విడుదలైన అధికారిక నోటిఫికేషన్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణ రద్దుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ‘భారత పార్లమెంటు సిఫారసు మేరకు జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు రాష్ట్రపతి ఆమోదం తెలియజేయడమైనది. ఇక నుంచి ఆర్టికల్ 370లోని క్లాజ్లు చెల్లవు’ అని ఆ ఆధికరణ నోటిఫికేషన్ పేర్కొంది. రాష్ట్రపతి నోటిఫికేషన్ వెలువడంతో ఇక ఆర్టికల్ 370కి చెల్లుచీటి చెప్పినట్టే. ఆ ప్రకారం ఇక నుంచి జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతమవుతుంది. లద్దాఖ్ రెండో కేంద్ర పాలిత ప్రాంతమవుతుంది. జమ్మూకశ్మీర్ సొంత జెండా అదశ్యమవుతుంది. ఆ స్థానంలో భారత జాతీయజెండాను ఎగురవేస్తారు. ఆర్టికల్ 370, 35ఏ రద్దుతో దేశంలోని ఏ ప్రాంతం వారైనా జమ్మూకశ్మీర్‌లో ఆస్తుల కొనుగోలు, వ్యాపారాలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
చిన్నమ్మకు చివరి వీడ్కోలు