కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలను కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కశ్మీర్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందంటున్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గులా నబీ ఆజాద్. ప్రస్తుతం రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగుతున్నందున పరిస్థితులను అంచనా వేయలేమని, అయితే ఒక్కసారి నిషేధాలు ఎత్తివేస్తే ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తారా.. ఆగ్రహంతో రోడ్లు ఎక్కుతారా తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
”ప్రస్తుతం అక్కడ (జమ్మూ కశ్మీర్) కర్ఫ్యూ ఉంది. ఆ కర్ఫ్యూ ఒక్కసారి ఎత్తేస్తే.. 370, 35ఏ ఆర్టికల్స్ రద్దును జమ్మూ కశ్మీర్ ప్రజలు ఆహ్వానిస్తారా? ఆగ్రహిస్తారా? అనే విషయం తెలుస్తుంది. ఏదేమైనా కేంద్రం చర్యలపై కశ్మీరీల్లో అంతర్లీనంగా వ్యతిరేకత ఉందనేది స్పష్టం” అని గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇప్పటికే కార్గిల్ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం విధ్వంసర రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నామినేషన్ దాఖలుచేసిన ‘గుత్తా’
అసెంబ్లీ కార్యదర్శికి పత్రాలు అందజేత
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, దేవుడే ఇచ్చాడు