్రజలకు సత్వరం సేవలు అందేలా నూతన రెవెన్యూ చట్టం రూపొందాలన్న దఢ నిశ్చయంతో ఉన్న సీఎం కేసీఆర్‌.. ఈ సమావేశంలో కలెక్టర్లందరి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. 
జిల్లా కలెక్టర్ల వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడంతో పాటు వారికి కీలక బాధ్యతలను అప్పగిస్తున్నాం. ఇప్పటికే పంచాయతీరాజ్‌, పురపాలక కొత్త చట్టాల్లో వారికి ముఖ్య అధికారాలు కట్టబెట్టాం. కీలక నిర్ణయాలను తీసుకునే వీలు కల్పించాం. త్వరలో రానున్న కొత్త రెవెన్యూ చట్టంలోనూ కలెక్టర్లకు ప్రాధాన్యం కల్పించబోతున్నాం. వీటన్నింటిపైనా దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో సమావేశాలు నిర్వహించారు. నేడు కూడా సమావేశం కొనసాగనుంది. ఈ సందర్భంగా కలెక్టర్ల కొత్త పాత్రను వివరించడంతో పాటు కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన, పంచాయతీరాజ్‌, పురపాలక చట్టాల అమలుతో పాటు పట్టణాలు, గ్రామాల అభివద్ధికి నిర్దేశించిన 60 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణ, సాగునీటి వినియోగ ప్రణాళిక అంశాలపై ఇందులో చర్చించారు.ఈ కీలక సమావేశ ఎజెండాలో దాదాపు 32కి పైగా అంశాలున్నాయి. 
తొలిసారి కలెక్టర్లతో సమావేశం 
రాష్ట్రంలో రెండోసారి తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. తొలిసారిగా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఎన్నికలకు ముందు 31 జిల్లాలు ఉండగా.. అనంతరం వాటి సంఖ్య 33కి పెరిగింది. వీరి పనితీరుకు సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు సమాచారం తీసుకున్నామన్నారు. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలు, కార్యక్రమాలపై కొందరు కలెక్టర్లు బాగా పనిచేస్తుండగా.. మరికొందరు ఆశించిన స్థాయిలో రాణించలేదనే అసంతప్తి ఉంది ఉందన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన లక్ష్యంతో సీఎం కొత్త పంచాయతీరాజ్‌, పురపాలక చట్టాలను రూపొందించామన్నారు. ఇందులో కలెక్టర్లకు కొత్త అధికారాలు కల్పించాం. ఇదే తరహాలో కొత్త రెవెన్యూ చట్టం సిద్ధమవుతోంది. దీన్ని అత్యంత కీలకంగా భావిస్తున్నాం. దీనిపై ఇప్పటికే సుదీర్ఘ కసరత్తు జరిగింది. పార్లమెంటు ఎన్నికల సమయంలోనే కొత్త చట్టం గురించి వెల్లడించిన దానికి అనుగుణంగా రూపకల్పన చేపట్టాం. అధికారులు, నిపుణులతో చర్చలు జరిపాం. చట్టం కూర్పు తుది దశలో ఉండగా.. జిల్లా కలెక్టర్లు దీనిపై ఎలా పనిచేయాలనే దానిపై… వారి నుంచే అభిప్రాయాలను, సూచనలను, సలహాలను స్వీకరించి.. ఇందులో చేర్చాలని నిర్ణయించాం. రెవెన్యూశాఖలో అవినీతిపై ఇప్పటికే అసహనంగా ఉన్నాం. ఆ శాఖను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు వీలుగా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. 
కొత్త చట్టాల విధులపై స్పష్టత 
కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ఇప్పటికే అమల్లో ఉంది. గత నెలలో కొత్త పురపాలక చట్టం వచ్చింది. ఈ రెండింటికీ అనుగుణంగా 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సీఎం ప్రకటించారు. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు అధికారాల వికేంద్రీకరణతో నిధుల కేటాయింపు, ప్రజాప్రతినిధులకు బాధ్యతలు, విధులపై స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నామన్నారు. వీటన్నింటిపై కలెక్టర్ల సమావేశాల్లో విస్త తంగా చర్చించామన్నారు. త్వరలో పురపాలక ఎన్నికలు రానున్నాయి. వీటిని పురస్కరించుకొని పలు కీలక నిర్ణయాలను సీఎం ప్రకటిస్తామన్నారు. 
కలెక్టర్ల సమావేశంలో సీఎం ప్రారంభోపన్యాసం కాళేశ్వరం ప్రాజెక్టు విశేషాలతో సాగింది. గోదావరి ద్వారా, వర్షాల వల్ల సమకూరిన జలసంపద సద్వినియోగం అయ్యేలా జిల్లా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు హరితహారం, చేపలు, గొర్రెల పెంపకం వంటివి ఎజెండాలో ఉండటం గమనార్హం. 
కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో కలెక్టర్లను పాత్రధారులను చేయడంకోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రగతిభవన్‌లో కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, సీఎస్‌, సంబంధిత శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. నయాపైసా లంచం ఇవ్వకుండా ప్రజలకు సత్వరం సేవలు అందేలా నూతన రెవెన్యూ చట్టం రూపొందాలన్న దఢ నిశ్చయంతో ఉన్న సీఎం కేసీఆర్‌.. ఈ సమావేశంలో కలెక్టర్లందరి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. వాటిని క్రోడీకరించి నూతన చట్టంలో పొందుపరిచే అవకాశం ఉందన్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన పంచాయతీరాజ్‌, పురపాలక చట్టాల అమలు విషయంలో కూడా అభిప్రాయాలను ఈ సమావేశంలో తీసుకున్నారు. పట్టణాలు, గ్రామాల అభివద్ధికి నిర్దేశించిన 60 రోజుల ప్రణాళికపైనా సమావేశంలో చర్చించారు. కొత్త చట్టం రూపకల్పనతోపాటు, అమలులోకి వచ్చిన చట్టాల అమలు, 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలుపై జిల్లా కలెక్టర్లకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశనం చేశారు.